చాలా కాలం క్రితం, ఒక రొయ్యల గుంపు బీచ్ లో సంతోషంగా నడుచుకుంటూ వెళుతున్నాయి. అదే బీచ్ లో కొద్ది దూరంలో ఒక డజను పీతల గుంపు సముద్రంతో చాలా గట్టిగ గొడవపడుతున్నాయి.. ఆసక్తిగా, రొయ్యల గుంపులోని కొంతమంది కలిసి ఏమి చేస్తున్నారని..? అడగడానికి అని పీతల గుంపు వైపుగా వెళ్లారు.
“మేము తరంగాలతో పోరాడబోతున్నాం.” పీతల గుంపు బదులిచ్చారు. “సముద్రపు తరంగాలు మమ్మల్ని రాత్రిపూట నిద్రపోనీయడం లేదు. వారు చాలా బిగ్గరగా పాటలు పాడుతూ అరుస్తున్నారు.” అని బదులిచ్చారు పీతలు.
“మీరు ఈ పోరాటంలో గెలుస్తారని మేము అనుకోవడం లేదని ” రొయ్యలు చెప్పారు. “తరంగాలు చాలా బలంగా ఉన్నాయి, మరియు మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మీ కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి, మీరు నడుస్తున్నప్పుడు మీ శరీరాలు దాదాపుగా భూమికి వంగి ఉంటాయి.మిమ్మల్ని మీరు కూడా సరిగా నిలబెట్టుకోలేనప్పుడు వాటిని నిశ్శబ్దంగా ఉండాలని మీరు ఎలా ఆశించవచ్చు?” అన్నాయి రొయ్యలు.
ఇదంతా గమనిస్తున్న పీతలు, రొయ్యల మాటలకి గట్టిగ నవ్వాయి. అంతలోనే పీతలు కోపంతో … నేలమీద గట్టిగ కాలితో తన్ని…. .
“మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా .. ?” అని వారు అరిచారు. “ఇప్పుడు మీరు కూడా మా పోరాటంలో మాకు సహాయం చేయాలి.”
పీతల కోపాన్ని చూసిన రొయ్యలు దిక్కుతోచని స్థితిలో… యుద్ధంలో పీతలకు సహాయం చేస్తామని హామీ ఇచ్చాయి.
అంతలోనే ఒక సముద్రపు అల వారి పైకి దూసుకొని వచ్చింది అది చూసిన పీతలు, రొయ్యలతో మీరు కనీసం అల రావడాన్ని కూడా చూడలేకపోతున్నారు అసలు మాకేల సహాయం చేస్తారు..? అని హేళనగా మాట్లాడాయి. కొన్ని రోజులుగా ఆ యుద్ధం జరుగుతూనే ఉంది.
ఆరోజు అమావాస్య ఎప్పటిలాగే పీతలు మరియు రొయ్యలు సముద్రపు అలలతో యుద్ధానికి బయలుదేరాయి. పీతలు సముద్రానికి దగ్గరగా నిలబడ్డాయి వాటి వెనక యుద్ధ పోరాటానికి మద్దతుగా రొయ్యలు కూడా ఉన్నాయి. ఎప్పటిలాగే పీతలు రొయ్యలని హేళన చేస్తున్నాయి. అంతలోనే ఒక
పెద్ద అల వారి మీదికి దూసుకుని వచ్చింది అది గమనించిన రొయ్యలు వెంటనే అక్కడి నుండి పారిపోయాయి. కానీ, పీతలు సముద్రానికి అతి దగ్గరగా ఉన్నందున మరియు అల రావడం గమనించనందున తప్పించుకోలేక అలలతో పాటు సముద్రంలోకి కొట్టుకునిపోయి మరణించాయి.
చాలా కాలం తర్వాత కూడా వారి భర్తలు ఇంటికి రానందున , చనిపోయిన పీతల భార్యలు యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్లి తమ భర్తలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు ఒడ్డుకు చేరుకుని, భర్తలను వెతకడానికి నీటిలోకి ప్రవేశించగానే, అలల కారణంగా వారు కూడా చనిపోయారు. ఇదంతా తెలిసిన రొయ్యలు,
పీతల పిల్లలకి జరిగిన విషయం చెప్పి ధైర్యం చెప్పాయి. ఇక వారి పిల్లలు ఒంటరిగా జీవించసాగారు..
అప్పటినుండి పీతలు సముద్రానికి దగ్గరగా వెళ్లడం మానేసాయి.