పదవ తరగతి మాత్రమే పాస్ అయినా ఒక నిరుద్యోగ వ్యక్తి చాలా పెద్ద సంస్థలో “ఆఫీస్ బాయ్ మరియు అటెండర్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.మేనేజర్ అతనిని ఇంటర్వ్యూ చేసాడు. ఇంటర్వ్యూ తర్వాత ఆ వ్యక్తికి ఒక పరీక్ష పెట్టాడు. 10నిమిషాలలో ఈ ఫ్లోర్ ని శుభ్రం చేయండి అని . ఆ వ్యక్తి 10నిమిషాల లోపలనే ఫ్లోర్ చాలా నీట్ గా క్లీన్ చేసాడు.
అతని పనితనం నచ్చిన మేనేజర్ నువ్వు జాబ్ లో సెలెక్ట్ అయ్యావు. నీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వు నీకు కాల్ లెటర్ మరియు జాయినింగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను, ఆ రోజు నువ్వు జాయిన్ అవొచ్చు అని చెప్పాడు. ఆ మాట విన్న నిరుద్యోగి “నాకు కంప్యూటర్ గురించి ఏమాత్రం తెలియదు, ఈమెయిల్ కూడా లేదు” అని సమాధానం ఇచ్చారు.
అప్పుడు మేనేజర్, నువ్వు ఎంత ఆఫీస్ బాయ్ పనికోసం దరఖాస్తు చేసిన, నీకు నార్మల్ గా ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే..? ఇప్పటి జనరేషన్ లో కంప్యూటర్ తోనే పనులు జరుగుతున్నాయి. రేపటి రోజు నీకు టెక్నాలజీకి సంబంధించి ఏచిన్న పని చెప్పిన నువ్వు అది చేయలేవు. కావున..! నీకు ఇంత పెద్ద సంస్థలో జాబ్ చేయడానికి నీకు అర్హత లేదు అని చెప్పి పంపించేశాడు.
అది విన్న ఆ నిరుద్యోకి ఇక తాను ఏ చిన్న జాబ్ కి కూడా పనికిరాను అని అనుకున్నాడు. దిక్కుతోచని స్థితిలో తన జేబులో చూసుకున్నాడు. తన దగ్గర కేవలం 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పొద్దున నుండి ఏమి తినని కారణంగా అతనికి చాలా ఆకలి వేసింది. ఇపుడు ఈ డబ్బు ఆకలి కోసం ఖర్చుపెడితే ఇక తన దగ్గర ఎలాంటి డబ్బు మిగలదు. బాగా ఆలోచించాడు…. అప్పట్లో, టమాటాలకి బాగా ధర పెరిగిందని తెలిసిన ఆ నిరుద్యోగి రెండు కిలోల టమాటాలు కొని ఇంటింటికి వెళ్లి అమ్మడం ప్రారంభించాడు.
టమాటాలు ధర పెరిగినందున మార్కెట్లో టమాటాలు దొరకడమే కష్టమైంది. అలాంటిది ఇంటికి వచ్చి అమ్ముతున్నాడని తెలిసిన కాలనీ వాళ్లు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసారు. అపుడు అతనికి 200 రూపాయలు వచ్చాయి. టమాటాలు కొని తీసుకెళ్లిన ప్రతీసారి అతని పెట్టుబడి కంటే రెండింతలు లేదా మూడింతల ఎక్కువ డబ్బు సంపాదించాడు.
ఆ డబ్బులతో అతను ఒక బండి కొనుక్కొని రోజు మొత్తం టమాటాలు అమ్మడం ప్రారంభించాడు. కొన్ని రోజుల్లోనే అతను చాలా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో కూరగాయల మార్కెట్ లేని ప్రదేశంలో చిన్న కొట్టు ప్రారంభించాడు. అతను చాలా దూరం నుండి కూరగాయలు కాలనీకి
తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజుల్లోనే చాలా ప్లేసెస్ లో తన మార్కెట్ ని ప్రారంభించాడు.
10సంవత్సరాలలో తన కూరగాయల బిజినెస్ అన్ని రాష్ట్రాలలో వ్యాపించింది. అతను చాలా పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. తన తదనంతరం తన ఆస్తి తన భార్య మరియు పిల్లలకే చెందుతుంది అని వీలునామా రాయాలని అనుకున్నాడు. ఒక మంచి లాయర్ ని ఇంటికి పిలిపించి అన్ని ఫార్మ్స్ పైన సంతకం చేసాడు. అపుడు ఆ లాయర్, మీరు చాలా పెద్ద కోటీశ్వరులు మీకు చాలా ఆస్తులు ఉన్నాయి. కావున, ఇలా పేపర్స్ లో మాత్రమే ఆస్తులు ఉంచడం సరికాదు. మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పండి నేను ఈ ఫార్మ్స్ యొక్క అన్ని కాపీస్ మీకు మెయిల్ చేస్తాను మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అని చెప్పాడు.
అపుడు ఆ వ్యాపారి నాదగ్గర ఎలాంటి ఈ మెయిల్ అడ్రస్ లేదు మరియు నాకు టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు అని అన్నాడు. ఆ మాట విన్న లాయర్ ఆశ్చర్యపోయి…! మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్… మీ దగ్గర ఈమెయిల్ లేకపోవడం ఏంటి? మీకు టెక్నాలజీ పైన అవగాహన ఉండి ఉంటె మీరు ఏమయ్యేవారో..? ఊహించుకోండి అన్నాడు. అపుడు ఆ వ్యాపారి పెద్దగా నవ్వి ” నాకు టెక్నాలజీ పైన అవగాహన ఉండి ఉంటె నేనొక ఆఫీస్ బాయ్ ని అయి ఉండేవాడిని అని సమాధానమిచ్చాడు”.