చాలా మంది తల్లిదండ్రుల కలలానే నేను MBBS డిగ్రీని సంపాదించాను మరియు తరువాతి చదువును UK లో చదవాలనేది నా కల. దానికోసం నేను PLAB టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించాను. దీనివల్ల నేను UK లో 5సంవత్సరాల పాటు ఉండి నా చదువు కంప్లీట్ చేసుకొని తగిన ఉద్యోగం సంపాదించి తిరిగి ఇండియాకి రావొచ్చని నా ప్లానింగ్.
వీసా రాగానే UK కి ప్రయాణమయ్యాను. అన్నీ అనుకున్నట్లు జరుగుతున్నందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ ,ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తల్లి తండ్రులని వదిలి వెళ్తున్నందుకు లోపల బాధగా కూడా ఉంది. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తన జీవిత కాలపు సంపాదనతో నన్ను చదివించి, కష్టపడి వన్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నేను తన కంటే ఎక్కువ సంపాదించాలనేది నా తపన.
ఇన్ని ఆలోచనలో ఉండగానే UKలో ఫ్లాట్ కి చేరుకున్నాను. అన్నీ ఊహించినట్టుగానే ఉన్నాయి. కానీ, రోజులు గడిచిన కొద్దీ ఇంటి మీద బెంగ ఎక్కువైంది. ఖర్చులని అన్నిటిని అదుపులో ఉంచుకుని వారానికి ఒక్కసారి ఇంటికి కాల్ చేస్తున్నాను. అది కూడా చాలా చౌక ధర అయినా అంతర్జాతీయ ఫోన్ కాల్.
రెండు సంవత్సరాలు గడిచాయి. చదువు కంప్లీట్ చేసుకున్నాను. మెక్డొనాల్డ్స్ , కె ఎఫ్ సి మరియు డిస్కోలతో సమయం తెలియకుండా గడిపేస్తున్నాను. ఇప్పుడు ఇంటి ఊసు కూడా అంతగా ఉండట్లే.
రూపాయి విలువ తగ్గినప్పుడల్లా విదేశీ రేటు పెరుగుతుండటం చూసి ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటె నా సంపాదన ఇలువ పెడుతుందని ఆనందం. చివరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు 10 రోజుల సెలవులు మాత్రమే ఉన్నాయని నా తల్లిదండ్రులకు చెప్పాను. ప్రతిదీ ఈ 10 రోజుల్లో చేయాలి అని ఇండియా కి బయలుదేరాను. విమానంలో చౌక ధర కలిగిన టికెట్ ఒకటి బుక్ చేసుకున్నాను
ఇంటికి వెళ్తున్నానన్న సంతోషంలో అమ్మ నాన్నకు మరియు దగ్గరి బంధువులకు గిఫ్ట్స్ తీసుకున్నాను. ఇంటికి చేరుకున్న తరువాత నేను ఒక వారం రోజులు పాటు అమ్మాయిల ఫొటోస్ చూస్తూ ఉన్నాను. ఎవరిని సెలెక్ట్ చేయలేకపోయాను. చూస్తే ఇంకా 3రోజులు మాత్రమే ఉన్నాయి. అమ్మ నాన్నల సహాయంతో ఒక అమ్మయిని సెలెక్ట్ చేశాను. కానీ, 3రోజులలో పెళ్లి చేస్కోవడం అంటే చాలా హడావిడి అవుతుందని పెళ్లికి 3 సంవత్సరాలు ఆగమన్నాను. కానీ, అమ్మాయి తరపు వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ మరునాడే పెళ్లి చేసుకున్నాను.
అమ్మాయితో పాటు UK తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అమ్మ నాన్నలకు కొంత డబ్బు ఇచ్చి పొరుగు వారికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భార్యతో కలిసి UK బయల్దేరాను. నా భార్య, సుమారు రెండు నెలలు ఈ దేశాన్ని ఆస్వాదించింది. తరువాత ఆమెకి ఇంటి మీద బెంగ కలిగింది. వారంలో రెండుసార్లు, కొన్నిసార్లు వారానికి 3 సార్లు ఇంటికి కాల్ చేస్తూ మాట్లాడేది.
మా పొదుపులు తగ్గడం ప్రారంభించాయి.. సంవత్సరం తిరిగేలోగా మాకు కవల పిల్లలు పుట్టారు పాపా మరియు బాబు. నాతో మాట్లాడిన ప్రతిసారీ నా తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలని ఉందని చెప్పేవారు. నేను ఎన్ని సార్లు ఇంటికి వెళ్లాలి అనుకున్న వెళ్లలేకపోయా. ఇక నేను ఇంటికి వెళ్లాలి అనుకునే నిర్ణయం ఒక కలలా మిగిలిపోయింది.
ఒకరోజు నాకు మా బంధువుల నుండి కాల్ వచ్చింది. నా తల్లి తండ్రులు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఆ మాట విని నేనెంతో బాధపడ్డాను. కానీ, ఎంత ప్రయత్నించినా ఇంటికి వెళ్లలేకపోయా. కొన్ని రోజుల తర్వాత వారు కాలం చేశారని వార్తొచింది. మా దగ్గరి బంధువులే ఉన్నంతలో అన్ని కార్య క్రమాలు చేసేసారు. నా తల్లితండ్రులు నా పిల్లల్ని చూడకుండానే చనిపోయారని నాలో నేనే కుమిలిపోయాను.
కొన్ని సంవత్సరాల తర్వాత నా భార్య కోరిక మేరకు స్వదేశంలో సెటిల్ అవాలని బయల్దేరాను. నేను ఇండియాకి వెళ్ళాక తగిన ఇల్లు కొనుక్కోవాలి అనుకుని మంచి ఇంటి కోసం వెతకడం ప్రారంభించాను. ఇన్ని సంవత్సరాలలో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. నా పొదుపు తక్కువగా ఉండడంతో నేను ఒక్క ఇల్లు కూడా కొనలేకపోయా. తిరిగి UK వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ, నా భార్య నాతొ రావడానికి నిరాకరించింది. ఇక చేసేది ఏమి లేక 3 సంవత్సరాలలో ఇంకొంత డబ్బు సంపాదించుకుని వస్తానని చెప్పి తనని వదిలి నేను, పిల్లలు UK వెళ్ళిపోయాము.
3 సంవత్సరాలు కాస్త 10సంవత్సరాలు అయ్యాయి. నా కూతురు UK అబ్బాయిని పెళ్లి చేసుకుంది, అబ్బాయి వేరే దేశానికి వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా తిరిగి ఇండియాకి వచ్చేసాను.
సంపాదించిన మొత్తాన్ని కూడబెట్టి టు బెడ్ రూమ్స్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇపుడు నా వయస్సు 60సంవత్సరాలు. నా భార్య తన స్వంతింట్లోనే ఉండిపోయింది, పిల్లలు నన్ను ఒంటరిని చేసేసారు. నాన్నతో పోల్చుకుంటే నేను ఒక బెడ్ రూమ్ ఎక్కువ ఉన్న ఇల్లు సంపాదించాను. .
కిటికీ నుండి బయటకి చూస్తుంటే పిల్లలు అందరు ఆడుకుంటున్నారు. వారిని చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. నాన్నతో కలిసి ఆడుకున్న రోజులు గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా పిల్లలు అపుడపుడు కాల్ చేస్తూ నా బాగోగులు కనుక్కుంటున్నారు. వాళ్లు ఇలా అయినా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషపడుతున్నాను.
ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో నేను సంపాదించుకున్న దానికంటే పోగోయ్యుకున్నవే ఎక్కువ ఉన్నాయి. నాన్న కంటే ఎక్కువ సంపాదించాలనే తపనతో వాళ్లకి దూరంగా వెళ్లిపోయాను అలా వారిని చివరి రోజుల్లో చూసుకోలేకపోయాను. నా భార్య మరియు నా పిల్లలు కూడా నాకు దూరమయ్యారు. ఇక నా తల్లితండ్రుల లాగే నా మరణం తర్వాత నా చివరి కార్యం బంధువులే చేస్తారేమో.. అని మనసులో అనుకున్నాను. ఇపుడు నేను ఒక్కడినే ఒంటరిగా మిగిలి పోయాను.
“ ఇప్పటికి నా మదిలో ఒక ప్రశ్న మిగిలి ఉంది. అసలు నేనేమి సంపాదించానని”. కానీ…, దానికి నా దగ్గర సమాధానం లేదు…
Good moral, keep it up.
Thank you! also share with your family and friends.