ఒకప్పుడు ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు నివసించేవారు. ఆ ముగ్గురి యొక్క జీవనాధారం “వ్యవసాయం”. ఒకసారి ఆ ముగ్గురి పొలాల్లోని పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి. ప్రతిరోజు వారు తమ పంటలకు సహాయం చేయాలని విదవిదాలుగా ఆలోచిస్తున్నారు.
కానీ ఆ తెగులు బాగా పట్టడంతో పంట రోజురోజుకి పాడైపోతుంది. వారికి” ఈ వ్యవసాయం ఒక్కటే జీవనాధారం” కాబట్టి వాళ్ళు చాల బాధపడ్డారు.
చివరగా ఒకరోజు, వారి చివరి ప్రయత్నంగా కొన్ని ఆలోచనలతో వచ్చారు. ఒకరు” తమ పొలం చుట్టూ కంచె వేసారు”,”ఇంకొకరు పొలంలో పురుగుల మందు చల్లారు”. మరొకరు “తమ పొలంలో దిష్టిబొమ్మను పెట్టారు”.
ఇంత చేసినను వారి పొలంలో ఎలాంటి మార్పు రాలేదు. వారు ఇంకా దిగులు చెంది చివరికి ఆ గ్రామ పెద్దను ఆశ్రయించారు. వారి సమష్యను మరియు వారు చేసిన ప్రయత్నాల్ని విన్న తర్వాత, తెలివిగల గ్రామ పెద్ద మీ ముగ్గురు విడి విడిగా చేసిన ప్రయత్నాలు బాగున్నాయి. ఈ సారి “వాటన్నిటిని కలిపి చేయండి అని చెప్పాడు “. ఆ ముగ్గురికి వారు చేసిన తప్పు అర్థమైంది. .
ఆ ముగ్గురు వారి పొలాలకు కంచె వేశారు, దిష్టి బొమ్మని పెట్టారు మరియు పురుగుల మందును చల్లారు దానితో పంటకి పట్టిన తెగులు పోయి,మంచి లాభం వచ్చింది.
నీతి | Moral : ఏదైనా కష్టం వస్తే అందరు కలిసి తగిన నిర్ణయం తీస్కోండి మరియు కలిసి ఆచరించండి. తప్పకుండ మంచి ఫలితం ఉంటుంది.”ఐక్యతలో బలం ఉంది”.
Bharti s parpelli👍💐💐
Thank You!
ఐకమత్యమే మహాబలం కథ, సారాంశం బావుంది.
Thank You! Keep Reading.
Great story .. which we need to follow in real life👏👏👏👏❤️
Thank You! Keep Reading.
Unity is great strength…
Nice story 😊
Thank You! Keep Reading.