ఒకప్పుడు ఒక బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ బిడ్డ దేవుడితో “రేపు నన్ను భూమిలోనికి పంపబోతున్నావు” నేను చాలా చిన్నగా ఏ పని చెస్కోలేకుండా ఉన్నాను కదా1 నాకు ఎవరు సహాయం చేస్తారు? అని అడిగింది. దేవుడు నవ్వుతు ” చాలా మంది దేవతలలో ఒక దేవత ని నీకోసం చూసాను.” ఆమె నీకోసం వేచి చూస్తుంది నువ్వు భూమిపైకి వెళ్ళగానే తానే నిన్ను చూస్కుంటది” అని చెప్పాడు.
దేవుడుతో బిడ్డ ఇలా అంది ” ఇక్కడ స్వర్గంలో నేను పాడడం మరియు నవ్వడం తప్ప ఏమి చేయలేదు. అదే నన్ను చాల సంతోషంగా ఉంచింది. మరి భూమిపైకి వెళ్ళాక ఎలా అని?. అప్పుడు దేవుడు” మీ దేవదూత ప్రతిరోజూ మీ కోసం పాడతారు”. నువ్వు చాలా అనుభూతి చెందుతావు.
దేవుడిని బిడ్డ ఇలా అడిగింది ” ప్రజలు నాతో మాట్లాడినపుడు నేను ఎలా అర్ధం చేసుకోవాలి?” “నాకు వాళ్ళు మాట్లాడే భాష తెలుసా?” అప్పుడు దేవుడు “అది చాలా సులభం” నీ దేవదూత నీకు అన్ని చెప్తుంది,”ఓపికతో మరియు శ్రద్ధతో ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తుంది” అని చెప్పాడు.
నాకు మీతో మాట్లాడాలి అని అనిపించినపుడు ఏంచేయాలి అని అడిగింది బిడ్డ, దేవుడిని. అపుడు దేవుడు ” నీకు నీ దేవదూత నన్ను ఎలా ప్రార్థించాలి చెప్తుంది, అని చెప్పి దేవుడు బిడ్డని చూసి నవ్వాడు.
బిడ్డ ,దేవుడితో ” భూమిపైనా చాలా చెడ్డవాళ్ళు ఉంటారని విన్నాను. మరి నన్ను ఎవరు రక్షిస్తారు? అని అడిగింది. దేవుడు, “మీ దేవదూత ప్రాణాలను పణంగా పెట్టి మరీ నిన్ను రక్షిస్తుంది” అన్నాడు.
బిడ్డ చాలా విచారంగా “అంటే ఇకపై నువ్వు నాతో ఉండవా ?” అని అడిగింది. అపుడు దేవుడు ” నేను ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాను” అని బదులిచ్చాడు.
తిరిగి నేను మిమ్మల్ని ఎప్పుడు చూడగలను? అని బిడ్డ దేవుడిని అడిగింది. దేవుడు ” నువ్వు నీ దేవదూతను చూసిన ప్రతిక్షణం నన్ను చూస్తావు” అని సమాధానం చెప్పాడు.
అంతటితో స్వర్గం నిశ్శబ్దంగా మారింది, భూమీ నుండి శబ్దాలు వస్తున్నాయి. అపుడు బిడ్డ ” దేవుడా నేను ఇప్పుడే పుట్టబోతున్నాను” ఇంతకీ నా దేవత పేరు చెప్పగలవా? అని అడిగింది. అప్పుడు దేవుడు నవ్వుతు పేరుతో పనిలేదు. నువ్వు నీ దేవదూతను ఇలా పిలుస్తావు “అమ్మ “. అని చెప్పి దేవుడు మాయమయ్యాడు.
Superb msg….
Thank you! Please share the website with your friends and family too.
Super
Glad you liked it! Please share the website with your friends and family too.
కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. చాలా బావుంది.
👌🍫💐💐
Thank you!
Seriously chala chala bagundhi nd nenu amma anni ayenandhku iam Happy
Congratulations!
Start reading the moral stories to him. so that he will enjoy it too:)