A Cracked Pot
A Cracked Pot

ఒకానొక సమయంలో భారత దేశంలో ఒక నీటిని అమ్మే వ్యక్తి దగ్గర రెండు పెద్ద కుండలు ఉన్నాయి.  ఒక్కొక్కటి ఒక కర్ర  యొక్క ప్రతి చివరన గట్టిగ కట్టాడు. కుండలలో ఒకదానికి  పగుళ్లు ఉన్నాయి, మరియు మరొక కుండ ఎలాంటి పగుళ్లు లేకుండా  ఉంది. ఆ వ్యక్తి ప్రతిరోజు ఆ రెండు కుండల సహాయంతో ఒక నది నుండి తన యజమాని ఇంటికి నీటిని సరఫరా చేస్తున్నాడు. కానీ పగిలిన కుండా కారణంగా ఒకటిన్నర కుండల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు.

అలా రెండు సంవత్సరాలు గడిచింది. ఆ వ్యక్తి ప్రతిరోజు ఒకటిన్నర కుండల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నాడు. ఒకరోజు ఆ కుండలు మాట్లాడుకున్నాయి .అందులో పగుళ్లు లేని కుండా గర్వంగా నేను రోజు పూర్తి నీటిని సరఫరా చేస్తున్నాను కానీ నువ్వు  కేవలం సగభాగం నీటి ఇస్తున్నావు అని హేళన చేసింది. దానితో పగుళ్లు ఉన్న కుండ సిగ్గుపడింది.

పగిలిన కుండ ఇది తన వైఫల్యమని భావించి, ఒక రోజు నీటిని అమ్మే వ్యక్తి  నది దగ్గర నీటిని తీసుకుంటున్న సమయంలో మాట్లాడింది.

 “నేను నా గురించి సిగ్గుపడుతున్నాను, నేను మీతో క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను”. నీటిని మోసే వ్యక్తి అడిగాడు  “ఎందుకు? నువ్వు  ఎందుకు  సిగ్గుపడుతున్నావు ? ” కుండ బదులిచ్చింది , “ఈ గత రెండు సంవత్సరాలుగా నేను  సగం నీటిని మాత్రమే సరఫరా ఇవ్వగలిగాను, ఎందుకంటే నాలో  ఉన్న ఈ పగుళ్లు మీ యజమాని ఇంటికి వెళ్ళేటపుడు  నీరు బయటకు పోయేలా చేస్తుంది. నా లోపాల కారణంగా, మీ కష్టానికి పూర్తి ఫలితం లభించట్లేదు అని అన్నది.

పగులు  కుండను  నీటిని  మోసేవాడు క్షమించాడు, మరియు అతని కరుణతో, “నేను  యజమాని  ఇంటికి వెళ్లేప్పుడు మార్గం వెంట ఉన్న అందమైన పువ్వులను గమనించు ” అని చెప్పాడు. మార్గ గుండా ఒక వైపుగా రంగు రంగుల  పువ్వులు సూర్యుడి వెలుతురులో చాలా అందంగా వికశిస్తున్నాయి. అది చూసి పగిలిన కుండ కి చాలా ఆనందంగా అన్పించింది. కానీ మల్లి యజమాని ఇంటికి వెళ్లేసరికి తన నుండు నీరు కారిపోయి  సగభాగం నీటిని మాత్రమే ఇచ్చింది. మల్లి నీటిని మోసే వ్యక్తికి క్షమాపణ చెప్పింది. 

అప్పుడు నీటిని మోసే వ్యక్తి నవ్వుతు నువ్వు  మార్గం గుండా పూవులను చూసావు కదా! కానీ ,పువ్వులు ఓకే వైపున ఉన్నాయి మరియొక వైపుగా లేవు. ఇది నీ నుండు కారిన నీటి ఫలితమే. నీ లోపం గురించి నాకు ఎప్పుడో తెలుసు, కానీ నేను దానిని సద్వినియోగం చేసుకున్నాను.

 నేను  దారిలో పూల విత్తనాలను నాటాను, ప్రతి రోజు నేను నది  నుండి తిరిగి నడుస్తున్నప్పుడు, నీనుండి  నీరు కారిపోతు ఆ విత్తనాలపై పడి  అవి మొలకెత్తాయి మరియు అందమైన పూలు ఇచ్చేలా చేసాయి. రెండు సంవత్సరాలుగా నేను  నా యజమాని  టేబుల్ ను  అలంకరించడానికి ఈ అందమైన పువ్వులను వాడుతున్నాను. దాని కారణంగా నేను నా  యజమాని నుండి ప్రశంశలు మరియు అదనంగా డబ్బుని సంపాదిస్తున్నాను. యజమాని కూడా ఆ పూల సువాసనలతో ఆనందపడుతున్నాడు అని చెప్పాడు. నువ్వు ఇలా ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు అని సంతోషంగా పగిలిన కుండతో చెప్పాడు. ఆ పగిలిన కుండ కూడా ఎంతో ఆనందపడింది.

నీతి  | Moral : మనలో ప్రతి ఒక్కరికి మన స్వంత ప్రత్యేక లోపాలు ఉన్నాయి.  ఈ ప్రపంచంలో, ఏమీ వృధా కాదు. మీ జీవితంలోని కొన్ని రంగాలలో మీరు అసమర్థంగా లేదా పనికిరానివారని మీరు అనుకోవచ్చు, కాని ఏదో ఒకవిధంగా ఈ లోపాలు ఎదో ఒక రూపంలో  ఆశీర్వాదంగా మారతాయి. ”

4 Comments

  1. Wow super story, If every body thinks like this there is No suicides at all of powerty and illiteracy 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *