నాసిర్ అనే చిన్న పిల్లవాడి ఇంటి తోటలో ఒక మర్రి చెట్టు ఉంది. నాసిర్ ఎప్పుడు ఆ తోటలోని మర్రి చెట్టు కింద ఆడుకునేవాడు. ఒకరోజు నాసిర్ కు మర్రి చెట్టు సమీపంలో ఒక క్రిష్టల్ బాల్ దొరికింది. ఆ మర్రి చెట్టు నాసిర్ కు “ఈ బాల్ నీయొక్క ఒక్క కోరికను తీరుస్తుంది”. “ఒక్క కోరిక కంటే ఎక్కువ కోరుకుంటే తన దగ్గర ఉన్నదంతా పోతుంది” అని చెప్పింది.
కానీ, నాసిర్ కు బలమైన కోరికలు ఏమి లేకపోవడంతో ఆ బాల్ ను ఒక సంచిలో దాచిపెట్టాడు. రోజు ఆ బాల్ ని తీసి చూస్తున్నాడు కానీ ఏ కోరిక కోరుకోలేదు. ఒకరోజు నాసిర్ దగ్గర ఉన్న క్రిష్టల్ బాల్ ను వాళ్ళ ఫ్రెండ్స్ చూసి దొంగిలించారు.
దానిని గ్రామస్థులందరికి చూపించారు. వెంటనే గ్రామస్తులందరూ వారికి ఉన్న కోరికలు ఒకరి తర్వాత ఒకరు ” పెద్ద రాజా భావనాలని, సంపద , ఆభరణాలు” చాలా కోరుకున్నారు..
ఒకటి కంటే ఎక్కువ కోరికలు కోరుకున్నందున గ్రామస్థుల యొక్క అప్పటి వరకు వారి వద్ద ఉన్న భవనాలు, సంపద , ఆభరణాలు అన్ని మాయమైపోయాయి. దానితో అందరు వారి దురాశ కు బాధపడ్డారు.
ఇక నాసిర్ తప్ప మనల్ని ఎవరు కాపాడలేరు అని అతని దగ్గరికి వెళ్లారు. నాసిర్ తనకు ఉన్న ఒకే ఒక్క కోరిక గ్రామస్థుల కోసం ఉపయోగించాడు”.గ్రామాన్ని మొత్తం అంతకుముందులా మార్చాలని కోరుకున్నాడు”. దానితో గ్రామం తిరిగి అంతకుముందులా మారిపోయింది.
గ్రామస్తులంతా చాల సంతోషపడ్డారు. తన ఒక్క కోరిక అయిపోయినందున నాసిర్ తిరిగి ఆ బాల్ ని ఇవ్వడానికి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మర్రి చెట్టు “నాసిర్ యొక్క స్వార్థంలేని మంచితనానికి సంతోషపడి మరొక కోరికకు ఛాన్స్ ఇచ్చింది”.
నీతి | Moral : అవసరానికి మించిన సంపద ఆశిస్తే అనర్థానికి దారితీస్తుంది. .