ఆకలిగా ఉన్న ఒక ఎలుక | A Hungry Mouse

A Hungry Mouse
A Hungry Mouse

ఒక ఎలుక చాలా రోజుల నుండి ఆకలిగా ఉంది. అది ఎంతో ఆలోచించింది. ఆహారాన్ని ఎలా సంపాదించాలని కానీ ఎలాంటి మార్గం దొరకలేదు. చాల రోజులుగా ఆహారం లేనందున ఆ ఎలుక నీరసించి సన్నగా అయిపోయింది.

అలా చాలా రోజులు గడిచిపోయింది ఎలుకకు ఎలాంటి ఆహారం దొరకలేదు. ఒకరోజు ఆ ఎలుక ఒక బాస్కెట్ నిండా మొక్కజొన్న గింజల్ని చూసింది దానికి ఒక చివరన ఒక చిన్న రంద్రం కూడా ఉంది. ఆ ఎలుక చాలా సన్నగా ఉన్నందున బాస్కెట్ లోపలి వెళ్ళడానికి ఆ రంద్రం సరిపోతుంది.

వెంటనే బాస్కెట్లోకి వెళ్లి తినడం ప్రారంభించింది. చాలా రోజులుగా ఆహరం లేనందున అది ఒకదాని తర్వాత ఒక గింజని  తింటూనే ఉంది. “తనకు సరిపడే  ఆహరం కంటే చాలా ఎక్కువగా తిన్నది” ఆ కారణంగా ఆ ఎలుక లావు అయ్యింది.

ఇక ఆహరం సరిపోయింది అని అనుకుని అదే రంద్రం నుండి బయటకి వద్దామని అనుకుంది కానీ! ఈ సారి అది ఆ రంద్రం గుండా రాలేకపోయింది ఎందుకంటె ఎలుక సరిపోయేదానికంటే ఎక్కువ ఆహరం తిన్నందున లావయ్యింది కాబట్టి!

ఆ ఎలుక అరవడం ప్రారంభించింది, చాలా ఏడ్చింది, దేవుడిని వేడుకుంది తనను ఎలా అయినా  కాపాడమని బ్రతిమాలింది. కానీ ఎలాంటి మార్గం కనబడలేదు అంతలో ఇంకో ఎలుక వచ్చి దాని పరిస్థితిని  గమనించింది . నువ్వు  కొన్ని రోజులు ఏమి తినకుండా ఉండు ఆలా అయితే  నువ్వు  సన్నబడతావు  అప్పుడు ఈ రంద్రం నీకు సరిపోతుంది బయటకి రావడానికి అని అంది.

ఇక ఆ ఎలుక తినకుండా ఉండటం మొదలుపెట్టింది.

నీతి | Moral :   అవసరమైన దాని కంటే ఎక్కువగా తిస్కోకు అది నీకు అందుబాటులో ఉన్న సరే. అత్యాశ నష్టానికి మూలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *