ఒక సైనికుడి కథ | A Soldier’s Story
ఒక సైనికుడి కథ | A Soldier’s Story

పరదేశంతో యుద్ధం ముగుంచుకున్న ఒక సైనికుడు తన తల్లి తండ్రులకి ఫోన్ చేసాడు.

సైనికుడు : అమ్మా నాన్న..! ఇక్కడ యుద్ధం ముగిసింది. నేను ఇంటికి వచ్చేయాలనుకుంటున్నాను అన్నాడు.

నాన్న : చాలా సంతోషం. నీ రాక కోసం మేము ఎదురు చూస్తుంటాము. నువ్వు ఎప్పుడు బయల్దేరుతున్నావు..?

సైనికుడు : నాన్నా, నేను ఇంకో రెండు రోజుల్లో బయల్దేరతాను అని, ఇంకో మాట నాన్నా,  నాతో పాటు నేను నా స్నాహితుడిని కూడా మన ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను. అతనికి తల్లి తండ్రులు ఎవరు లేరు.

నాన్న : దానికి అంత సందేహం ఎందుకు తప్పకుండా తీసుకురా.

సైనికుడు : నాన్నా, అతను ఎప్పటికి ఇక మన ఇంట్లోనే ఉంటాడు నన్ను  ఎలా చూసుకున్నారో .. నా స్నాహితుడిని అలాగే చూసుకుంటారా ..?

నాన్న : మాకు నువ్వొక్కడివే కొడుకువి. ఇక నుండి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుంటాము. నిన్ను ఎలా చూసుకున్నామో తనని అలాగే చూస్కుంటాము.

సైనికుడు : నాన్నా..! అదీ…   మొన్న జరిగిన యుద్ధంలో నా స్నేహితుడు  ఒక కాలు, ఒక చేయిని కోల్పోయాడు. 

నాన్నా : అవునా…? మరి నీ స్నేహితుడిని ఈ సెలవులకి మన ఇంట్లో ఉండమని తర్వాత వెళ్లిపొమ్మని చెప్పు.

సైనికుడు : తనకెవరూ లేరు కదా నాన్నా..? ఎక్కడికి వెళ్తాడు…?

నాన్నా : మనందరం ,ఎవరి జీవితం వాళ్లు  గడపడంలో చాలా బిజీగా ఉన్నాము. అందరిలా ఉండి  అన్ని బాగుంటే  సరే  కానీ, జీవితాంతం ఒకరి పైన ఆధారపడే అతనిని  ఎన్నాళ్లని చుస్కోగలము..?

సైనికుడు: ఇప్పుడేమంటారు నాన్న..? అతను జీవితాంతం మన ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా..?

నాన్నా : అది కాదు బాబు , ఒకరిని జీవితాంతం భరించడం చాలా కష్టం. నువ్వు అతడి సంగతి వదిలెయ్ అతను ఎలాగోలా బ్రతుకుతాడు. నువ్వు అయితే  ఇంటికి వచ్చేయ్   నీకోసం అమ్మ మరియు నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాము అన్నాడు.

సైనికుడు : ఆ మాట విని ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు.

ఈ సంభాషణ ముగిసిన రెండు రోజుల  తర్వాత 

తల్లితండ్రులు కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఆర్మీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ఆఫీసర్, “మీ కొడుకు బిల్డింగ్ పైన నుండి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని .”  ఆ మాట విన్న తల్లి తండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

వెంటనే కుమారుడు ఉన్న ప్లేస్ కి వెళ్లారు. అక్కడ  కొడుకు మృతదేహాన్ని  చూసి  నిచ్చేష్టులయ్యారు. తన కుమారుడికి ఒక కాలు మరియు ఒక చెయ్యి మాత్రమే ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్ ఇలా చెప్పాడు  “మొన్న జరిగిన యుద్ధంలో చాలా మంది సైనికులు మరణించారు. మీ అదృష్టం బాగుండి మీ  కుమారుడు ప్రాణాలతో ఉన్నాడు. కానీ, యుద్ధ సమయంలో తన చెయ్యి మరియు కాలు పోగొట్టుకుని వికలాంగుడయ్యాడు.

ఇక అతను ఆర్మీలో ఉండడం సరికాదని ఇంటికి వెళ్లి మిగలిన జీవితాన్ని అయినా  ఆనందంగా గడపమని  ఆదేశించాము. కానీ, ఇంతలోనే ఇలా చేసుకున్నాడు అని చెప్పాడు.

ఇదంతా విన్న తల్లితండ్రులకు  అసలు విషయం అర్థమయి గుండె పగిలేలా ఏడ్చారు.

ఒక్కమాట – అందరు  ప్రతి రోజు దేవుడికి ప్రార్థించండి ” ఎలాంటి భిన్నమైన(ఏదైనా లోపం ఉన్న) వ్యక్తి మన కుటుంబంలోకి వచ్చినా  వారిని ఆదరించి, అభిమానించే గొప్ప మనస్సు, ధైర్యాన్ని ఇవ్వమని.” 

నీతి | Moral : ఈ కథలోని తల్లితండ్రుల లాగానే ఈ సమాజంలో  కూడా చాలా మంది  ఉన్నారు. ఆరోగ్యంగా ,అందంగా ఉండేవాళ్లని చేరదీయడం ఏదైనా ఇబ్బంది ఉన్నవారిని మనకెందులే అని వదిలేయడం. ప్రతి ఒక్క మనిషి  మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ప్రేమించే కుటుంబం ఒకటి ఉంటుందని ఆశతో ఉంటారు. ఆ ఆశని ఎప్పటికి నిరాశ చేయొద్దు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *