అందమైన బహుమతి | A Valuable Gift
A Valuable Gift

మోహన్ ఎప్పటిలాగే ఆఫీస్ నుండి చాలా  ఆలస్యంగా వచ్చాడు. అతని కోసమే ఎదురుచూస్తున్న 7 సంవత్సరాల కొడుకు తలుపు వెనుక నుండి చూస్తన్నాడు. ఫ్రెష్ అయి వచ్చిన మోహన్ ని కొడుకు ఈ విధంగా అడిగాడు.

కొడుకు: డాడీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చ?  అన్నాడు. 

మోహన్: ఓ ! తప్పకుండ.

కొడుకు: మీరు గంటకి ఎంత సంపాదిస్తారు .?

“ఆ ప్రశ్న విన్న మోహన్ కి చాల కోపం వచ్చి ఇలా అన్నాడు.”

మోహన్: చాల కోపంతో! నీ  వయసు కి ఈ ప్రశ్న వేయడం ఏంటి ? అన్నాడు కోపంగా.

 కొడుకు మల్లి అదే ప్రశ్న వేయడంతో మోహన్ ఇలా అన్నాడు.

మోహన్: నేను గంటకి 200 రూపాయలు సంపాదిస్తా అన,. అయినా ఇవన్నీ నీకెందుకు అన్నాడు.

కొడుకు : కొడుకు వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులని గుర్తుతెచ్చుకొని ఇంకా కావాలి అనుకోని,  నాకు ఒక 100 రూపాయలు ఇవ్వగలరా!? అని అడిగాడు.

అయినా  నీకు  డబ్బులు ఎందుకు? ఏదో ఒక పిచ్చి బొమ్మలు కొనడానికే కదా అని కోప్పడి  వెళ్లి పడుకో అని తిట్టాడు. 

కొడుకు బాధతో రూమ్ లోకి వెళ్లి బెడ్ పైన పడుకున్నాడు. నేను 100 రూపాయలు ఎవరిని అడగగలను ఎక్కడి నుండి సంపాదించగలను  అని ఆలోచిస్తున్నాడు.

కాసేపటిక తర్వాత  మోహన్ ఆలోచించసాగాడు. “తన కొడుకు ఎపుడు డబ్బులు అడగలేదు అలాంటిది ఈ రోజు అడిగాడు అంటే ఏదో అవసరమై ఉంటుందని. కొడుకు దగ్గరికి వెళ్లి నవ్వుతూ 100 రూపాయలు ఇచ్చాడు.

కొడుకు సంతోషంగా ఆ డబ్బు తీస్కొని తన దగ్గర కిడ్డీ బ్యాంకులో   దాచుకున్న 100 రూపాయలను తీసాడు. అది చుసిన మోహన్ నీ  దగ్గర డబ్బులు ఉన్నపటికీ నన్నెందుకు అడిగావు? అంత డబ్బు ఏంచేస్తావు?! అని  మల్లి కోప్పడ్డాడు.

ఆ 200 రూపాయలని తీసి కొడుకు మోహన్ కి ఇచ్చి “డాడీ నేను మీ సమయాన్ని ఒక గంట కొనుక్కుంటుంన్నాను”.  రేపు మీరు సాయంత్రానికి త్వరగా   రాగలరు. నాకు మీతో కలిసి భోజనం  చేయాలనీ ఉంది.  కానీ, మీరు ప్రతి రోజు నేను పడుకున్నాకే వస్తారు.  అని ఏడుస్తూ చెప్పాడు.

ఆ మాటలు విన్న మోహన్ గుండె చలించి పోయింది ఏడుస్తూ కొడుకుని హత్తు కున్నాడు .. ఇక నుండి నేను  రోజు త్వరగా ఇంటికి వస్తాను తప్పకుండ నీతో కలిసి భోజనం చేస్తాను అని   కొడుకుతో ప్రామిస్ చేసాడు.

నీతి | Moral : ” మనం సంపాదించేది మన ఫామిలీ కోసమే కానీ వారితోనే సమయాన్ని గడపలేకపోతున్నాం. ఆ చిన్ని మనసుల ఎంత బాధ పడతాయో కదా !? కావున మీరు మీ అమూల్యమైన సమయాన్ని  కాస్తా మీ ఫామిలీ కోసం  కూడా కేటాయించండి. ” అదే మనం మన ఫామిలీ కి ఇచ్చే “అందమైన బహుమతి”.

ఫామిలీ కి అర్ధం ఆ కొడుకు మాటలలో….

FAMILY = (F) ATHER (A) ND (M) OTHER, (I) (L) OVE (Y) OU!

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *