తెలివైన కోతి | A Wise Monkey
తెలివైన కోతి | A Wise Monkey

ఒకప్పుడు, ఒక అడవిలో, ఒక నది ఒడ్డున ఉన్న బాదం  చెట్టుపైన ఒక   కోతి నివసించేది. కడుపునిండా తినడానికి మంచి  బాదం పండ్లు  మరియు తాగడానికి  పక్కనే నీరు ఉన్నందున ఆ బాదం చెట్టునే  కోతి నివాసంగా మార్చుకుంది.

అదే అడవిలో, ఒక మొసలి మరియు అతని భార్య నివసించేవి. ఒక రోజు, మొసలి నది ఒడ్డుకు వచ్చి బాదం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. అది చూసిన కోతి,  ఆ మొసలికి  కొన్ని బాదం పండ్లు ఇచ్చింది. ఆ బాదం పండ్లు  ఎంతో నచ్చడంతో మొసలి మరుసటి రోజు కూడా  పండ్ల కోసం చెట్టు దగ్గరకి వచ్చింది.  ప్రతీరోజు, మొసలి బాదం పండ్ల కోసం రావడం,  దయగల కోతి మొసలికి పండ్లు ఇవ్వడం జరిగేది. అలా రోజులు గడిచేకొద్దీ మొసలి మరియు కోతి మంచి స్నేహితులు అయ్యారు.

ఒక రోజు…  కోతి, మొసలి భార్య కోసం కూడా  కొన్ని పండ్లను పంపింది. ఆమె బాదం  పండ్లు తిన్నది మరియు ఆ పండ్లు ఆమెకి బాగా నచ్చాయి.  కానీ, ప్రతీరోజు తన భర్త కోతితో గంటల తరపడి మాట్లాడుతూ ఉండడం ఆమెకు  నచ్చలేదు.

కోతి కారణంగా తన  భర్త, తనతో సరిగా గడపట్లేదని   బాధ మరియు అసూయతో ఉంది. ప్రతీ రోజు కోతి, మొసలి  భార్యకి కూడా బాదాం పండ్లు పంపించేది. కడుపునిండా బాదాం పండ్లు తిన్నాకూడా..,  తన భర్త తనకు దూరమవుతుండటం గమనించిన భార్య మొసలి, ఎలాగైనా కోతిని చంపేయాలి అనుకుంది.

ఆమె తన భర్తతో, “పండ్లు చాలా రుచిగా ఉన్నాయి కదా.. ! చెట్టు మీది పండ్లే ఇంత రుచిగా ఉంటే  ఎంతో ఉన్నతమైన మనసున్న కోతి హృదయం(గుండె) ఇంకా ఎంత బాగుండాలి..?! అని భర్తతో అంది. భార్య యొక్క దురాలోచన అర్ధం కానీ మొసలి,  ఏంటి..? అని అడిగాడు. అపుడు భార్య మొసలి, నాకు ఈ మధ్య బాగా జబ్బు చేసింది.  డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి మనసున్న కోతి యొక్క గుండెని తినాలని చెప్పాడు.  లేకుంటే నేను త్వరలోనే చనిపోతానట అని చెప్పి  గట్టిగా ఏడ్చింది.

ఆ మాట విన్న అమాయకపు భర్త మొసలి కన్నీరు మున్నీరయ్యింది. కానీ, కోతి  చాలా దయగలది, పైగా తన ప్రాణ స్నాహితురాలు.  అలాంటి కోతిని చంపడం తనవల్ల కాదని చెప్పింది. అపుడు భార్య మొసలి, అలాగేనండి  మీకు నాకంటే ఆ కోతి ఎక్కువైంది.  నేను ఎలాగూ చనిపోతాను కదా..! మీరు మీ స్నేహితురాలైన కోతి దగ్గరే ఉండండి అని మళ్లి గట్టిగా ఏడ్చింది. అదంతా వింటున్న భర్త మొసలి చేసేది ఏమిలేకా.. కోతి  దగ్గరకు వెళ్లాడు.

భర్త మొసలి,  కోతితో నీవు మాకు రోజు రుచికరమైన పండ్లని ఇస్తూ మా ఆకలిని తీరుస్తున్నావు.  అందుకు కృతజ్ఞతగా నా భార్య నిన్ను ఈ రోజు మా ఇంటికి భోజనానికి ఆహ్వానించింది.  నువ్వు తప్పకుండా  రావాలి అని చెప్పాడు.

ఆ మాట విన్న కోతి  చాలా సంతోషంతో తప్పకుండ వస్తాను అని చెప్పింది. ఈత రాని కోతి  మొసలి వీపు పైన కూర్చుంది. మార్గ మధ్యలో మాటల్లో పడిన మొసలి, కోతితో అసలు విషయం చెప్పింది. మొసలి  భార్య యొక్క కుతంత్రపు ఆలోచన విన్న కోతికి, ఏంచేయాలో అర్ధం కాక వెంటనే, నాకు నువ్వు చాలా గొప్ప స్నేహితుడివి నేను నీకోసం లేదా నీ భార్య కోసం నా  హృదయం(గుండె) ఏంటి… ఏమైనా ఇచేయగలను.

 కానీ,  నాకు నువ్వు ఈ మాట ముందే చెప్పాల్సింది.  ఈ రోజు నాకు చాలా ఆయాసంగా ఉందని నా గుండెని తీసి చెట్టు పైన పెట్టాను. కంగారులో తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పింది. మనం వెనక్కి వెళ్లి నా  హృదయాన్ని తీసుకుందాము అని చెప్పింది కోతి.

ఆ మాట విన్న  మొసలి  సరే అని వెనక్కు తిరుగుతుంది. నది ఒడ్డుకు చేరుకోగానే  కోతి  వెంటనే చెట్టు మీదికి దూకి…   మొసలిని బాగా తిడుతుంది. ఇన్ని రోజుల నుండి నిన్ను, నీ భార్యను ఆకలి బాధ  నుండి కాపాడితే చివరకు నన్నే చంపుదామని  అనుకుంటారా..?! మీకు ఇక ఎలాంటి పండ్లు కూడా ఇవ్వను.  అని తన ప్రాణాలు తానూ కాపాడుకున్నందుకు సంతోషపడింది.

నీతి | Moral : “మీతో ఎంత చనువుగా, నమ్మకంగా ఉన్న స్నేహితుల పట్ల కూడా మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ల  అవసరం కోసం కొన్ని సార్లు స్నేహాన్ని కూడా మర్చిపోయి మీకు హాని కలిగించొచ్చు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *