ఒక గొర్రెల కాపరి రోజులాగే గొర్రెలను అడవిలో మేతకి తీస్కోచ్చాడు. అందులో ఒక చిన్న గొర్రెపిల్ల కూడా ఉంది. ఆ గొర్రెపిల్ల గడ్డిని తిని ఇక్కడ రుచిగా లేదు, అని వేరే ప్రదేశానికి వెళ్లి తినడం ప్రారంభించింది.
అక్కడ గడ్డి చాలా తియ్యగా ఉండడంతో సంతోషంతో అలా తింటూ తింటూ చాలాదూరం వెళ్ళిపోయింది. ఒక తోడేలు వచ్చింది. ఆ విషయం గొర్రెపిల్ల గమనించలేదు. తోడేలు గొర్రె పిల్లపై దూకి చంపేయబోయింది. అంతలో ఆ గొర్రెపిల్ల నక్కతో ” ఒక్క నిమిషం ఆగండి నన్నుఇప్పుడే చంపొద్దు” అని అంది. ఆ తోడేలు ఎందుకు? అని అడిగింది.
గొర్రెపిల్ల తెలివిగా “నేను ఇప్పటివరకు చాలా గడ్డి తిన్నాను” ఇపుడు నువ్వు నన్ను తిన్నావంటే నీకు గడ్డి రుచి వస్తుంది కానీ నా రుచి రాదూ అంది. ఇది నిజమే అని భావించిన తోడేలు సరే మరి “కాసేపయ్యాక తింటాను అంది.
అంతలోనే గొర్రెపిల్లకి ఇంకో ఆలోచన వచ్చి తోడేలుతో ” గడ్డి అరిగే వరకు చాలా సమయం పట్టేలా ఉంది. నేను డాన్స్ చేస్తాను త్వరగ గడ్డి అరిగిపోతది” అని చెప్పింది.ఈ ఆలోచన కూడా తోడేలుకు నచ్చడంతో సరే అంది.
గొర్రెపిల్ల డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అంతలోనే ఇంకో ఆలోచన వచ్చి, నక్కతో ” నా మేడలో ఉన్న గంట తీసి గట్టిగ కొట్టు అలా అయితే నేను డాన్స్ ఇంకా ఫాస్ట్ గా చేయగలను, గడ్డి చాలా త్వరగా అరుగుతది నువ్వు నన్ను తినొచ్చు అంది. తోడేలు సరే అని అలాగే చేసింది.
ఆ శబ్దం విన్న గొర్రెల కాపరి తన గొర్రెపిల్ల ప్రమాదంలో ఉందని గ్రహించి తన పెంపుడు కుక్కలని పంపాడు. కుక్కలు తోడేలుని చంపి గొర్రెపిల్లను కాపాడాయి.
నీతి | Moral :”ఆపద సమయంలో మనం ఎంత బలహీనంగా ఉన్న, మన తెలివితేటలతో మనల్ని మనం కాపాడుకోవచ్చు”.