About Me
storiesintelugu.com కి స్వాగతం..
నేను మీ దివ్య పార్పెల్లి, తన కాళ్ళ మీద తాను నిలబడి అందరిలో మంచి పేరు పొందాలనే తపన ఉన్న అమ్మాయినిని. ఉన్నత విద్యాభ్యాసం చేసి 5 సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. కరోనా కాలం ఉపాధ్యాయ వృత్తిని కుదిపేసింది. చేతిలో నుండి జాబ్స్ ని లాగేసుకుంది. ఎదో ఒకటి చేయాలన్న కోరికతో.. విద్యారులకోసం ఎదో చేయాలన్న తపనతో… నా మనస్సులో నుండి పుట్టుకొచ్చిందే ఈ storiesintelugu.com.
కేవలం విద్యార్థుల కోసమే కాకుండా ప్రతి ఒక్కరు చదివేలా ఉండేవి నా నీతి కథలు. నా స్టోరీస్ లో ప్రతి ఒక్క స్టోరీకి నీతి ఉంటుంది. నా స్టోరీస్ చదువుతూ మీరు కాలక్షేపం కూడా చేయొచ్చు, మీ పిల్లలకి చదివి వినిపించొచ్చు. వారిని స్వయంగా చదవమని చెప్పి వారి యొక్క తెలుగు భాషని మెరుగు చేయొచ్చు .
ఇందులో అన్ని రకాల నీతి కథలు ఉన్నాయి. కుటుంబ కథలు, అక్బర్-బీర్బల్ కథలు, ప్రేమ కథలు, పంచతంత్ర కథలు, పౌరాణిక కథలు తెనాలి రామన్ కథలు, బుద్ధ కథలు, స్వతంత్ర కథలు అన్ని ఉన్నాయి. చదవండి, ఆనందించండి మీ అనుభవాన్ని ఇతరులతో పంచండి.