బాల్య జీవితం మరియు విద్య :
అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న జన్మించారు. అల్లూరి సీతారామరాజు స్కూలులో ఉన్నప్పుడు తండ్రి మరణించారు. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్ లో తహసీల్దార్ అయిన తన మామ ‘రామ కృష్ణం రాజు’ సంరక్షణలో పెరిగారు. అతను నర్సాపూర్లోని ‘టేలర్ హై స్కూల్’ లో చదువుకున్నారు. టేలర్ హై స్కూల్ లో చదువు ముగిసిన తరువాత తన తల్లి, సోదరుడు మరియు సోదరితో కలిసి తుని అనే ఊరికి వెళ్లారు.
సీతారామరాజు తుని లో ఉన్నప్పుడు, విశాఖపట్నం జిల్లాలోని ప్రాంతాలను సందర్శించారు మరియు దేశీయ ప్రజల అవసరాలను తెలుసుకున్నారు. అక్కడి ప్రజలు ఎలా జీవిస్తున్నారు? వారి జీవన ఆధారం ఏంటి? అన్న ప్రతి విషయాలపైనా అవగాహన తీసుకున్నారు.
15 సంవత్సరాల వయస్సులో, అతను తన తల్లి స్వస్థలమైన విశాఖపట్నం వెళ్లి, శ్రీమతి A.V.N. కళాశాలలో చేరాడు. సామాజిక రంగంలో ,పేద ప్రజల అవసరాల మీద ఎక్కువ అవగాహన మరియు వారి మీద జరుగుతున్న అన్యాయాల్ని చూస్తూ రగిలిపోతున్న రామరాజు తన చదువు సరిగా కంప్లీట్ చేయలేకపోయాడు. చివరి సంవత్సరం ఫెయిల్ అవడంతో కాలేజ్ నుండి రామరాజు తొలగించబడ్డాడు.
1922 రంప తిరుగుబాటు :
గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని ప్రజలంతా వారి జీవనాధారంగా పోడు వ్యవసాయాన్ని చేసేవారు. వారికి కావలసిన ఆహారా పదార్థాలని వ్యవసాయం ద్వారా పండించేవారు. 1882 మద్రాస్ ఫారెస్ట్ చట్టం వచ్చిన తరువాత అటవీ ప్రాంత ప్రజల పోడు వ్యవసాయ విధానం పైన చాలా ఆంక్షలు వచ్చాయి.
వారి సాంప్రదాయ పోడు వ్యవసాయాన్ని చేయనీయకుండా అడ్డుకున్నాయి. తద్వారా వారికి కనీస నిత్యావసర ఆహారా పదార్థాలు కొరత చాలా ఏర్పడింది. అదే సమయంలో బెంగాల్ లోని విప్లవకారుల దేశభక్తి ప్రేరణతో, రామరాజు ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి మరియు విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో నిరసన ఉద్యమానికి నాయకత్వం వహించారు.
రామరాజు చింతపల్లె, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణ దేవి పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం మరియు అన్నవరం పరిసరాల్లోని పోలీసు స్టేషన్లపై దాడి చేశారు. రామరాజు మరియు అతని అనుచరులు పోలీస్ స్టేషన్లోనుండి తుపాకులు మరియు మందుగుండు సామగ్రిని దొంగిలించారు. దమ్మనపల్లి సమీపంలో అనేక మంది బ్రిటిష్ ఆర్మీ అధికారులను చంపారు.
అప్పటినుండి బ్రిటిష్ వారు రామరాజు కోసం వెతకటం ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న రామరాజు కొన్ని రోజుల పాటు ఎవరికి కనబడకుండా భూగర్భంలోకి వెళ్లి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.
డిసెంబర్ 1922 లో, బ్రిటిష్ వారి నాయకత్వంలో… పెగడపల్లె సమీపంలో అస్సాం రైఫిల్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. అప్పటికి భూగర్భంలోకి వెళ్లిన రాజు, వెంటనే బయటకి వచ్చి తన పోరాటాన్ని తిరిగి కొనసాగించాడు. మల్లు దొర మరియు గంటమ్ దొర నాయకత్వంలో… గిరిజన వాలంటీర్లు విల్లు మరియు బాణాలను ఉపయోగించి బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నారు.
రామరాజు మరణం :
18 సెప్టెంబర్ 1923 న అన్నవరం పోలీసు స్టేషన్ పైన రామరాజు దాడి చేసాడు. ఆ సమయంలో పోలీసులు రామరాజు తో పాటు దాడి లో పాల్గొన్న మల్లు దొరను అరెస్ట్ చేశారు. రాజు యొక్క కార్యకలాపాలను అతను ఎక్కడ ఉన్నడో..? అన్న పనిని ఎలాగైనా కనిపెట్టి పట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం విశాఖ జిల్లా కలెక్టర్ అయిన రూథర్ ఫర్డ్ కి అప్పగించింది.
రూథర్ ఫర్డ్, రాజు యొక్క ముఖ్య అనుచరుడైన అగ్గిరాజుగా ప్రసిద్ధి చెందిన సూర్య నారాయణ రాజును అరెస్టు చేశారు. బ్రిటిష్ పోలీసులు దాదాపు డిసెంబర్ 1922 నుండి దాదాపు ఒక సంవత్సరం పాటు రామరాజు కోసం వెతుకుతూనే ఉన్నారు.
చివరకు చింతపల్లి అడవులలో… రామరాజును, బ్రిటిష్ వారు బంధించారు. తరువాత మే 7, 1924 కయ్యూరు గ్రామంలో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. రామరాజు సమాధి కృష్ణ దేవి పేట గ్రామంలో ఉంది.
One Comment