అది 2012 సంవత్సరం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుతున్న రోజులవి, చదువుతో పాటు ఉరుకుల పరుగుల జీవితం.హాస్టల్ లో ఎక్కడ చుసిన ఎంతో కష్టపడి ఎలాగైనా జాబ్ కొట్టాలనే విద్యార్థులు.చాలామంది పల్లెటూరి నుండి వచ్చి ఎలాగైన జాబ్ సంపాదిస్తే అమ్మ నాన్నలని బాగా చూసుకోవాలనే తపన.
చదువుతో పాటు మంత్లీ కావలసిన పాకెట్ మనీ కూడా తల్లి తండ్రుల నుండి తీసుకోవద్దు అని మెచూరిటీతో ఆలోచించి ట్యూషన్ తీసుకుంటూ వచ్చే మనీతో కాలాన్ని నెట్టుకురావడం. ఇదంతా చూసే భాద్యత లేని ఏ యువత అయినా వారి అభిప్రాయాన్ని మార్చుకొని మరీ, చదువు దారిలో పడతారు అలాంటి విశ్వా విద్యాలయం మన ఉస్మానియా యూనివర్సిటీ..
ఇదంతా ఒక ఎత్తు అయితే! ఎంతో హోప్ తో చదువుతూ ఉండగానే పెళ్ళుల్లు సెట్ అయిపోతూ ఉండటం ఒక బాధాకరమైం విషయం.
ఇలా నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో చాల మందికి పెళ్లిళ్లు సెట్ అయిపోయాయి. కొంత మంది హ్యాపీగా ఉండటం మరికొంత మంది బాధపడటం ఇదంతా జరుగుతూ ఉండేది.
నా స్నేహితురాలు ఒకమ్మాయికి మంచి అబ్బాయితో పెళ్లి సెట్ అయింది. తాను పెళ్లి వద్దు అని ఎంత వారించినా తన తల్లి మంచి సంబంధం అని ఒప్పించింది. పెళ్లి సెట్ అయిపోవడం ఒక్కో పెళ్లి పని జరగడం మొదలయ్యాయి .
అంత చాల హ్యాప గ జరుగుతున్నా సమయంలో అబ్బాయి తరపు వాళ్ళు పెళ్ళికి ముందు తీర్చాల్సిన ఒక దేవుడి మొక్కు ఉందని నా ఫ్రెండ్ ని మరియు కాబోయే వారిని తీస్కొని మొక్కు తీర్చుకుని రావాలని చెప్పారు.
ఎంతో హ్యాపీగా గుడికి వెళ్తున్న దారిలో దురదృష్టం ఎదురుగ వచ్చి లారీ ఆక్సిడెంట్ అయింది. నా ఫ్రెండ్ చిన్న గాయాలతో బయటపడింది కానీ కాబోయే భర్త మాత్రం చాల గాయాలతో ఐసీయూ లో ఉన్నాడు.
ఇది తెలిసిన అబ్బాయి తరపు వాళ్ళు ఈ అమ్మాయితో పెళ్లి సెట్ అవడం వళ్ల అబ్బాయి చావు బ్రతుకులలో ఉన్నాడని అమ్మాయి జాతకం బాలేదని ఆమెపైన నింద వేసి పెళ్లి క్యాన్సల్ చేసారు.
దానితో నా ఫ్రెండ్ ని అందరు సూటిపోటి మాటలతో హింసించారు. నీ జాతకమే ఇంత నిన్ను ఎవరు పెళ్లి చేసుకోడానికి వచ్చిన వాళ్ళు చచ్చిపోతారు అని , నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నువ్వు ఇలాగె చచ్చిపోవాలి అని చాలా మాటలు అన్నారు.
6 నెలల తరువాత ఆ అబ్బాయి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ అబ్బాయికి తెలిసింది, నా ఫ్రెండ్ తో పెళ్లి కాన్సల్ అయిందని తనకి వేరే అమ్మాయితో పెళ్లి సెట్ చేసారని. అది తెలుసుకున్న తర్వాత అబ్బాయి వెంటనే వాళ్ళ అమ్మ నాన్నతో గొడవపడ్డాడు.
వాళ్ళు ఆ అమ్మాయి వల్లే నువ్ ఇలా అయ్యావు అని చెప్పిన కూడా వినకుండా నా ఫ్రెండ్ ని తీసుకెళ్లి అందరిలో చెప్పాడు నేను చనిపోయేవాడిని. కానీ, తనతో బ్రతకాలని రాసి ఉంది కాబట్టే బ్రతికాను. అంటే తన వల్లే నేను బ్రతికాను అది అర్ధం చేసుకోకుండా పెళ్లి కాన్సల్ చేస్తారా! నాకు తెలియకుండా!? అని మానవత్వం తో మాట్లాడాడు. ఆ మాట వినగానే నా స్నేహితురాలికి మరో జీవితం ఆరంభమయింది అన్పించింది.