ఒక గుడ్డి వాడి ప్రేమకథ | A Blind Man's Love
ఒక గుడ్డి వాడి ప్రేమకథ | A Blind Man’s Love

శ్రీకాంత్, చైత్ర అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు వారి “అన్యోన్యతతో  మరియు ఒకరినొకరు చాల ప్రేమగా” ఉండేవారు. కొన్ని సంవత్సరాల తరువాత అనుకోని

“చర్మ వ్యాధి ఒకటి చైత్ర కి వచ్చింది”. ఆ వ్యాధి కారణంగా “ఆమె తన అందాన్ని కోల్పోవసాగింది”.

కొన్ని రోజులకి శ్రీకాంత్ తన జాబ్ గురించి వేరే సిటీ కి వెళ్ళాడు తిరిగి వస్తున్న సమయంలో అతను ఒక ఆక్సిడెంట్ కి గురయ్యాడు. అందులో “శ్రీకాంత్ కంటి చూపుని కోల్పోయాడు”. అయినప్పటికీ వారి వివాహ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. వారి ప్రేమ ఆప్యాయతలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు. కానీ “రోజులు గడిచేకొద్దీ ఆమె తన అందాన్ని క్రమంగా కోల్పోయింది”.

ఇది తన అందుడైన  భర్తకి తెలియదు మరియు వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు వారు చాలా ఆనందంగా జీవించారు.

కొన్ని రోజుల తరువాత చైత్ర చనిపోయింది. శ్రీకాంత్ తన ప్రపంచాన్ని కోల్పోయాడు. తీవ్ర దుఃఖంలో చైత్ర అంతిమ కర్మలన్నీ ముగించాడు. ఇక ఆ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు. అంతలో ఒక వ్యక్తి శ్రీకాంత్ దగ్గరికి వెళ్లి “ఇన్ని రోజులు నీ భార్య ఉన్నందున నీకు చూపు లేకపోయినా నీ  జీవనంలో ఎలాంటి మార్పు లేకుండా తాను చాలా జాగ్రత్తగా చూసుకుంది”, ఇప్పుడు ఒక్కడివే ఎలా బ్రతుకుతావు అని అడిగాడు?.

అప్పుడు శ్రీకాంత్!”నేను గుడ్డివాడిని కాదు. నేను నటిస్తున్నాను “ఎందుకంటే ఒక వ్యాధి కారణంగా ఆమె చర్మ పరిస్థితి దారుణంగా మారింది. అది నేను చూడగలనని ఆమెకు తెలిస్తే, అది ఆమె వ్యాధి కంటే ఆమెను ఎక్కువగా బాధించేది. ఆమె అందం కోసం నేను ఆమెను ప్రేమించలేదు, ఆమె గుణాన్ని మరియు తనకు నా మీద ఉన్న అంతులేని ప్రేమని చూసి తనని ప్రేమించి పెళ్లిచేసుకున్నాను. తనను ఆనందంగా ఉంచడానికి నేను గుడ్డివాడిగా నటించాను. అని బదులిచ్చాడు.

నీతి | Moral : మీరు ఒకరిని నిజంగా ప్రేమిస్తున్నప్పుడు, మీ ప్రియమైన వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి మీరు ఏమి చేసిన పర్వాలేదు మరియు ఒకరికొకరు చిన్న చిన్న గొడవలను సర్దుకొని అర్ధం చేస్కోవడం  మంచిది. అందం కాలంతో మసకబారుతుంది, కానీ గుండె మరియు ఆత్మ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. వ్యక్తిని బయటి అందాన్ని చూసి కాకుండా గుణాన్ని చూసి ప్రేమించండి.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *