ఒకరోజు అక్బర్ కి ఒక వింత ఆలోచన వచ్చింది. యదా ప్రాకారం తనకు వచ్చిన సందేహాన్ని తీర్చుకోనిదే అక్బర్ కి నిద్ర పట్టదు. మరునాడు సభలో, నేను ఒక ప్రశ్నను సంధిస్తున్నాను జవాబు చెప్పలేని వారు సభ నుండి వెళ్లిపోవచ్చు, జవాబు చెప్పినవారికి తగిన బహుమానం ఉంటుంది అని చెప్పాడు.
అప్పటికే మంత్రులకి అర్థమైంది మహారాజు ఎలాగూ ఊహకందని ప్రశ్న వేస్తారు, అది మనము చెప్పలేము.,అని ఒకరినొకరు చూసుకున్నారు. అక్బర్, మన “నగరంలో మొత్తం ఎన్ని కాకులున్నాయో లెక్క చెప్పండి” అన్నాడు!?. ఆ ప్రశ్న విని కంగారుపడ్డ మంత్రులు కాసేపటికి తేరుకొని, అందులో ఒక మంత్రి ప్రభు! కాకులను లెక్క పెట్టడం చాల కష్టం అవి ఎగురుతూ ఉంటాయి కదా! అని అన్నాడు.
ఆ సమాధానానికి కోప్పడిన అక్బర్ సభ నుండి అందరిని పంపించేశాడు. అంతలో బీర్బల్ సభకి వస్తున్నాడు మంత్రులందరు బయటకి రావడం చూసి విషయం అడిగి తెలుసుకుని నవ్వుకున్నాడు. మంత్రులందరినీ తిరిగి సభకి తీసుకెళ్లి ప్రభు మీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది అన్నాడు. దానితో మంత్రులందరూ ఆశ్చర్యపోయారు.
మన నగరంలో మొత్తం ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఎనిమిది కాకులున్నాయి అని చెప్పాడు. అప్పుడు అక్బర్ అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడిగితె, ప్రభు భటులను పంపించి లెక్కపెట్టమనండి. ఒకవేళ !లెక్క ఎక్కువగా వస్తే పక్క నగరం నుండి బంధువులైన కాకులు మన నగరానికి వచ్చి ఉంటాయి. ఒకవేళ లెక్క తక్కువ అయితే మన నగరం నుండి కాకులు తమ బంధువులు ఇంటికి వెళ్లి ఉంటాయని చెప్పాడు. ఆ సమాధానంతో సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. అక్బర్ కూడా బీర్బల్ తెలివికి సంతోషించి విలువైన బహుమానాలని ఇచ్చాడు.
నీతి | Moral : ఎంతటి క్లిష్ట ప్రశ్న అయినా తెలివిగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతది.
V nice story 👌💐💐🍫🍫🍬🍬🍧🍧🍰🍰🍦
Thank you! for reading stories. keep reading and sharing:)