ఉపాధ్యాయుల దినోత్సవం డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కాబట్టి జరుపుకుంటామని మనందరికీ తెలుసు, కానీ ఎందుకో మీకు తెలుసా? డా. సర్వేపల్లి రాధ క్రిష్ణన్ మాత్రమే ఎందుకు, మరియు ఏ ఇతర ఉపాధ్యాయుడు ప్రసిద్ధ వ్యక్తి కాదా? ఈ కథలో మనం అతని యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్య యొక్క శక్తిని గ్రహించారు. మంచి విద్య సమాజంలోని అన్ని రుగ్మతలను (చెడును) పరిష్కరిస్తుందని విశ్వసించారు. మరియు, సమాజంలో మార్పు తీసుకువచ్చేవారు ఉపాధ్యాయులు అని నమ్మారు.
అతను తన సంఘటనాత్మక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాడో ఇప్పుడు తెలుసుకుందాం:
డాక్టర్ రాధాకృష్ణన్ తిరుటాణి అనే చిన్న పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
అతడిని ఇంగ్లీషు స్కూల్లో చదీవించడం అతని తండ్రికి ఇష్టం లేదు. తన కొడుకు పూజారి కావాలనుకున్నాడు. కానీ రాధాకృష్ణన్ తన తండ్రిని ఒప్పించి వేలూరులో పాఠశాలకు వెళ్లాడు.
40 ఏళ్లపాటు సాగిన అసాధారణమైన ఉపాధ్యాయ వృత్తి:
మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ టీచర్‌గా తన మొదటి అధ్యాపక పదవిని చేపట్టినప్పుడు ఆయన వయస్సు కేవలం 21 సంవత్సరాలు. అతను 29 సంవత్సరాల చిన్న వయస్సులో కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో గొప్ప ప్రొఫెసర్ అయ్యారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్తన 32 సంవత్సరాల వయసులో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తత్వశాస్త్ర పీఠం అయిన కింగ్ జార్జ్ V చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ పదవిని అధిష్టించాడు.
1920వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌లో తత్వశాస్త్ర ప్రొఫెసర్ పదవికి ఆహ్వానించబడ్డాడు.
అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మతం మరియు నీతి శాస్త్రానికి సంబంధించిన స్పాల్డింగ్(గొప్ప పదవి) ప్రొఫెసర్‌గా కూడా అయ్యాడు.
1909 నుండి 1948 వరకు తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించినప్పటి నుండి, 40 సంవత్సరాల పాటు ఆకట్టుకునేలా బోధించాడు. ఆ తర్వాత అతను జాతీయ విధులను చేపట్టడానికి అధికారికంగా బోధనను విడిచిపెట్టాడు.
జాతీయ విధులను చేపట్టడం:
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ అద్భుతమైన బోధనా రికార్డు గుర్తించబడి అతను 1952లో భారత ఉపరాష్ట్రపతిగా, ఆపై 1962లో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక నిరాడంబరమైన వ్యక్తి, తన జీవితం మొత్తం విజయవంతమైన వృత్తిని చేసి ఆపై జాతీయ పదవులనుచెప్పట్టాడు. డాక్టర్ రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకు కేవలం బోధించడమే కాకుండా వారి విద్యార్థుల పట్ల నిజమైన ప్రేమను పొందాలని విజ్ఞప్తి చేశారు.
భారత రాష్ట్రపతిగా, అతను తన పూర్తి జీతం తీసుకోలేదు, తన జీతంలో నాలుగింట ఒక వంతు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో మన దేశం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది.
సెప్టెంబరు 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి దారితీసిన సంఘటన:
తన 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో బోధన చేయబడ్డ విద్యార్థులంతా కలిసి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరుకున్నారు.
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ దయగల గురువుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఆ పదవిని చాలా భాధ్యతగా నిర్వర్తించారు.
సెప్టెంబరు 5న, ఉపాధ్యాయులు సమాజంలో గొప్ప మార్పుని తీసుకురాగాలు అని తెలియచెప్పిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒకసారి స్మరించుకుందాం. విద్య మరియు బోధన గురించి మరియు ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడం గురించి ఆయన మాటలను గుర్తుంచుకుందాం.
అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!