అది వేసవికాలం ఒక నక్క దాహంతో నీటి కోసం వెతుకుతూ చాలా దూరం ప్రయాణించింది. ఆలా నడుస్తూ నడుస్తూ ఒక ద్రాక్ష తోటకు చేరుకుంది. అది” గుత్తులు గుత్తులుగా రసం నిండి ఉన్న ద్రాక్షలని” చూసి ఎలాగైనా తినాలని తన దాహం తీర్చుకోవాలని అనుకుంది.
తన చుట్టూ అంతా గమనించింది తోట కాపరి మరియు వేటగాళ్లు లేరని చూసి తాను సురక్షితంగా ఉన్నానని ఇక ద్రాక్షలు తినాలని నిశ్చయించుకుంది. ద్రాక్షలు అందుకోవడానికి ఎగరడం ప్రారంభించింది. ద్రాక్షలు చాల పైనకి ఉన్నందున నక్కకి అవి అందడం లేదు.
నక్క ఎంత ఎత్తుకు ఎగరగలడదో అంత పైకి ఎగురుతూ ద్రాక్షల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ద్రాక్ష గుత్తులని అందుకోలేకపోతుంది.
ఈసారి ఎలాగైనా అందుకోవాలని చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి పైకి ఎగిరింది. పాపం అయినా కూడా ద్రాక్షలను అందుకోలేక పోయింది..
ఆలా ప్రయత్నిస్తున్న సమయంలోనే చీకటి అయిపొయింది. నక్కకి తాను చాలా దూరం నడిచినందుకు మరియు ద్రాక్షల కోసం ప్రయత్నంలో చాలాసార్లు ఎగిరినందుకు బాగా అలసిపోయి,కాళ్ళు బాగా వనొప్పి కలిగాయి.
ఇక చేసిన ప్రయత్నం చాలు అనుకున్న నక్క “నాకు నిజంగా ఆ ద్రాక్షలని తినాలని లేదు” ఎందుకంటే,”అవి చాలా పుల్లగా ఉన్నాయి ” అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.
నీతి | Moral : “కొన్నిసార్లు మనం కావాలి అనుకున్నది దక్కనపుడు, అది మనం పొందే అంత విలువైనది కాదు అని అనుకోవాలి”.