How Gandhiji overcame His Fear of Darkness?
మహాత్మా గాంధీజీ కి చీకటి అంటే చాలా భయం. చీకటిలో ఒంటరిగా నడిస్తే దెయ్యాలు వచ్చి తీస్కెళ్ళిపోతాయి అని బలంగా నమ్మేవాడు. . తనకి పది సంవత్సరాల వయస్సు ఉన్నపుడు ఒకసారి ఇంట్లో ఎవరు లేని సమయంలో కరెంట్ పోయి అంతా చీకటిగా మారింది. దానితో గాంధీ చాలా భయపడిపోయాడు. ఇంటి నుండి బయటకి వెళ్తే కాస్త అయినా చందమామ వెన్నెల వెలుతురూ ఉంటుందని అనుకున్నాడు.
దానికోసం గాంధీజీ లేచి భయంతో అరుస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది చూసిన రాంబా అనే పనిమనిషి గాంధీజీ దగ్గరకి వచ్చి ఏమైంది గాంధీ? ఎందుకలా అరుస్తున్నావ్? అని అడిగింది. దానితో గాంధీజీ నాకు చీకటి అంటే చాలా భయం.చీకటిలో నడిస్తే దెయ్యాలు తీస్కెళ్ళిపోతాయి అని చెప్పాడు. అది విన్న రాంబా భయపడకు గాంధీ, ఒంటరిగా మరియు చీకటిలో భయంతో ఉన్నపుడు “శ్రీ రామ” అని తలుచుకో ఆయనే నిన్ను రక్షిస్తాడు. నీ వెంట్రుక కూడా ఎవరు తాకలేరు అని చెప్పింది. అది విన్న గాంధీ నిజామా?! రాంబా, నేను ఇక నుండి అలాగే చేస్తా. అని ప్రతి క్షణం ఆ శ్రీ రామున్ని తలచుకున్నాడు. మళ్లి ఎప్పుడు కూడా చీకటికి భయపడలేదు, చివరికి తాను చనిపోయినపుడు కూడా తన పెదాలతో పలికిన ఆఖరి పేరు “హె రామ్ “
How Gandhiji Realized the Importance of Truth?
Episode – 1
భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న రోజులవి , గాంధీ ఫ్రెండ్ రమేష్ , బ్రిటిషర్లు ఎందుకు అంత దృడంగా ఉంది గట్టిగ అరవగలుగుతారో నీకు తెలుసా? అని గాంధీని అడిగాడు. దానికి దానికి గాంధీ తెలియదు అని చెప్పాడు. అపుడు రమేష్, ఎందుకంటే..! వారు మాంసం తింటారు కాబట్టి. మనం కూడా మాంసం తింటే గట్టిగ మరియు దృఢంగా అవొచ్చు అని చెప్పాడు.
అప్పటి నుండి గాంధీ ఇంట్లోవారికి తెలియకుండా బయట మాంసం తినడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులయ్యాక గాంధీజీ వారి తల్లితండ్రుల్ని మోసం చేస్తున్నానని, అనుకుని మాంసం తినడం మానేసాడు.
Episode – 2
ఆ తరువాత గాంధీజీ కి సిగరెట్ తాగడం అలవాటైంది. ఎంతో విలువ గల సిగరెట్ కొనుక్కోవడం కోసం అందరి దగ్గర అప్పు చేసేవాడు. ఆ అప్పుని తీర్చడం కోసం ఒకరోజు ఇంట్లో బంగారాన్ని దొంగిలించాడు. మరుసటి రోజు నుండి గాంధీజీ సరిగా నిద్ర పోలేకపోయాడు.
తాను చేసిన అంత పెద్ద తప్పుని తల్లి తండ్రులకి చెప్పలేని పరిస్థితి. కానీ, చేసేది ఏమిలేక ఒకరోజు ఒక లెటర్ తాను చేసిన తప్పులన్నీ రాసి అనారోగ్యంతో ఉన్న తన తండ్రి చేతిలో పెట్టాడు. అది చదివిన తన తండ్రి ఎంతో బాధతో ఆ ఉత్తరాన్ని చించేసాడు. అది చూసి గాంధీ చాలా ఏడ్చాడు. అపుడే గాంధీకి అర్థమైంది సత్యం ఎంత విలువైందో అని . అపుడే నిశ్చయించుకున్నాడు గాంధీ ఎప్పటికి సత్య మార్గంలో నడవాలని .
Episode – 3
ఒకరోజు గాంధీజీ ఊరిలో డ్రామా నడుస్తుంది. ఆ విషయం తెలిసాక గాంధీ తన తండ్రి దగ్గరికి వెళ్లి నాన్న, దగ్గర్లోనే ఒక డ్రామా కంపెనీ వారు నాటకం వేస్తున్నారని తెలిసింది మనం వెళ్దామా? అని అడిగాడు. కానీ, తన తండ్రికి పని ఉన్నందున, మోహన్ ఈ రోజు నాకు చాలా పని ఉంది మనము ఇంకా ఏదైనా రోజు వెళదామని చెప్పాడు.
గాంధీ, నాన్న నా ఫ్రెండ్ రమేష్ తో కలిసి వెళ్లనా ? అని అడిగాడు. నాన్న సరే మోహన్. కానీ, నాటకం అయిపోగానే వెంటనే ఇంటికి వచ్చేయాలని చెప్పి పంపించాడు.
అక్కడ నాటకంలో… రాజా హరిశ్చంద్ర సత్య మార్గంలో నడవాలని తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని కోల్పోయాడు అని నాటకం వేసి చూపించారు. అది చూసిన ప్రజలందరి కళ్ళ వెంట నీరు కారింది. అది చూసిన గాంధీ , రాజా హరిశ్చంద్ర సత్య మార్గం కోసం చేసిన త్యాగాలకు ముగ్దుడయ్యాడు. ఇక నుండి “నా జీవితం మొత్తం సత్యమార్గంలో నడుస్తాను “. నీవు కూడా అలాగే ఉండాలి అని తన ఫ్రెండ్ రమేష్ కి చెప్పాడు. కానీ రమేష్, అది అంత సులభం కాదు మోహన్ అని చెప్పాడు. కానీ గాంధీ అదేమీ వినకుండా సత్యమార్గాన్నే ఎంచుకున్నాడు. అది ఎంత అంటే, గాంధీ గారి ధైర్యాన్ని మరియు సత్య మార్గాన్ని చూసి చాలా మంది ఆయన్ని అనుసరించారు మరియు అందరికి గాంధీ నాయకుడయ్యాడు. .
How Gandhiji Decided to Be Sincere in a Small Age?
ఒకసారి గాంధీ యొక్క తరగతి గదికి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వచ్చాడు. అపుడు ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది. ఆఫీసర్ ,నేను కొన్ని ఆంగ్ల పదాలు చెప్తాను వాటిని మీరు చూడకుండా రాయాలి అని చెప్పాడు. అక్కడే ఉన్న మాస్టారు ఆ మాట విని భయపడ్డాడు. ఏ విద్యార్థి అయినా తప్పుగా రాస్తే తన పరిస్థితి ఎలా అని .. ? ఆఫీసర్ కొన్ని పదాలు చెప్పాడు. ఒక్క గాంధీ తప్ప మిగతా అందరు కరెక్ట్ గా రాసారు. అది చూసిన మాస్టారు గాంధీకి పక్క వారి దాంట్లో చూసి కాపీ చేయమని సైగలు చేసాడు. కానీ గాంధీ అలా చేయలేదు.
క్లాస్ నుండి ఆఫీసర్ వెళ్లిపోయాక మాస్టారు గాంధీ దగ్గరికి వెళ్లి , నేను చెప్పాను కదా..! కాపీ చేసి రాయమని ఎందుకు చేయలేవు? అని కోపగించుకున్నాడు. అపుడు గాంధీ, సారీ..! మాస్టారు నేను కాపీ చేయలేను నేను ఎంతవరకు రాయగలనో అంతే రాస్తాను. అని చెప్పాడు. అంత చిన్న వయసులోనే గాంధీజీ యొక్క నిజాయితీని చూసి మాష్టారు ఆశ్చర్యపోయాడు.
How Gandhiji Fought Injustice Through Satyagraha?
మహాత్మా గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి విక్టోరియా కి ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు. అంతలోనే గాంధీ దగ్గరికి ఒక యూరోపియన్ వచ్చి, హేయ్.. నువ్వు బ్లాక్ (నల్లజాతీయుడు)నీకు ఫస్ట్ క్లాస్ లో కూర్చునే అర్హత లేదు . వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగ అరిచాడు. అది విన్న గాంధీ, నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాను. ఇక్కడ కూర్చొని ప్రయాణించడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పాడు. అది విన్న యూరోపియన్ మీ బ్లాక్స్ ప్రయాణించాల్సింది లాస్ట్ క్లాస్ లో. ఇది కేవలం మా వైట్స్(తెల్ల జాతీయుడు) కోసం అని చెప్పాడు. అయినా గాంధీ అక్కడే కూర్చున్నాడు.
వెంటనే ఆ యూరోపియన్ స్టేషన్ మాస్టారు కి కంప్లైంట్ చేసాడు. అతను వచ్చి గాంధీని ట్రైన్ లో నుండి లగేజ్ తో పాటు బయటకి తోసేసాడు. ఆ రోజు రాత్రి మొత్తం గాంధీ చలిలో ఆ స్టేషన్ లోనే ఉండిపోయాడు. గాంధీ ఒక విషయం గురించి చాలా దృఢంగా నిర్ణయం తీసుకున్నాడు. అన్యాయం జరగకుండా పోరాడాలని. మనుషులంతా సమానమే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అని అందరికి తెలియ చెప్పాలని. అప్పుడే గాంధీజీ మొదలు పెట్టిన ఉద్యమం “సత్యగ్రహ్ “.
A true inspiration for the nation
Yes indeed.