వ్యాపారవేత్త – సేవకుడు | Merchant – Servant

వ్యాపారవేత్త - సేవకుడు | Merchant - Servant
వ్యాపారవేత్త – సేవకుడు | Merchant – Servant

రాజ సేవకుడిని , వ్యాపారవేత్త అందరిలో  చాలా అవమానించాడు . ఆత్మ గౌరవం  కలిగిన ఆ రాజ సేవకుడు చాలా బాధపడ్డాడు. ఆ రోజంతా నిద్ర పోకుండా తనకి జరిగిన అవసమానం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.

రాజసేవకుడు, నేనే కనుక రాజు అయి ఉంటె..,  ఇప్పటికి ఆ వ్యాపారవేత్తని శిక్షించి ఉండేవాడిని. కానీ, నేనేమి చేయగలను..? నేనొక సామాన్య వ్యక్తిని. ఎలాంటి అధికారం లేనటువంటి ఒక సేవకుడిని.  అని తనలో తానె కుమిలిపోతూ మరుసటి రోజు కూడా రాజసభకి సేవ చేయడానికి వెళ్ళలేడు.  ఎదో ఒకటి చేయాలనీ,  తనని అంతలా అవమానించిన ఆ వ్యాపారవేత్తకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని,  నిద్ర పోకుండా బాగా ఆలోచించాడు. అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది.

మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారి ఆస్థానానికి వెళ్లి,  రాజుగారి గదిని శుభ్రం చేయడానికి లోపలి వెళ్ళాడు. రాజు గారు మెలకువగా ఉన్నది చూసిన  సేవకుడు,  తనలో  తాను ఇలా అనుకోవడం మొదలుపెట్టాడు ” ఆ వ్యాపారవేత్త రాణిగారితో అలా అసభ్యంగా ప్రవర్తించాల్సింది కాదు. సేవకుడిని అయినా  నేను ఏమి చేయలేకపోతున్నాను.  పాపం రాణి గారు ఎంత భాధపడ్డారో ..?!  అని రాజుగారికి వినబడేలా గొణిగాడు(తనలో తానే మెల్లగా మాట్లాడుకోవడం).

అది విన్న రాజు, వెంటనే కోపంతో లేచి  సేవకుడితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు  అన్నది నిజమా ..?అని గట్టిగా ప్రశ్నించాడు.  అందుకు సేవకుడు రాజుగారి కాళ్లు  పట్టుకుని క్షమించండి ప్రభు. నేనేమైన తప్పుగా మాట్లాడి ఉంటె, రెండురోజుల నుండి సరిగా నిద్ర పోనందున నేనేమి  మాట్లాడ్తున్నానో.., నాకే తెలియడం లేదు  అని కాళ్ళు పట్టుకున్నాడు.

అదివిన్న రాజు సేవకుడినైతే వదిలేసాడు. కానీ, తన మనసులో సేవకుడు అన్న మాటలు మెదులుతూనే ఉన్నాయి. వెంటనే వెళ్లి రాణిని అడగలేని పరిస్థితి,  ఒకవేళ అది అబద్ధం అయితే రాణి తనను అపార్థం చేసుకుంటుంది  అని ఆలోచించాడు.

ఆరోజు నుండి వ్యాపారవేత్తతో రాజుకు ఉన్న వ్యాపార సంబంధాన్ని వదులుకున్నాడు. అర్దాంతరంగా రాజు అలా ప్రవర్తించడానికి కారణం, ఏం   జరుగుతుందో వ్యాపారవేత్తకు ఏమి అర్ధం కాలేదు. ఆ విషయం గురించి అడగడానికి వ్యాపారవేత్త రాజు గారి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసాడు. వెంటనే రాజు ,తన భటులతో వ్యాపారవేత్తని లోనికి రానివ్వొద్దని ఆజ్ఞాపించాడు.

అక్కడే ఉండి  అన్ని చూస్తున్న రాజసేవకుడు భటులతో.., ఓ భటులారా …! మీరు ఆపుతుంది ఎవరిని..? రాజుతో సంభందం ఉన్న ఒక గొప్ప వ్యాపారవేత్తని.  అతను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలడు.  నన్ను అందరిలో అవమానించినట్టుగా మిమ్మల్ని కూడా అవమానించగలడు.  లేకుంటే కఠినమైన శిక్ష కూడా వేయగలడు అని  అన్నాడు.

అది విన్న వ్యాపారవేత్తకు అంతా అర్థమైంది. రాజుగారు తన పట్ల ఇలా ప్రవర్తించడానికి సేవకుడే కారణమని భావించాడు. మరునాడు సేవకుడిని ఇంటికి పిలిచి విలువైన బహుమానాలని సమర్పించి , మంచి విందు భోజనం పెట్టించాడు.  వ్యాపారవేత్త, సేవకుడితో ఆ రోజు జరిగిన దానికి నేను చింతిస్తున్నాను.

నా కూతురి పెళ్లిలో నువ్వు రాజుగారి కోసం మరియు వారి కుటుంబం కోసం ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చున్నావు.  అంతలోనే రాజుగారు వచ్చారు.  అది చూసిన నాకు చాలా కోపం వచ్చి నిన్న అందరిలో అవమానించాను. అలా చేయడం నా తప్పే నిజానికి నేను నిన్ను అలా అవమానించాల్సింది కాదు. నన్ను క్షమించు అన్నాడు ఆ వ్యాపారవేత్త.

వ్యాపారవేత్త ఇచ్చిన విలువైన బహుమానాలని చూస్తూ మురిసిపోయిన రాజ సేవకుడు. మీ మంచి మనస్సు నాకు అర్థమైంది. మనిషి అన్న తరువాత ఎపుడైనా ఒక తప్పు చేస్తుంటాడు. చేసిన తప్పుని సరిదిద్దుకోవడం మంచితనానికి నిదర్శనం. మీరు మీ మంచితనాన్ని నిరూపించుకున్నారు. మీ పైన రాజు గారికి ఏర్పడిన చెడు  అభిప్రాయాన్ని నేనే తొలగిస్తాను అని మాట ఇచ్చి తన ఇంటికి వచ్చేసాడు.

సేవకుడు రెండు రోజుల పాటు రాజుగారి సేవకి వెళ్లలేదు. ఆ తరువాతి రోజు ఉదయాన్నే వెళ్లి రాజుగారు లేవకముందే తన గది  శుభ్రం చేయడానికి వెళ్లాడు. రాజుగారు నిద్ర లేస్తున్న సమయాన్ని గమనించి,  మళ్లి  తాను గొణగడం ప్రారంభించాడు.

ఏది ఏమైనా రాజు గారు అలా చేయడం తప్పు. అంతమంది ఉన్న సభలో అందరి ముందు అంత అసహ్యంగా దోసకాయని తినడం అవసరమా…?! అని మళ్లీ  మళ్లి అదే గొణిగసాగాడు. అది విన్న రాజు గారు కోపంతో సేవకుడిని నిలదీసాడు. ఏం  మాట్లాడుతున్నావు?

నువ్వు అని. వెంటనే సేవకుడు క్షమించండి రాజా నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటె..  రెండు రోజులుగా నిద్ర పోనీ కారణంగా నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్ధం కావట్లేదు. నేనేమైన తప్పుగా మాట్లాడి ఉంటా నన్ను క్షమించండి అని కాళ్లు పట్టుకున్నాడు.

అందరు చూస్తుండడంతో రాజుగారు సేవకుడిని వదిలేసాడు. కానీ,  బాగా  ఆలోచించి తాను అంత అసభ్యంగా సభలో ఎప్పుడు ప్రవర్తించలేదని,  అసలు తాను ఎపుడూ  దోసకాయని తినడానికి కూడా ఇష్టపడనని గుర్తుచేసుకొని. సేవకుడు సరిగా నిద్ర పోనందుకు జరిగిన అనర్థం ఇది అని అనుకున్నాడు. అంటే అంతకుముందు వ్యాపారవేత్త విషయం కూడా ఇలాగే జరిగి ఉంటుందని భావించాడు.

వ్యాపారవేత్తతో తాను రద్దు చేసుకున్న వ్యాపార సంబంధాలని తిరిగి మొదలుపెట్టాడు. రాజు వ్యాపారిని రాజభవనానికి ఆహ్వానించాడు మరియు బహుమతులు, ఆభరణాలు మరియు వస్త్రాలతో అతడిని సత్కరించ్చడు.. రాజుగారు  వ్యాపారవేత్తని, గతంలో నియమించిన స్థానానికి తిరిగి నియమించాడు. ఆ సేవకుడిని తానూ ప్రస్తుతం చేస్తున్న పని నుండి తప్పించి మరొక పనిలో కుదిర్చాడు.   

నీతి | Moral : “రాజులని, ధనవంతులని పెద్ద పదవిలో ఉన్నవారినే కాదు, ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరి ఆత్మ గౌరవానికైనా  ఇబ్బంది కలిగేలా చేస్తే దాని పర్యవసానం అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ అల్పుడిగా భావించిన రాజ సేవకుడు తన తెలివి తేటలతో ఆ వ్యాపారవేత్తని దోషిలా నిల్చోబెట్టాడు, తిరిగి యథా స్థానంలో కూర్చోబెట్టాడు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికి వారే గొప్ప.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *