ఒకరోజు థామస్ ఎడిసన్ స్కూల్ నుండి ఇంటికి వచ్చి తన తల్లికి ఒక లెటర్ ఇచ్చి ఇలా చెప్పాడు.”నా గురువు నాకు ఈ లెటర్ ఇచ్చి ఇది కేవలం మీ అమ్మకి మాత్రమే ఇవ్వు అన్నాడు” అని చెప్పాడు. ఆ తల్లి ఎడిసన్ కి ఆ లెటర్ ని ఇలా చదివి వినిపించింది. ” మీ కొడుకు చాలా మేధావి” అతనికి శిక్షణ ఇవ్వడానికి తగినంత మంచి ఉపాధ్యాయులు లేరు. దయచేసి అతనికి మీరే నేర్పండి. ” అని చదువుతూ తన కళ్ళు నీటి పర్యంతం చేసుకుంది.
ఎడిసన్ తల్లి చనిపోయిన చాలా సంవత్సరాల తరువాత, ఎడిసన్ ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కర్తలలో ఒకడు అయ్యాడు. ఒక రోజు అతను తన పాత రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ తన తల్లి యొక్క డైరీ ని చూసి ఓపెన్ చేసి చూసాడు అందులో ఒక లెటర్ కనబడింది అది తన గురువు వాళ్ళ తల్లికి రాసిన సందేశం.దానిని తెరిచి చదివాడు.“మీ కొడుకు మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. మేము అతన్ని ఇకపై మా పాఠశాలకు అనుమతించలేము. అతను బహిష్కరించబడ్డాడు. ” అని.
ఎడిసన్ దానిని చదివి ఉద్వేగానికి లోనయ్యాడు మరియు తరువాత అతను తన డైరీలో ఇలా వ్రాశాడు, “థామస్ అల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు. కానీ,అతని తల్లి అతన్ని శతాబ్దపు మేధావిగా మార్చింది
నీతి | Moral : తల్లి ప్రేమ మరియు పెంపకం పిల్లల విధిని మార్చడానికి సహాయపడుతుంది.