ఒక సాయంత్రం వంటగదిలో వంట చేస్తున్న తల్లి దగ్గరికి ఒక లెటర్ తీస్కొని వచ్చాడు కొడుకు.
అందులో ఇలా రాసి ఉంది.
పార్క్ లో గడ్డిని కత్తిరించినందుకు :: Rs 5.00
ఈ వారం నా గదిని శుభ్రం చేసినందుకు :: Rs 10.00
మీ కోసం దుకాణానికి వెళ్ళినందుకు :: Rs 5.00
మీరు షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు తమ్ముడిని చుస్కున్నందుకు :: Rs 10.00
చెత్తను తీసి బయట వేసినందుకు :: Rs 5.00
మంచి మార్క్స్ పొందినందుకు :: Rs 10.00
యార్డ్ శుభ్రం చేసినందుకు :: Rs 5.00
చెల్లించాల్సిన మొత్తం :: Rs 50.00
అమ్మ, మీరు నాకు ఇవ్వాల్సిన మొత్తం 50 రూపాయలు, ఇవ్వు అని అడిగాడు.
దానికి తాను తన కొడుకుని చూసి నవ్వి ఆ పేపర్ వెనకాలే ఇలా రాసింది.
నేను నిన్ను తొమ్మిది నెలలు మోసినందుకు :: ఛార్జ్ లేదు.
నీ ఆరోగ్యం బాగోలేనప్పుడు నీ గురించి చాలా రాత్రులు నిద్ర పోకుండా ఉన్నందుకు :: ఛార్జ్ లేదు.
నేను నీ ఎగుదల మరియు నీకు తెలివిని ఇవ్వడానికి కష్టపడినందుకు :: ఛార్జ్ లేదు.
నీకోసం రోజు వంట చేస్తున్నందుకు : ఛార్జ్ లేదు.
బొమ్మలు, ఆహారం, బట్టలు మరియు నీ ముక్కును తుడిచివేస్తున్నందుకు :: ఛార్జ్ లేదు.
నీ రోజు హోంవర్క్ లో హెల్ప్ చేస్తున్నందుకు :: ఛార్జ్ లేదు.
నువ్వు నాకు ఇవ్వాల్సిన మొత్తం:: నా జన్మంతా నన్నునన్ను ప్రేమించడం.
అలా రాసి కొడుకుకి ఇచ్చింది.
దానిని చదివిన బాలుడు నీటితో నిండిన కళ్ళతో వచ్చి తల్లిని గట్టిగ హత్తుకుని ఇలా అన్నాడు.
“అమ్మ, నేను నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను” .
ఆ బాలుడు పెన్ తీస్కొని పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా వ్రాశాడు అమ్మా! “నువ్వు నాకు పూర్తిగా చెల్లించావు .”
ఇక చెల్లించాల్సింది నేనే!…