మా అమ్మకు ఒక కన్ను మాత్రమే ఉండేది. నేను ఆమెను చాలా అసహ్యించుకునేవాడిని. ఆమె అంత ఇబ్బందిగా ఉండేది. మా అమ్మ ఒక మార్కెట్ వద్ద ఒక చిన్న దుకాణం నడిపేది. ఆమె చిన్న కలుపు మొక్కలను సేకరించి, అమ్మేది. దానితో మాకు అవసరమైన డబ్బు తనే సంపాదించేది. నాకు చాలా గుర్తుంది ఈ సంఘటన,నేను ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సమయంలో ఒకరోజు…. !
ఆ రోజు గేమ్స్ డే అని నాకు గుర్తు, మరియు మా అమ్మ స్కూల్ కి వచ్చింది. ఆమెని చూసి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆమె నన్నుఅందరిలో ఎగతాళి అయ్యేలా చేసింది. నేను ఆమె ద్వేషపూరిత రూపాన్ని చూసి వెంటనే స్కూల్ నుండి బయటకు పరుగెత్తాను. మరుసటి రోజు పాఠశాలలో… “మీ అమ్మకు ఒక్క కన్ను మాత్రమే ఉందా ?!”అని నా ఫ్రెండ్స్ నన్ను చాలా హేళన చేసారు.
ఆ సమయంలో నా తల్లి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతే బాగుండు అని కోరుకున్నాను. కాబట్టి నేను మా అమ్మతో, “అమ్మ, నీకు ఎందుకు ఇంకొక కన్ను లేదు ?! నువ్వు నన్ను అందరిలో సిగ్గుపడేలా చేస్తున్నావు. నువ్వు ఎందుకు చనిపోవు? ” అని అడిగాను. దానికి మా అమ్మ స్పందించలేదు. నాకు చాలా కోపం వచ్చింది. నేను అడిగిన దానికి తాను సమాధానం ఇవ్వలేదు. కాని నేను చెప్పాలనుకున్నది చెప్పానని చాల హ్యాప్పీగా ఫీల్ అయ్యాను. తాను నన్ను ఏమి అనకపోవడంతో నేను అసలు తనను ఎక్కువగా బాధ పెట్టలేను అని అనుకు న్నాను
ఆ రోజు రాత్రి… నేను నిద్ర లేచాను, ఒక గ్లాసు నీరు తీసుకోవడానికి వంటగదికి వెళ్ళాను. నా తల్లి అక్కడ ఏడుస్తూ ఉంది, చాలా నిశ్శబ్దంగా, నేను తనని చూసాను ఇక అక్కడి నుండి వచ్చేసాను. నాకు అర్థమైంది నేను ఉదయం చెప్పిన దానికే ఏడుస్తుందని !నా గుండె మూలలో కొద్దిగా బాధ అన్పించింది. అయినప్పటికీ, ఒక కన్ను నుండి ఏడుస్తున్న నా తల్లిని చూసి నేను అసహ్యించుకున్నాను. మా పేదరికాన్ని మరియు ఒక కన్ను ఉన్న నా తల్లిని నేను బాగా అసహ్యించుకునెలా చేశాయి. ఆ కసితో బాగా చదివి గొప్పవాడిని కావాలనుకున్నాను.
అప్పుడు నేను చాలా కష్టపడ్డాను. నేను నా తల్లిని విడిచిపెట్టి వేరే రాష్ట్రానికి వచ్చి చదువుకున్నాను, ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో నాకు సీటు వచ్చి కష్టపడి చదువుకున్నాను. నాకు మంచి జాబ్ వచ్చింది. వివాహం జరిగింది. నేను స్వంత ఇల్లు కొన్నాను. అప్పుడు నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను విజయవంతమైన వ్యక్తిగా సంతోషంగా జీవిస్తున్నాను. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇది నా తల్లిని గుర్తు చేయని ప్రదేశం.
ఈ ఆనందం రెట్టింపవుతుంది. ఒకరోజు అనుకోకుండా ఒక వ్యక్తి నన్ను చూడటానికి వచ్చినప్పుడు “ఏమిటి ?! ఇది ఎవరు ?! ” ఇది నా తల్లి… ఇప్పటికీ ఆమె ఒక కన్నుతో! ఆకాశం మొత్తం నాపై పడిపోతున్నట్లు అనిపించింది. నా కూతురు నా తల్లి కంటికి భయపడి పోయింది.
నేను ఆమెను అడిగాను, “మీరు ఎవరు? మీరు నాకు తెలియదు !! ” నేను దానిని నిజం చేయడానికి ప్రయత్నించినట్లు. నేను ఆమెను అరిచాను “మీరు నా ఇంటికి వచ్చి నా కూతురుని భయపెట్టడానికి ఎంత ధైర్యం! ఇప్పుడే ఇక్కడినుండి వెళ్ళు !! ” దీనికి, నా తల్లి నిశ్శబ్దంగా, “ఓహ్, నన్ను క్షమించండి. నేను తప్పు చిరునామాకి వచ్చి ఉంటాను అని తాను వెళ్ళిపోయింది . అప్పుడు నేను చాలా హ్యాప్పీ గా ఫీల్ అయ్యాను. నేను అసలు తనను పట్టించుకోవద్దని లేదా నా జీవితాంతం దీని గురించి ఆలోచించనని అనుకున్నాను .
కొన్ని రోజుల తరువాత, ఒక రోజు, పాఠశాల పున: కలయికకు సంబంధించిన ఒక లేఖ నా ఇంటికి వచ్చింది. నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నానని చెప్పి భార్యతో అబద్దం చెప్పాను. పున:కలయిక తరువాత, నేను మా పాత షాప్ వద్దకు వెళ్ళాను, అక్కడే ఉన్న మా ఇంటికి వెళ్లాను. నా తల్లి చల్లని నేలమీద పడిపోయింది. అది చూసి కానీ నాకు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు . ఆమె చేతిలో కాగితం ముక్క ఉంది…. అది నాకు రాసిన లేఖ.
ఆమె ఇలా రాసింది:
ప్రియమైన నా కుమారునికి !
నా జీవితం ఇప్పటికే చాలా గడిచిపోయిందని అనుకుంటున్నాను. నేను ఇంకా నీ దగ్గరికి రాను. కానీ నువ్వు నన్ను ఒక్కసారి కలవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు. ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది. నువ్వు పాఠశాల పున:కలయిక కి వస్తున్నావని తెలిసి చాలా హ్యాప్పీగా ఫీల్ అయ్యాను. కానీ నిన్ను కలవడానికి నేను స్కూల్ కి రాలేను నా ఒక కంటితో నిన్ను మళ్లి ఇబ్బంది పెట్టలేను.
నీ చిన్నపుడు నీకు ఒక ఆక్సిడెంట్ అయింది అందులో నీకు ఒక కన్ను పోయింది. నా కొడుకుని ఒక కంటితో చూడలేక నా కంటిని నీకు ఇచ్చేసాను. నేను చాలా గర్వపడ్డాను. నా కంటి తో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నపుడు. నువ్వు నాకు ఒక కన్ను ఉన్నందువల్ల చాలా కోప్పడ్డావు కానీ నీకు నాపైన ప్రేమ ఉన్నందువల్లనే అలా చేస్తున్నావని అనుకున్నాను. నీ చిన్నతనాన్ని నీ జ్ఞాపకాలని నేను చాలా మిస్ అవుతున్నాను. నువ్వే నా ప్రపంచం… అని రాసింది.
నా ప్రపంచం ముక్కలైంది. నా కోసం మాత్రమే జీవించిన వ్యక్తిని నేను అసహ్యించుకున్నాను. నేను నా తల్లిని చాలా సార్లు అరిచాను, నేను చేసిన చెత్త పనులకు ముక్తి మార్గం నాకు తెలియదు అని అనుకున్నాను బాధతో నిండిన హృదయంతో… …
One Comment