ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతని కుమారుడు ఉద్యోగ నిమిత్తం నగరంలో నివసించేవాడు.తన కుమారుడుని చూసి చాలా రోజులయ్యింది. ఒకరోజు రామయ్య తన కుమారుడుని కలవాలనుకున్నాడు. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కుమారుడి దగ్గరి నుండి ఏ అడ్రస్ నుండి లెటర్స్ వస్తాయో అక్కడికి వెళ్ళాడు. “కాలింగ్ బెల్ కొట్టి తన కుమారుడే తలుపు తీస్తాడని ఆతృతగా వేచి చూస్తున్నాడు”. కానీ అక్కడ తన కుమారుడు తలుపు తెరువలేడు..ఎవరో ఒకతను వచ్చాడు. అపుడు రామయ్య తన కుమారుడు మోహన్ ఎక్కడ అని అడిగాడు. ఆ వ్యక్తి మోహన్ కొన్ని రోజుల క్రితమే ఈ రూమ్ కాళీ చేసి వెళ్లిపోయాడని చెప్పాడు. రామయ్య చాలా నిరాశ చెందాడు.ఇంత” పెద్ద మహానగరంలో తన కొడుకుని ఎక్కడని వెతకాలి అని చింతించాడు”.
ఆ మార్గం గుండా నడుస్తూ అందరిని తన కుమారుడు మోహన్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసా అని ఆరాదీస్తూ వెళ్ళసాగాడు. అంతలో ఒకరు నాకు మోహన్ ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసనీ రామయ్య కి మోహన్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు.
రామయ్య ఆనందంగా ఆఫీసుకు వెళ్లి రిసెప్షన్ కౌంటర్ వద్ద, “దయచేసి ఈ ఆఫీసులో మోహన్ పనిచేసే గది ఎక్కడ అని నాకు చెప్పగలరా?” రిసెప్షనిస్ట్ ని అడిగాడు. రిసెప్షనిస్ట్ మీరు మోహన్ కి ఏమవుతారు అని తెలుసుకొని మోహన్ రూమ్ కి పంపించింది.
రామయ్య క్యాబిన్లోకి ప్రవేశించాడు మరియు మోహన్ ను చూడగానే అతని కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. మోహన్ తన తండ్రిని చూసి సంతోషించాడు. వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆపై రామయ్య ,మోహన్ ని అడిగాడు, “మోహన్ ! అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది” నువ్వు నాతో ఇంటికి రాగలవా ? ”
మోహన్ స్పందిస్తూ, “నాన్న గారు లేదు. నేను రాలేను. నా ప్రమోషన్ కోసం నేను చాలా బిజీగా ఉన్నాను మరియు చాలా ఒత్తిడితో కూడిన పనితో బిజీ గ ఉన్నాను. లీవ్ తీస్కొని ఇంటికి రావడం చాలా కష్టం అని చెప్పాడు.” రామయ్య ఒక సాధారణ చిరునవ్వు ఇచ్చి”, “సరే! నువ్వు నీ పని చేస్కో . నేను ఈ రోజు సాయంత్రం మన గ్రామానికి తిరిగి వెళ్తాను. ” మోహన్ అడిగాడు, “మీరు నాతో కొన్ని రోజులు ఉండగలరా?దయచేసి. ” ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత రామయ్య స్పందిస్తూ, “మోహన్ నువ్వు నీ పనులలో బిజీగా ఉన్నావు. నేను నిన్ను అసౌకర్యానికి గురిచేయడం లేదా నీకు భారంగా మారడం నాకు ఇష్టం లేదు. ” అని చెప్పి వెళ్ళిపోయాడు.
కొన్ని వారాల తరువాత, మోహన్ తన తండ్రి ఎందుకు ఒంటరిగా వచ్చాడని ఆశ్చర్యపోయాడు. తన తండ్రితో సరిగా మాట్లాడలేనని అతను బాధపడ్డాడు.దానితో అతని పద్ధతి అతనికే నచ్చక కొన్ని రోజులు ఆఫీస్ కి సెలవు తీసుకొని తండ్రిని కలవడానికి తన గ్రామానికి వెళ్ళాడు. అతను పుట్టి పెరిగిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, తన తల్లిదండ్రులు అక్కడ లేరు. అతను షాక్ అయ్యాడు మరియు పొరుగువారిని అడిగాడు, “ఇక్కడ ఏమి జరిగింది? నా తల్లిదండ్రులు ఈ ఇంట్లోనే ఉండాలి కదా?! వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అతని తల్లిదండ్రులు ఉంటున్న స్థలం గురించి పొరుగువారు మోహన్ కి చెప్పారు.
మోహన్ ఆ ప్రదేశానికి వెళ్ళాడు , ఆ స్థలం స్మశానవాటిక లాంటిదని గమనించాడు. మోహన్ కళ్ళు కన్నీళ్ళతో నిండి, నెమ్మదిగా ఆ ప్రదేశం వైపు నడవడం ప్రారంభించాడు. అతని తండ్రి రామయ్య మోహన్ వస్తున్నాడని గమనించి చేయి పైకెత్తి ఊపాడు.
మోహన్ తన తండ్రిని చూసి పరిగెత్తడం మొదలుపెట్టాడు.
మోహన్ వాళ్ళ తల్లి తండ్రులు ఉంటున్న ప్రదేశాన్ని చూసి సిగ్గుపడి తలదించుకున్నాడు. నాన్నగారు మీరు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేరు అని అడిగాడు. నేను నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను కానీ నువ్వు నీ పనిలో చాల బిజీగా మరియు ఒత్తిడిలో ఉన్నావు, “మేము కోరుకునేది నీ ఆనందం మాత్రమే” మళ్ళీ నేను నీకు ఇది చెప్పి బాధపెట్టడం మరియు నీకు బరువు కావడం ఇష్టం లేక చెప్పకుండా వచ్చేసాను అన్నాడు.
మోహన్ తన చెమ్మగిల్లిన కళ్ళతో నేను పరాయివాడిని కాదు నాన్న మీరు నాకు చెప్పి ఉండాల్సింది అని తండ్రిని హత్తుకున్నాడు.
అసలు మన ఇల్లు ఏమైంది అని అడిగాడు. నీ ఉన్నత చదువుల కోసం నేను బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాను మరియు నువ్వు కారు కావాలన్నపుడు మరింత తీసుకున్నాను. కానీ వ్యవసాయంలో నష్టం వచ్చేసరికి నేను అప్పు చెల్లించలేకపోయాను బ్యాంకు వాళ్ళు మన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాడు.
రామయ్య,”ఇప్పుడు మాకున్న దానితో మేము సంతోషంగా ఉన్నాము” కానీ మేము ఆశించేది “నీ నుండి కాస్త సమయాన్ని” ఎందుకంటే మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము అని చెప్పాడు. ఈ వృద్ధాప్యంలో మేము తరచు నగరానికి ప్రయాణించడం చాలా కష్టం నువ్వే మమ్మల్ని చూడటానికి సమయం చూసుకొని రావాలని చెప్పాడు. మోహన్ తన తండ్రిని క్షమాపణలు చెప్పి తనని క్షమించమని కోరాడు.
నీతి | Moral : “తల్లితండ్రులు ఎల్లపుడు మిమ్మల్ని సంతోషపెట్టడానికి చేయగలిగినంత” చేస్తారు.మీరు వాటిని పట్టించుకోరు. మీ జీ’వితంలో మీరు ఎన్ని విజయాలు సాధించిన మీ కన్నవాళ్ళని మర్చిపోకండి” వారి కోసం “కాస్త సమయాన్ని ఇవ్వండి”, వారు అంతకుమించి ఏమి ఆశించరు”.
Super story
Thanks for the complement. There are many such beautiful and inspiring stories on my website. Enjoy these stories and share with your loved ones:)