ఆ బరువు మోయక్కర్లేదు….!| Put The Glass Down
ఆ బరువు మోయక్కర్లేదు….!| Put The Glass Down

ఒక ప్రొఫెసర్ ఒక మంచినీటి  గ్లాసులో నీళ్లు ఫుల్ చేసి  ఆ గ్లాస్   అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకున్నాడు. మరియు విద్యార్థులను అడిగారు, “ఈ గ్లాస్  బరువు ఎంత అని మీరు అనుకుంటున్నారు?”

‘50 గ్రాములు! ’….‘ 100 గ్రాములు! ’……‘ 125 గ్రాములు ’…… విద్యార్థులు సమాధానం ఇచ్చారు.

అప్పుడు ప్రొఫెసర్ ఇలా అన్నాడు,  నేను ఈ గ్లాస్ ని కొలిస్తే తప్ప  చెప్పలేము.   ఈ నీటి గ్లాస్ యొక్క ఖచ్చితమైన బరువు  ఎంత..? అని అన్నాడు.

ఈ నీటితో నిండి ఉన్న గ్లాస్ ని  నేను కొన్ని నిమిషాలు ఇలాగే ఎత్తి పట్టుకుంటే  ఏమి జరుగుతుంది? ” అని  ప్రొఫెసర్ అడిగారు.

“ఏమీ జరగదు ” అని  విద్యార్థులు చెప్పారు.

“అలాగే! నేను ఒక గంట పాటు ఇలాగే ఎత్తి పట్టుకుంటే ఏమి జరుగుతుంది? ” అని అడిగారు  ప్రొఫెసర్.

 “మీకు  చేయి నొప్పి మొదలవుతుంది” అని విద్యార్థులలో ఒకరు చెప్పారు.

“మీరు చెప్పింది నిజమే, ఇప్పుడు నేను ఒక రోజు మొత్తం ఇలాగె  పట్టుకుంటే ఏమి జరుగుతుంది?”

“మీ చేయి మొద్దుబారిపోతుంది, మీకు తీవ్రమైన కండరాల ఒత్తిడి మరియు పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

ఖచ్చితంగా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ! ” అని  మరొక విద్యార్థిని చెప్పింది.  ఆ సమాధానంతో  విద్యార్థులందరూ నవ్వారు.

ఆ సమాధానంతో  ఆ ప్రొఫెసర్  మీ అందరి సమాధానాలు “చాలా బాగున్నాయి. అయితే మీరంతా ఒకటి చెప్పండి .. ? ఈ సమయంలో, గ్లాస్  బరువు మారిందా? ” అని ప్రొఫెసర్ అడిగారు.

“లేదు” అన్నారు  విద్యార్థులు.

“అప్పుడు చేయి నొప్పి మరియు కండరాల ఒత్తిడికి కారణం ఏమిటి?” అని అడిగారు ప్రొఫెసర్.  ఆ ప్రశ్న విని విద్యార్థులు ఒక్క క్షణం నిశ్శబ్దంగా అయిపోయారు.

అపుడు విద్యార్థులలో ఒకరు మీరు “గ్లాస్  క్రింద పెట్టండి”  అపుడు మీకు ఎలాంటి చేయి నొప్పి ఉండదు అన్నారు.

ఆ మాట విని,   “చాలా  సరిగ్గా చెప్పావ్ .. !”అన్నారు  ప్రొఫెసర్ . “మన  జీవితంలో వచ్చే  సమస్యలు కూడా  ఇలాంటివె. కొన్ని నిమిషాల పాటు  ఆ సమస్యనే పట్టుకుని ఆలోచించండి,  మీకు తల నొప్పి మొదలవుతుంది. ఒక గంట సేపు దాని గురించి ఆలోచిస్తే తిరిగి ఆ సమస్యే మిమ్మల్ని పట్టుకుని వేధిస్తుంది. సమస్యను ఎలా వదిలించుకోవాలో  మీకు అర్ధం కాదు. ఇంకా… మీరు  ఏమి చేయలేరని అన్పిస్తుంది.

కాబట్టి..  మన ఈ జీవిత ప్రయాణంలో చాలా  సమస్యలను చూస్తూ ఉంటాము. అందులో చాలా చిన్న సమస్యలను కూడా పట్టుకుని అవసరం లేకున్నా..  ఎక్కువగా ఆలోచిస్తాము. ఆ సమస్యను సాధించలేకపోతే జీవితమే వృధా అన్నట్టుగా మానసిక ఒత్తిడికి గురవుతాము. అసలు  మనకు జీవితంలో  ప్రతి క్షణం చాలా ముఖ్యమైనది. ఒక్కసారి చేయి దాటిపోయినా సమయం మళ్లి  తిరిగి రాదు.

చిన్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా…  జీవితాన్ని ఆనందంగా గడపండి. సమస్యను ఛాలెంజ్ లా తీసుకుని పరిష్కారం ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించండి ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. మీవల్ల కాకపోతే రోజు పడుకునే ముందు ఆ దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించండి..  భారం ఆ భగవంతునిపైన వేసి ప్రశాంతంగా నిద్రపోండి.  మరుసటి రోజు వరకు సమస్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు.  కానీ, దాని వల్ల  కలిగిన మానసిక ఒత్తిడి మాత్రం దూరమవుతుంది..

నీతి |Moral : ఈ ప్రపంచంలో చాలా మంది తమకున్న చిన్న చిన్న  సమస్యలను కూడా పెద్దవిగా భావించి ఒత్తిడికి  గురవుతారు.  నిజానికి సమస్యను సమస్యలా చూడకుండా ఒక ఛాలెంజ్ లా తీసుకుని పరిష్కారం ఆలోచించండి. తప్పకుండ ఆ సమస్యపైనా విజయం మీదే అవుతుంది.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *