ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద టేకు చెట్టు మరియు టేకు చెట్టు మొదలు దగ్గరే ఒక చిన్న గడ్డి పూవుల మొక్క ఉండేది. టేకు చెట్టు ఎప్పుడు తాను “చాల పొడవుగా,అందంగా ఉంటానని మరియు ధృడంగా ఉంటానని గొప్పలు” చెప్తూ ఉండేది. అక్కడే ఉన్నగడ్డి పూల మొక్క ఎందుకు రోజు “నిన్ను నువ్వు పొగుడుకుంటావు”? అని అడిగింది.
ఆ మాటలకి టేకు చెట్టు గడ్డి పూల మొక్క ని హేళన చేసింది. నువ్వు నీ మాటలు నాకు సాటి రావు. “నువ్వు నా అంత ఎత్తు ఉన్నావా?! ధృడంగా ఉన్నావా ?!” నన్ను చూడు ఎలా ఉన్నానో “ఈ దట్టమైన అడవిలో నాకెవ్వరు సాటిరారు అంటూ విర్రవీగేది”.
ఆ మాటలు విన్న గడ్డి పూల మొక్క అంతగా పొగుడుకోవడం కూడా మంచిది కాదు. ఎంత ధృడమైన వారికి కూడా “ఎప్పుడో ఒకసారి ప్రకృతి బారిన పడటం తప్పదని చెప్పింది”.
ఒకసారి అడవిలో బాగా గాలి వచ్చింది దానితో టేకు చెట్టు తన ఆకులని విచ్చుకొని ఆ గాలిని ఎంజాయ్ చేసింది. ఇంకొకసారి బాగా వర్షం పడింది దానితో టేకు చెట్టు తన ధృడత్వాన్ని చూపింది. కానీ, గడ్డి పూల చెట్టు ఆ రెండింటి వల్ల కాస్త నష్టపోయిన తిరి తన ప్రాణాన్ని నిలదొక్కుకుంది. అప్పుడు టేకు చెట్టు పూల మొక్కని చూసి నవ్వి ఇంకా హేళన చేసింది.
ఈసారి ఆ అడవిలో తుఫాను వచ్చింది. ఆ దెబ్బకి టేకు చెట్టు మొదలుతో సహా బయటకి వచ్చి నేలకొరిగింది. కానీ ఆ తుఫాను వల్ల గడ్డి పూల మొక్కకు ఎలాంటి అపాయం జరగలేదు.
నీతి | Moral : “నువ్వు బలంగా ఉన్నావని బలహీనంగా ఉన్న వారిని ఎప్పుడు హేళన చేయకు”. “ఎప్పుడు ఎవరి సమయం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?”. “ప్రకృతి విళయతాండవం చేస్తే ఎంత బలంగా ఉన్న నాశనం తప్పదు”