మర్రి చెట్టు పరీక్ష | A Truth behind Banyan Tree
సుబ్బులు మరియు వెంకయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సుబ్బులు మంచివాడు పైగా చాలా తెలివైనవాడు. వెంకయ్య మందబుద్ధుడు మరియు చెడుస్వభావం కలిగినవాడు. ఇద్దరు స్నేహితులు కావడంతో ఏ పని చేసిన కలిసి చేసేవారు. ప్రతి పనిలో తెలివితో కూడిన సుబ్బులు పనిని మరియు అతని సంపాదనను చూసి అసూయపడేవాడు వెంకయ్య. ఎంత పని చేసినను తన మందబుద్ధితో, చెడు స్వభావంతో అనుకున్న ఫలితం దొరక్కపోయేది వెంకయ్యకి.