జీవితం | The Life
రవి ,నిజానికి చాలా మంచి అబ్బాయి. ప్రతీ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతూ ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్నాడు. రవి ఒక్కడే సంతానం అయినందున తల్లి చాలా గారాబంగా చూసుకునేది. రవి తండ్రి ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఒకసారి రవి వాళ్ల స్నేహితుల మాటలు విని, వాళ్లతో కలిసి క్లాస్ లోని ఒక అమ్మాయిని ఏడిపించాడు.