ఒక పగిలిన కుండ | A Cracked Pot
ఒకానొక సమయంలో భారత దేశంలో ఒక నీటిని అమ్మే వ్యక్తి దగ్గర రెండు పెద్ద కుండలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక కర్ర యొక్క ప్రతి చివరన గట్టిగ కట్టాడు. కుండలలో ఒకదానికి పగుళ్లు ఉన్నాయి, మరియు మరొక కుండ ఎలాంటి పగుళ్లు లేకుండా ఉంది. ఆ వ్యక్తి ప్రతిరోజు ఆ రెండు కుండల సహాయంతో ఒక నది నుండి తన యజమాని ఇంటికి నీటిని సరఫరా చేస్తున్నాడు. కానీ పగిలిన కుండా కారణంగా ఒకటిన్నర కుండల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు.