రాజా కృష్ణదేవరాయ మరియు ఒక ఆవు | King Krishnadevaraya and a Cow
పూర్వం విజయనగర రాజ్యంలో రాజా కృష్ణదేవరాయలు అనే గొప్ప పాలకుడు ఉండేవాడు. అతను ఎంతో జ్ఞానం, దయ కలిగినవాడు. తన రాజ్యాన్ని న్యాయంగా పాలించేవాడు. దయతో , న్యాయంతో కూడిన పాలన గురించి ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకరకంగా చెప్పాలంటే కృష్ణదేవరాయల వారు అతని సుభిక్షమైన పాలన కారణంగా ప్రజలచే ప్రేమించబడ్డాడు. అతను తన పౌరులు శాంతి మరియు శ్రేయస్సుతో జీవించేలా చూసుకున్నాడు.