స్నేహం యొక్క విలువ | The Value of Friendship
ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి, ఇంకా ఏదైన చేయాలని అనుకున్నాడు. ఒక రోజు, అతను సమీపంలోని పట్టణంలో నివసించే ఒక తెలివైన వృద్ధుడి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.