The Boy and The Apple Tree
The Boy and The Apple Tree

చాలా కాలం క్రితం ఒక ఆపిల్ చెట్టు ఉండేది, ఆ చెట్టుకి చాలా ఆపిల్ పండ్లు ఉన్నాయి.  ఒక చిన్న పిల్లవాడికి దాని చుట్టూ ఆడుకోవడం   చాలా ఇష్టం.

ప్రతిరోజు ఆ పిల్లవాడు చెట్టు దగ్గరికి వచ్చి  నీడలో చెట్టుతో ఆడుకుంటుండేవాడు. చెట్టుకి కూడ ఆ పిల్లవాడు వచ్చి తనతో ఆడుకోవడం చాలా ఇష్టం . ఇలా కొద్దిరోజులు గడిచాక ఆ పిల్లవాడు చెట్టు దగ్గరికి రావడం మానేసాడు. చెట్టు ప్రతిరోజు ఆ పిల్లవాడి కోసం ఎదురుచూసేది.

కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు చెట్టు దగ్గరికి చాలా విచారంగా వచ్చాడు. అదిచూసి చెట్టు అడిగింది ” రోజు నా  దగ్గరికి ఎందుకు రావడం లేదు ఆడుకోవడానికి” అని. అప్పుడు బాలుడు నేనేమి చిన్నపిల్లాడిని కాదు నీతో ఆడుకోవడానికి,ఇప్పుడు నాకు బొమ్మలు కావలి,బొమ్మలు కొనడానికి డబ్బులు కావాలి, నువ్వు ఇవ్వగలవా ?అని అన్నాడు. అప్పుడు చెట్టు నేను డబ్బులు ఇవ్వలేను కాని నా కొమ్మలకి ఉన్న మొత్తం ఆపిల్స్ తీస్కొని అమ్ముకో నీకు డబ్బులు వస్తాయని చెప్పింది. అప్పుడు బాలుడు సంతోషంతో ఆపిల్స్ తీస్కొని వెళ్ళిపోయాడు..

చెట్టు మళ్లి రోజు  ఆ బాలుడి కోసం ఎదురు చూసింది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు మళ్లి చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు బాలుడుని అడిగింది ” నాతో ఆడుకోవా  అని” , కానీ బాలుడు నేను నీతో ఆడుకోను నాకు ఇప్పుడు సమయం లేదు నేను నా  కుటుంబం కోసం పని చేయాలి.  నాకు ఒక ఇల్లు కావలి అన్నాడు. అప్పుడు చెట్టు ” క్షమించు నాకు ఇల్లు లేదు కానీ నా  కొమ్మలు తీస్కొని నువ్వు  ఇల్లు కట్టుకో” అని చెప్పింది దానితో అతను సంతోషంగా కొమ్మలు తీసుకెళ్లాడు అతని సంతోషాన్ని చూసి చెట్టు సంతోష పడింది..మళ్లి అతను రాలేదు చెట్టు చాలా  విచారించింది. 

కొన్ని రోజులకి అతను మళ్లి చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు మళ్లి అంది”నాతో ఆడుకోవా” ? “నాకు వయసు పెరిగింది నేను కాస్త సేద తీరాలి   నాకు పడవ ఇవ్వగలవా “? అని అడిగాడు. చెట్టు నా దగ్గర పడవ లేదు కానీ నా  ట్రంక్ (కాండాన్ని)ని తీస్కోని పడవ చేస్కో అంది. అతను అలాగే చేసాడు.

చాలా రోజుల తర్వాత అతను మళ్లి చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు అంది ” ఇప్పుడు నువ్వు నాతో ఆడుకోవడానికి కొమ్మలు లేవు ,ఎక్కడానికి ట్రంక్(కాండం) లేదు, కేవలం నా  వేర్లు మాత్రం  మిగిలాయి అంది. అప్పుడు  అతను అవి చాలు “నేను విశ్రాంతి తీసుకోవడానికి అని చెట్టు వేర్ల ఒడిలో పడుకున్నాడు”. అప్పుడు చెట్టు ఎంతో  సంతోషించింది.

నీతి | Moral : ఇది అందరి కథ,ఇక్కడ చెట్టు మన తల్లితండ్రుల వంటిది చిన్నతనంలో మనం వాళ్ళతో ఆడుకుంటాము కానీ కాస్త పెద్దగా అయ్యాక వారితో కనీసం సరిగా మాట్లాడం.. అవసరమైతేనే మళ్లి వాళ్ళ దగ్గరికి వస్తాము. వారు మనకి ఎంత సహాయం చేయాలో అంత చేస్తూనే ఉంటారు.  వాళ్ళ ప్రేమను తెలుసుకొని తిరిగి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికి తల్లితండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనందరం వారిని ఎప్పటికి జాగ్రత్తగా చూసుకోవాలి.

4 Comments

  1. In todays world, everyones lives driven by social trend, status & competition. At some point, everyone falling in the trap and dividing from the roots of their growth & success. This story depicts the todays fact in the society. Thanks for sharing this story, this helps us to teach our children with the morals of life.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *