ఒకప్పుడు పక్క పక్క పొలాల్లోనే పనిచేసుకునే ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడ్డారు. 40 ఏళ్ల వారి వ్యవసాయ జీవితంలో ఇదే వారి మొదటి గొడవ. వారు ఎప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వ్యవసాయ అవసర నిమిత్తం, ఇద్దరు కలిసి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి ఆ యంత్ర సామాగ్రిని పంచుకుంటూ, శ్రమను మరియు వస్తువులను అన్నిటిని పంచుకుంటూ కలివిడిగా వ్యవసాయం చేసుకునేవారు.
ఇపుడు జరిగిన గొడవ కారణంగా …, సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వారి సహాయ సహకారాలు ఆగిపోయాయి. ఇది ఒక చిన్న అపార్థంతో ప్రారంభమై చాలా రోజుల తర్వాత .., అతి పెద్ద గొడవతో ఇద్దరు విడిపోవడం జరిగింది. చాలా మంది తెలిసిన వారు మరియు ఊరి పెద్దలు వాళ్ల గొడవను తగ్గించి ,వాళ్లని తిరిగి కలపడానికి ప్రయత్నించారు. కానీ, అవి ఏమి జరగలేదు.
ఒకరోజు ఉదయం వడ్రంగిపనిచేసేవాడు అన్నయ్య ఇంటి తలుపు తట్టాడు. అన్నయ్యతో.., “నేను కొన్ని రోజుల నుండి పని కోసం చూస్తున్నాను,” మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి, నేను చాలా బాగా పని చేస్తాను అన్నాడు. అది విన్న అన్నయ్య “నా దగ్గర నీకోసం పని ఉంది అన్నాడు.
నా పొలానికి మరియు నా తమ్ముడు పొలాన్ని కలుపుతూ ఒక వాగు ఉంది. ఆ నీటిని మేము అవసర నిమిత్త వాగు దారిని మలుచుకుని వాడుకుంటాము. అవసరం తీరక తిరిగి దాని దారిని మార్చుతాము. తద్వారా మేము ఇరువురము వాగు నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది.
కానీ.., గత వారం నాకు నా తమ్ముడికి పెద్ద గొడవ జరిగింది. అందుకారణంగా ఇపుడు మేము కలిసి లేము. నిన్న వాడు అవసరం కోసం వాగు దారి మార్చాడు. నేను నీటిని వాడటానికి వీలు లేకుండా అడ్డుకట్ట వేసి పక్కనే పెద్ద గుంతని తవ్వి వదిలేసాడు. నేను వాగు దారి మరల్చిన గుంత కారణంగా నీటి సరఫరా పొందలేకుండాను. వాడు ఈ పనిని కావాలనే చేసాడని నాకు అర్ధమవుతుంది.
నువ్వు ఏదైనా చేసి, ఆ గుంతని పూడ్చి వాగు నీరు నా పొలానికి కూడా వచ్చేలా చేయాలి. మా ఇద్దరి పొలాలకు మద్య ఏదైనా నిర్మించు.
నాకు వాడి మొహం కూడా చూడాలని లేదు. ఇక ఎప్పటికి చూడను కూడా అని చెప్పాడు..
వడ్రంగి “నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. మీకు నచ్చే పని నేను చేయగలను” అన్నాడు. అన్నయ్య వ్యవసాయ సామాగ్రి కోసం పట్టణానికి వెళ్లవలసి ఉంది, కాబట్టి అతను వడ్రంగి సామాగ్రిని పొలం దగ్గరికి తీసుకెళ్లడానికి సహాయం చేసి, సాయంకాలం వరకు తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ వడ్రంగి వెంటనే పనిచేయడం మొదలు పెట్టాడు. ముందుగా ఆ గుంతని పూడ్చేసాడు. తర్వాత.., ఎదో నిర్మించాలని… ఆలోచించి తన పనిని మొదలు పెట్టాడు.
అన్నయ్య తిరిగొచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యింది. అప్పటి వరకు వడ్రంగి పని అయిపోయింది. ఆ పనిని చూసిన అన్నయ్య కళ్లు
పెద్దగా తెరుచుకున్నాయి మరియు అతను కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది అతను అస్సలు ఊహించలేదు. ఆ వడ్రంగి నిర్మించిన వంతెన ఎంతో అందంగా ఇద్దరి పొలాలను కలుపుతూ ఉంది.. ఆ వంతెన కింద నుండి వాగు ప్రవహిస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఎంతగానో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంది.
అసలు అన్నయ్య, ఆ వడ్రంగికి ఎదో ఒక అడ్డు కట్ట వేసి తన తమ్ముడి మొహం కనబడకున్న చేయమన్నాడు. కానీ, ఆ వడ్రంగి దానికి వ్యతిరేకంగా ఇద్దరినీ కలపడానికి వంతెన నిర్మించాడు. ఆ వడ్రంగి యొక్క అంతరార్థం మరియు మంచితనం అర్ధం చేసుకున్న అన్నయ్య కళ్లు చెమర్చాయి. వెంటనే వంతెన దాటి తమ్ముడి దగ్గరికి వెళ్లాడు.. ఆనందంతో వస్తున్న అన్నయ్యని మరియు తనని కలవడానికి నిర్మించిన వంతెనని చూసిన తమ్ముడు చాలా సంతోషపడి అన్నయ్యని గట్టిగ హత్తుకున్నాడు.
“నువ్వు నిజంగా చాలా దయగలవాడివి మరియు వినయవంతుడివి అన్నయ్యా ! నీతో గొడవ పడ్డాను. అంతేకాకుండా, నిన్ను ఇంకా బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో నీకు నీటిని కూడా అందకుండా చేశాను. నువ్వు అవేమి పట్టించుకోకుండా.. నన్ను కలవాడికి వాగు దాటే పని లేకుండా వంతెన నిర్మించావు.
నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు అన్నయ్య. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను. మనం కలకాలం ఇలాగె కలిసి ఉండాలి అని ఏడుస్తూ విన్నవించుకున్నాడు. అదంతా విన్న అన్నయ్య, నిజానికి దీనికి ప్రతిఫలం దక్కాల్సింది నాకు కాదు, ఈ వడ్రంగికి. రక్తసంబంధాల విలువ తెలిసిన ఈ వడ్రంగి, తన ఆలోచనతో మనం మళ్లి కలిసేలా చేసాడు అని తమ్ముడితో చెప్పాడు అన్నయ్య. ఇద్దరు అన్నాతమ్ముళ్లు కలిసి ఆ వడ్రంగికి కృతజ్ఞత తెలిపారు.
అదంతా చూసి సంతోషపడిన వడ్రంగి, ఇక నేను బయలుదేరతాను అన్నాడు. అప్పుడు అన్నయ్య, ఎక్కడికి వెళ్తావు? నువ్వు మాతోనే ఉండిపో… నేను నీకు ఉద్యోగం ఇస్తాను అన్నాడు. దానికి బదులుగా ,ఆ వడ్రంగి.., నేను కలపవలసిన రక్తసంబంధాలు చాలా ఉన్నాయి అందుకోసం నేను చాలా వంతెనలని నిర్మించాలని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
Nice story,
Well explained about relationships 👏…
Thank You!
Nice message..,keep going Divya.This generation needs stories like this.
Thank You! keep reading and sharing.
Nice message 🥂
Thanks Shashi! Keep reading and sharing the stories.