నలుగురు స్నేహితులు మరియు వేటగాడు |The Four Friends And The Hunter
నలుగురు స్నేహితులు మరియు వేటగాడు |The Four Friends And The Hunter

చాలా కాలం క్రితం, ఒక అడవిలో ముగ్గురు స్నేహితులు నివసించేవారు. అవి-జింక, కాకి మరియు ఎలుక. వారు కలిసి ఉండేవారు మరియు  భోజనం కూడా కలిసి పంచుకుని తినేవారు. .

ఒక రోజు, ఒక తాబేలు వారి వద్దకు వచ్చి, “నేను కూడా మీతో  చేరి మీ స్నేహితుడిని కావాలనుకుంటున్నాను. నేను ఒంటరిగా ఉన్నాను.” అని చెప్పింది.

ముగ్గురు స్నేహితులు తాబేలు యొక్క స్నేహాన్ని అంగీకరించాయి. అందరు కలిసి “మీకు  స్వాగతం” అన్నాయి.  అందరు అన్నీ మాట్లాడుకుంటూ ఉండగా ,  కాకి “అయితే తాబేలు గారు మీ వ్యక్తిగత భద్రత గురించి చెప్పండి ?.  అని అడిగింది.  చుట్టూ చాలా మంది వేటగాళ్ళు ఉన్నారు. వారు ఈ అడవిని క్రమం తప్పకుండా సందర్శిస్తారు. ఒకవేళ వేటగాడు వస్తే , మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు?” చెప్పండి అని అంది.

“నేను మీ గుంపులో చేరడానికి కారణం అదే” నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను. దానికి కారణం నా నెమ్మదత్వం. అని తాబేలు అంది.

ఒకరోజు అందరు కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఒక వేటగాడు వారి దగ్గరికి వచ్చాడు. వేటగాడిని చూసి, జింక దూరంగా పరిగెత్తింది. కాకి ఆకాశంలో ఎగిరింది మరియు ఎలుక ఒక రంధ్రంలోకి పరిగెత్తింది. తాబేలు వేగంగా పరిగెత్తడానికి   ప్రయత్నించింది, కాని తాబేలుని  వేటగాడు పట్టుకున్నాడు. వేటగాడు దాన్ని  వలలో కట్టేసాడు.

వేటగాడు జింకను పట్టుకోలేనందుకు బాధపెట్టాడు. కానీ అతను జింక దొరకని కారణంగా  ఆకలితో ఉండడం కంటే తాబేలు తో  విందు చేసుకోవడం  మంచిది అని అనుకున్నాడు.

తాబేలు యొక్క ముగ్గురు స్నేహితులు, తాబేలు  వేటగాడి చేతిలో  చిక్కుకున్నది  చూసి చాలా బాధపడ్డాడు. తన స్నేహితుడిని వేటగాడు వల నుండి విడిపించేందుకు ప్రణాళికల  గురించి ఆలోచిస్తూ వారు కలిసి కూర్చున్నారు. అంతలోనే వాళ్లకి ఒక మంచి ఆలోచన వచ్చింది దానిని అమలు చేద్దామని అనుకున్నారు.

కాకి అప్పుడు ఆకాశంలో పైకి ఎగిరి, నది ఒడ్డున నడుస్తున్న వేటగాడిని గుర్తించింది. ప్రణాళిక ప్రకారం జింక వేటగాడు గుర్తించకుండా ముందుకు  వెళ్లి  చనిపోయినట్లుగా వేటగాడు వెళ్లే మార్గంలో పడుకుంది.

వేటగాడు నేలమీద పడుకున్న జింకను దూరం నుండి చూశాడు. అతను తప్పించుకున్న జింక మళ్లి కనబడినందుకు   చాలా సంతోషపడ్డాడు.. “ఇప్పుడు నేను దానిని చంపి  మంచి విందు చేసి మార్కెట్లో దాని అందమైన చర్మాన్ని అమ్ముతాను” అని వేటగాడు తనను తాను అనుకున్నాడు. అతను తాబేలును నేలమీద పెట్టి జింకను చంపడానికి  పరుగెత్తాడు.

ఈలోగా, అనుకున్నట్లుగా, ఎలుక వలని  తన పళ్లతో కట్ చేసి తాబేలుని తప్పించింది. తాబేలు వెంటనే పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళిపోయింది.

ఈ స్నేహితుల సలహాలు  తెలియక, వేటగాడు దాని రుచికరమైన మాంసం మరియు అందమైన చర్మం కోసం మనసులో ఆలోచించుకుంటూ  జింకని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ, అతను దగ్గరకు చేరుకునే సమయంలో, జింక అకస్మాత్తుగా  అడవిలోకి  దూసుకుపోయింది. అతను ఏం జరుగుతుందో  తెలుసుకునేలోపే  జింక అదృశ్యమైంది.

నిరాశతో, వేటగాడు అతను వలలో ఉంచి  నెల మీద పెట్టిన తాబేలును  తీసుకోవడానికి  వెనక్కి తిరిగాడు. కానీ అతను అక్కడ పెట్టిన  వల మరియు తాబేలు కనిపించకపోవడం  చూసి అతను షాక్ అయ్యాడు. ఒక క్షణం, వేటగాడు కలలు కంటున్నట్లు అనుకున్నాడు. వెంట వెంటనే జంతువులు మాయమవడం చూసి బయపడి అడవి నుండి పారిపోయాడు.

నలుగురు స్నేహితులు మరోసారి సంతోషంగా జీవించడం ప్రారంభించాయి.

నీతి |Moral : ఆపద సమయాల్లో తోడుండే స్నేహితుడు నిజమైన స్నేహితుడు

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *