ఒక రోజు రాత్రి నలుగురు కళాశాల విద్యార్థులు అర్థరాత్రి వరకు పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు చాలా ఇంపార్టెంట్ పరీక్ష ఉంది ఆ విషయం తెలిసి కూడా వారు అవసరం లేని పార్టీ లో తల్లితండ్రులకి అబద్ధం చెప్పి మరీ అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్నారు.
పరీక్ష కోసం అస్సలు చదవలేరు.. మరుసటి రోజు ఉదయం, వారు పరీక్షకి చదవలేని కారణంగా.. ఎలా తప్పించుకోవాలి అని ఒక ఉపాయం గురించి ఆలోచించారు. వారు గ్రీజు మరియు ధూళితో మురికిగా ఉన్న దుస్తులను ధరించి స్కూల్ కి వెళ్లారు.. అప్పుడు వారు డీన్ వద్దకు వెళ్లి, వారు గత రాత్రి ఒక వివాహానికి బయలుదేరారని, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వారి కారు టైర్ పేలిందని, వారు కారును వెనక్కి నెట్టవలసి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నేరుగా స్కూల్ కి వస్తున్నామని మరియు పరీక్ష కి ప్రిపేర్ అవలేదని చెప్పారు. కాబట్టి వారు పరీక్ష రాసే స్థితిలో లేరు అని డీన్ కి చెప్పారు. .
డీన్ ఒక నిమిషం ఆలోచించి, 3 రోజుల తర్వాత తిరిగి పరీక్ష చేయవచ్చని చెప్పారు. వారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, ఆ సమయానికి వారు సిద్ధంగా ఉంటారని చెప్పి వారు ఆలోచించిన ఉపాయం సక్సెస్ అయినందుకు సంతోషపడి ఇంటికి వెళ్లిపోయారు.. పరీక్ష కి బాగా ప్రిపేర్ అయి మూడవ రోజు స్కూల్ కి వెళ్లారు.
వారు డీన్ ముందు హాజరయ్యారు. ఇది స్పెషల్ కండిషన్ టెస్ట్ కావడంతో, నలుగురూ పరీక్ష కోసం ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోవాల్సిన అవసరం ఉందని డీన్ చెప్పారు. గత 3 రోజుల్లో బాగా సిద్ధం కావడంతో వారంతా అంగీకరించారు.
ఈ పరీక్షలో మొత్తం 100 మార్క్స్ తో 2 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి.
1) మీ పేరు __________ (1 మార్క్ )
2) ఏ టైర్ పేలింది? __________ (99 మార్క్స్ )
ఆప్షన్స్ – (ఎ) ముందు ఎడమ (బి) ముందు కుడి (సి) వెనుక ఎడమ (డి) వెనుక కుడి