ఒక అడవిలో నక్క మరియు కొంగ స్నేహంగా ఉండేవి. కొంగ ఎంత నిస్వార్థంగా ఉన్న నక్క ఎప్పుడు తన స్వార్థాన్ని చూపించేది. ఒకసారి నక్క, కొంగని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. తన ఆహ్వానాన్ని స్వీకరించి కొంగ ఒకరోజు నక్క ఇంటికి వెళ్ళింది.
చాలా దూరం నుండి ప్రయాణం చేసిన కారణంగా కొంగ చాలా అలసి పోయింది మరియు తనకి దాహంగా, ఆకలిగా కూడా ఉంది. నక్క కొంగని డిన్నర్ టేబుల్ దగ్గరికి భోజనానికి తీసుకెళ్లింది. ఎంతో ఆతురతతో వెళ్లిన కొంగకి చేదు అనుభవం ఎదురైంది. నక్క తన అతి తెలివితో సూప్ ని సమానమైన ఒక ప్లేట్లో వడ్డించింది. కొంగ ముక్కు పొడవుగా ఉన్నందున సమానమైన ప్లేట్లో సూప్ ని తాగడానికి చాలా ప్రయత్నించి కానీ తాగలేకపోయింది. నక్క మాత్రం సూప్ అంత తాగేసింది. కొంగ తనకు వచ్చిన కోపాన్ని పైకి చూపించకుండా నక్కకి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంది.
మరుసటి రోజు కొంగ నక్కని భోజనానికి తన ఇంటికి ఆహ్వానించింది. కొంగ తన తెలివితో నక్కకి బుద్ధి చెప్పాలని సూప్ని పొడవాటి సన్నగా ఉన్న కూజాలో ఇచ్చింది. ఎంతో ఆకలిగా ఉన్న నక్క కూజలో తన తల పెట్టి సూప్ని తాగలేకపోయింది. ఈ సారి కొంగ సూప్ని తాగేసింది నక్క పరిస్థితిని చూసి నవ్వుకుంది. నక్క తన తప్పును గ్రహించి ఆకలితో ఇంటికి వెళ్ళింది.
నీతి | Moral : మనం స్వార్థంగా ఆలోచించి ఎవరికైన చెడు చేయాలనీ చూస్తే, తిరిగి తప్పకుండ మనకి చెడు జరుగుతది.