
ఒక చిన్న పట్టణంలో ఒకవ్యక్తి తన ఫామిలీతో పాటు నివసించేవాడు. అతనికి చాలా అత్యాశ. అతను చాలా ధనవంతుడు, అతను బంగారాన్ని మరియు ఖరీదైన వస్తువులను ఎక్కువగా ఇష్టపడేవాడు.
అతనికి ఒక కూతురు ఉండేది. తన కూతురంటే అతనికి చాలా ఇష్టము. తనని చూడకుండా మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండేవాడు కాదు.
ఒకరోజు అతను ఒక అడవికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక అద్భుతాన్ని చూసాడు. ఒక దేవకన్య పొదలలో చిక్కుకొని ఉంది వెంటనే ఇతను వెళ్లి ఆమెని రక్షించాడు. దానికి ప్రతిఫలంగా ఆ దేవకన్య అతనిని ఏదైనా వరం కోరుకోమంది. అత్యాశ కలిగిన ఈ వ్యక్తి బాగా ఆలోచించి “నేను తాకినవన్ని వెంటనే బంగారంగా మారాలని” కోరుకున్నాడు.
దేవకన్య వరాన్ని ఇచ్చి మాయమైంది. ఇంటికి తిరిగి వచ్చిన ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఈ విషయాన్ని భార్యకు మరియు కూతురికి చెప్పాడు. ఇక నుండి మనము ఏమి సంపాదించాల్సిన పనిలేదు నేను ఏమి ముట్టుకున్నా అది బంగారంగా మారుతుంది అని ఇంట్లో కొన్ని వస్తువులను ముట్టుకున్నాడు. వెంటనే ఆ వస్తువులన్నీ బంగారంగా మారోపోయాయి.
ఆ సంతోషంలో ఆ వ్యక్తి తన కూతురిని పట్టుకున్నాడు తన కూతురు కూడా బంగారపు బొమ్మగా మారిపోయింది. అది చూసి షాక్ అయినా ఆవ్యక్తి ఎంత ప్రయత్నించినా తన కూతురు మామూలుగా మారలేదు . తాను ఎంతో ప్రేమించే తన కూతురు ఇలా అయ్యిందని తాను చాలా ఏడ్చాడు.
తన తప్పుని మరియు తన అత్యాశను తెలుసుకున్నాడు. తిరిగి ఆ దేవకన్యను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. తనకు ఇచ్చిన ఆ వరాన్ని తిరిగి ఇచ్చేయడానికి.
నీతి | Moral : అత్యాశ మరియు దురాశ ఎల్లప్పుడూ పతనానికి దారి తీస్తుంది.