ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కుందేలు మరియు తాబేలు కూడా ఉండేవి. కుందేలు ఎప్పుడు తాబేలుని ఎగతాళి చేసేది పరిగెత్తడం తనకు రాదనీ నన్ను ఎప్పటికి నువ్వు ఓడించలేవని అంటూ ఉండేది అంతేకాకుండా ఎప్పుడు తనకు తాను వేగంగా పరిగెత్తడం గురించి పొగుడుకుంటూ ఉండేది.
అదంతా గమనించిన తాబేలు ఒకరోజు కుందేలుతో పందెం కాసింది. తనతో పాటు పరిగెత్తి గెలవమని చెప్పింది అది విని నవ్విన “కుందేలు ఎలాగూ నేనే గెలుస్తాను పరిగెత్తడం చేతకాని నువ్వు ఎలా పందెం కాస్తున్నావ్ “అని నవ్వింది. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి ఏమి జరగబోతోంది అని.!
కుందేలు మరియు తాబేలు తమ పందేన్ని ప్రారంభించాయి. కాసేపటి తరువాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది తాబేలు అసలు కనబడలేదు. తాబేలు రావడానికి ఎలాగూ సమయం పడుతుందని అనుకొని పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో పడుకుంది.
“తాబేలు తన నడకని ఆపకుండా వెనక్కి చూడకుండా చాలా ఫాస్ట్ గా నడుస్తూనే ఉంది చివరికి ఆఖరి లైన్ కూడా క్రాస్ అయిపోయింది. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ తాబేలు విజయాన్ని చూసి గట్టిగ అరవసాగాయి”.
ఆ అరుపులతో కుందేలు లేచి పరిగెత్తడం ప్రారంభించింది “కానీ ఆలస్యమైంది తాబేలు పందెంలో గెలిచింది”.
నీతి | Moral : “నిదానమే ప్రదానం.”
Very nice story
Thank You! keep reading and sharing.