దాయబడిన నిధి | The Hidden Treasure
దాయబడిన నిధి | The Hidden Treasure

చాలా కాలం క్రితం, ఒక  పేద జంట నివసించేవారు.. వారు నివసించడానికి ఒక చిన్న గుడిసె మరియు సాగు చేసుకోవడానికి  కొంచెం భూమి మాత్రమే ఉంది.  అక్కడ వారు వ్యవసాయం చేసి, వారు పండించిన పంటల ద్వారా జీవనం సాగించేవారు..

కానీ ఒక రోజు, భర్త అనారోగ్యానికి గురయ్యాడు. అందుకోసం ఆ మహిళ ఒంటరిగా పనికి వెళ్ళింది.

ఆమె పొలాల్లోకి వెళ్లి కలుపు మొక్కలను తొలగించడం ప్రారంభించింది. అకస్మాత్తుగా, కలుపు మొక్కల మధ్య పడి ఉన్న  ఒక బంగారు నాణాన్ని ఆమె చూసింది. బంగారు నాణాన్ని చూసి సంతోషించిన ఆమె, వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకుని , ఆమె ధరించిన పొడవాటి ఓణీకి  ఒక మూలలో  కట్టింది.

కొద్దిసేపటి తరువాత, ఆమె కొంచెం దూరంలో పడి ఉన్న మెరిసే ఎర్రటి మాణిక్యాన్ని చూసింది అప్పుడు  ఆమె ఆశ్చర్యపోయి దాన్ని తీసుకుని చాలా  ఆనందపడింది. దాని  తరువాత,క్రమంగా ఒక వజ్రం మరియు చాలా విలువైన రాళ్లు దొరికాయి.  ఆమె బంగారు నాణెం తో కొంచెం బియ్యం కొని ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె తనకు దొరికిన విలువైన మణుల గురించి  భర్తకు చెప్పలేదు.

ఆమె ఆ విషయం గురించి ఇలా ఆలోచించింది ” ఒక్కరోజు ఒంటరిగా పనికి వెళ్లినందున ఇన్ని విలువైన మణులు దొరికాయి అని  అతను అసూయపడితే?” అందుకే ఆ విషయం అతనికి చెప్పకూడదు అనుకుంది.

అందువల్ల ఆమె తన భర్తకి అనుమానం రాకుండా  మౌనంగా ఉండి యథావిధిగా తిరిగి పనికి వెళ్లింది.

మరుసటి రోజు  ఆమెకు వెండి నాణెం దొరికింది. ఆమె దానిని తన చేతుల్లో పట్టుకుని చూస్తుండగా, ఆకాశం నుండి ఆమెకి  ఒక స్వరం  వినబడింది ఇదంతా “మీ అదృష్టం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి, మీ భర్తకి  కూడా చెప్పకండి” మీరు ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటారో అంత విలువైన మణులు మాణిక్యాలు మీకు దొరుకుతాయి అని “

అందువల్ల ఆమె ప్రతీరోజు ఒంటరిగా  పొలంలోకి వెళ్లడం ప్రారంభించింది .  ప్రతిరోజూ, ఆమెకు ఏదో ఒక విలువైన వస్తువు దొరుకుతూనే ఉంది.   కొన్ని రోజులలో రెండు వెండి నాణేలు, మరొక రోజున మూడు బంగారు నాణేలు, మరొకటి వజ్రం మరియు మొదలైనవి దొరికాయి . ఆమె తన సంపద అంతా తన భర్తకు కూడా అందుబాటులో లేని సురక్షితమైన ప్రదేశంలో దాచిపెట్టింది.

అలా  ఆమె ఏడవ రోజు పొలానికి వెళ్లినప్పుడు ఆమెకు ఏమీ దొరకలేదు. ఆమె రోజంతా పని చేస్తూ, అలాగే  ప్రతి చోటు క్షుణ్ణంగా వెతుక్కుంటూ ఉంది.  కానీ, ఆమెకు ఏ  విలువైన వస్తువు దొరకలేదు.

మధ్యాహ్నం, ఆమె చాలా  అలసిపోయినందున,  ఆకలిగా అన్పించింది, తనతో పాటు తెచ్చుకున్న  బియ్యాన్ని ఉడకబెట్టడానికి పొలం అంచు దగ్గర కూర్చుంది. ఆమె కొన్ని కట్టెలు వెలిగించింది. అంతలోనే ఆకాశం నుండి మళ్లి స్వరం వినబడింది.  

“మీరు మీ బియ్యం ఉడకబెట్టిన తర్వాత, మంటలను ఆర్పి,” ఆ ప్రదేశాన్ని తవ్వండి మీకు చాలా విలువైన వస్తువులు దొరుకుతాయి .  మీరు కనుగొన్న దాని గురించి ఎవరికీ మరియు  మీ భర్తకు కూడా చెప్పకండి.”

స్వరం  చెప్పినట్లు ఆమె చేసింది కొద్దిగా తవ్వగానే  ఆమె బంగారు ముక్కలతో  నిండిన పెద్ద  కూజాను చూసింది . తను అంత విలువైన బంగారాన్ని చూడగానే భయంతో తన చేతులు వణకసాగాయి.  ఆ మహిళ తొందరపడి రెండు బంగారు ముక్కలను బయటకు తీసి మిగిలిన వాటిని మునుపటిలా పాతిపెట్టింది. ఎవరు ఇదంతా చూడకముందే  వేగంగా ఇంటికి పరిగెత్తింది.

మధ్యాహ్నం సమయంలో భార్య ఇంటికి రావడం చూసిన భర్త  ఆశ్చర్యపోయాడు మరియు ఆమెతో అంతా బాగానే ఉందా..? అని అడిగాడు.

ఆమె  ఇక తన సంతోషాన్ని ఆపుకోలేక,  తనకు లభించిన సంపద గురించి ఆమె తన భర్తకు అన్నీ చెప్పింది. దాని గురించి విన్న భర్త  చాలా సంతోషించాడు. తనను తాను నిగ్రహించుకోలేక, ఆ వ్యక్తి గ్రామంలోకి వెళ్లి గ్రామ  ప్రతినిధికి  చెప్పాడు.

కొద్ది క్షణాల్లో, ఉత్సాహంగా ఉన్న గ్రామస్తులు నిధిని తవ్వటానికి నిధి ఉన్న  భూమి  దగ్గరికి పరుగెత్తారు. వారు ఎంత లోపలి తవ్విన గాని ఎలాంటి నిధి కనబడలేదు. ఏ బంగారు నాణెం యొక్క చిహ్నం మరియు  రాళ్లు కూడా కనబడలేవు. .

గ్రామస్తులంతా కలిసి “సంపద ఎక్కడ ఉంది? ఈ  వేసవి వేడిలో మీరు మీ తలలను పోగొట్టుకున్నారా..  !?” అందరూ ఆ పేద  దంపతులను చూసి హేళనగా నవ్వారు.

“లేదు. నేను వాటిని చూశాను మరియు నా దగ్గర కొన్ని విలువైన రాళ్లు  కూడా  ఉన్నాయి .”అని ఆమె అరిచింది.

దంపతులు తాము నిజమే చెప్తున్నామని నిరూపించుకోవడానికి తన దగ్గర ఉన్న  రత్నాలను చూపించడానికి ప్రయత్నించింది. , ఆమె వాటిని ఎక్కడ అయితే దాచి ఉంచిందో అక్కడ  ఆమెకు  అవి కనబడలేవు.. ఆమె తన రహస్య ప్రదేశంలో దాచిపెట్టినవన్నీ కూడా మాయమయ్యాయి. మళ్ళీ ఆ దంపతులు పేదవారయ్యారు.

స్వర ఆజ్ఞను పాటించకపోవడం  వల్ల తనకు దొరికినదంతా పోగొట్టుకుంది. 

నీతి |Moral : “మన మంచికోరే వారు మనకెప్పుడు మంచే చెప్తారు కావున వారి మాటలను పెడ చెవిన పెట్టకుండా సక్రమంగా  పాటిస్తే మనకు తప్పకుండ మంచి జరుగుతుంది”.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *