దారం లేని గాలిపటం | The Kite Without A Thread

దారం లేని గాలిపటం | The Kite Without A Thread
దారం లేని గాలిపటం | The Kite Without A Thread

ఒకసారి ఒక తండ్రి మరియు కొడుకు గాలిపటాలు ఎగురవేసే పండుగకు వెళ్లారు. రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం చూసి కొడుకు చాలా సంతోషించాడు. అతను కూడా తన తండ్రికి ఒక రంగుల  గాలిపటం మరియు రోలర్తో ఉన్న ఒక దారం కావాలని అడిగాడు. ఆవిధంగా తాను కూడా రంగుల గాలిపటం ఆకాశంలో ఎగురవేయొచ్చని ఆశ. వెంటనే తండ్రి పండుగ జరుగుతున్న పార్కులొ ఉన్న దుకాణానికి వెళ్లాడు. అతను తన కొడుకు కోసం ఒక మంచి  గాలిపటం  మరియు ఒక దారం కొన్నాడు.

అతని కొడుకు గాలిపటం ఎగరవేయడం ప్రారంభించాడు. వెంటనే, అతని గాలిపటం ఆకాశంలో చాలా  ఎత్తుకు చేరుకుంది. కొంతసమయం  తర్వాత, కొడుకు ఇలా అన్నాడు, “డాడీ , దారం అయిపోవడం వలన ఇంకా  ఎత్తులో ఎగరాల్సిన  గాలిపటం అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తుంది, మనము  దారాన్ని  కత్తిరిస్తే  గాలిపటం  మరింత ఎత్తులో ఎగురుతుంది.  మనము  దారాన్ని  కత్తిరిద్దామా ? ”  అది విన్న , తండ్రి నవ్వుకుని  రోలర్ నుండి దారాన్ని కత్తిరించాడు. గాలిపటం కొంచెం ఎత్తుకు వెళ్లడం  ప్రారంభించింది. అది ఆ చిన్న పిల్లవాడిని  చాలా సంతోషపరిచింది.

కానీ, నెమ్మదిగా, గాలిపటం క్రిందికి రావడం ప్రారంభించింది. మరియు, వెంటనే అది తెలియని భవనం  మీద పడిపోయింది. ఇది చూసిన  కొడుకు ఆశ్చర్యపోయాడు. అతను గాలిపటాన్ని  దాని దారం నుండి కత్తిరించాడు, తద్వారా అది ఎత్తుకు ఎగురుతుంది, కానీ బదులుగా, అది  కింద పడిపోయింది. అతను తన తండ్రిని అడిగాడు, “డాడీ , దారం  కత్తిరించిన తరువాత, గాలిపటం స్వేచ్ఛగా పైకి ఎగరగలదని నేను అనుకున్నాను. కానీ, అది ఎందుకు కింద పడిపోయింది? ”

తండ్రి ఇలా వివరించాడు, “బాబు , చాలామంది తమ జీవితంలో ఉన్నత (పైన స్థాయిలోకి)  స్థాయిలోకి వెళ్లాలని ఆశిస్తుంటారు. కానీ,  మనం కొన్ని విషయాలతో ముడిపడి ఉన్నామని, అవి మనల్ని మరింత ఎత్తుకు వెళ్లకుండా చేస్తున్నాయని   అనుకుంటారు .దారం గాలిపటాన్ని  పైకి వెళ్లకుండా ఆపదు.  కానీ, గాలి తక్కువగా ఉన్నపుడు  కూడా కింద పడకుండా ఉండడానికి సహాయపడుతుంది, దారం  ద్వారా సరైన దిశలో గాలిపటం పైకి వెళ్లడానికి  సాయం అవుతుంది.  ఇపుడు మనం దారాన్ని  కత్తిరించినప్పుడు, దారం  ద్వారా గాలిపటానికి మనం  అందిస్తున్న సాయం  లేకుండా అది పడిపోయింది ”.

ఇది విన్న కొడుకు తన తప్పుని  గ్రహించాడు.

నీతి | Moral : మన కుటుంబంతో, మన ఇంటితో ముడిపడి ఉండకపోతే మనం త్వరగా ఉన్నత స్థాయిలోకి  మరియు మన జీవితంలో కొత్త ఎత్తులకు చేరుకోవచ్చని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. కానీ, మన కుటుంబం, మన ప్రియమైనవారు వారి సహాయంతో మన జీవితంలో కఠినమైన సమయాన్ని తట్టుకుని, మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు ప్రోత్సహిస్తున్నారని మనము గ్రహించలేకపోతున్నాము. వారు మనల్ని పట్టుకోవడం(ఆపడం) లేదు, వారు మనకు  మద్దతు ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *