ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది, సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి బయపడేవి. సింహం దగ్గరికి ఏ జంతువు కూడా వెళ్ళేది కాదు. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్ర పోతుంది అది చూసుకోకుండా ఒక ఎలుక అక్కడే ఆడుకుంటుంది. ఆ శబ్దానికి లేచిన సింహం ఎలుకను గర్జించి, దాడి చేసి చంపబోయింది.
అప్పుడు ఎలుక నన్ను క్షమించు, నన్ను చంపొద్దు, ఇప్పుడు నన్ను వదిలి పెడితే ఎప్పటికైనా నీకు సహాయం చేస్తా అని చెప్పింది. దానికి నవ్విన సింహం ఇంత చిన్న ప్రాణివి నువ్వు నాకు సహాయమ చేస్తావా!? ఇపుడు నా దగ్గరి నుండి తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు అంది. అప్పటి వరకు ఏ జంతువు కూడా సింహంతో మాట్లాడే సాహసం చేయలేదు. కానీ,ఈ చిన్ని ఎలుక సింహ తో మాట్లాడిన ధైర్యాన్ని చూసి జాలిపడి విడిచిపెట్టింది.
ఒకరోజు కొంతమంది వేటగాళ్లు అడవిలో జంతువులని వేటాడారు. అప్పుడు వారి వలలో సింహం చిక్కింది. వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని సింహం అరవడం ప్రారంభించింది. ఆ శబ్దం విన్న ఎలుక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వచ్చి ఆ వల ని మొత్తం కొరికేసి సింహాన్ని వేటగాళ్ల బారి నుండి కాపాడింది.
ఎలుక సహాయంతో ప్రాణాలని దక్కించుకున్న” సింహం మనసులో పశ్చాత్తాప పడింది”. “చిన్న ప్రాణి అయినందున చిన్న చూపు చూసాను”. ఆ రోజు గనక నేను ఈ ఎలుకని చంపి ఉంటె ఈ రోజు నన్ను ఇలా కాపాడకపోయేది అని అనుకుంది.
నీతి |Moral : మనం చేసే చిన్న సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది.
One Comment