ఒకానొక సమయంలో పెద్ద భూకంపం రావడంతో చాలా గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. చాలా మంది ఇళ్లు కూలిపోవడంతో అందులో ఇరుక్కుపోయి చనిపోయారు. ఇక మిగతా ఎవరైతే కొన్ని గాయాలతో బయట పడ్డారో వారంతా ఆ గ్రామాలు వదిలిపెట్టి సమీప గ్రామానికి వెళ్లిపోయారు.
పూర్తిగా నివాసితులు లేని స్థలాన్ని చూసిన ఎలుకలు శిధిలమైన ఇళ్లలో నివసించడం ప్రారంభించాయి. వారి సంఖ్య వేల మరియు లక్షలకు పెరిగింది. శిధిలమైన గ్రామానికి సమీపంలో ఒక పెద్ద సరస్సు కూడా ఉంది. ప్రతీరోజు ఒక పెద్ద ఏనుగుల మంద తాగునీటి కోసం సరస్సుకు వచ్చేవి.
ఆ ఏనుగుల మందకు సరస్సుకు వెళ్లడానికి ఆ గ్రామ శిధిలాల గుండా సరస్సు చేరుకోవడం తప్ప వేరే మార్గం లేదు. వెళ్ళేటప్పుడు, ఏనుగులు రోజూ వందల ఎలుకలను తమ భారీ కాళ్ల క్రింద తొక్కేస్తాయి. ఇది ఎలుకలకి చాలా బాధ కలిగించింది. వారిలో చాలామంది మరణించగా, వారిలో పెద్ద సంఖ్యలో అంగవైకల్యంగా మారాయి.
ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం ఆలోచించాలని ఎలుకలందరికి రాజు అయినా ఎలుకను మిగతా ఎలుకలు కోరాయి. ఎలుకల రాజు ఏనుగుల యొక్క రాజును కలిసి మాట్లాడింది. ఇలా ” మేము ఈ సరస్సు పక్కన ఉన్న శిథిలమైన గ్రామంలో నివసిస్తున్నాము. రోజు మీరు సరస్సును చేరుకోవడానికి ఈ మార్గం గుండా వెళ్తున్నారు. ఆ సమయంలో మీ రాకను కనుగొనలేక చాలా ఎలుకలు మీ కాళ్ల కింద పడి మరణిస్తున్నాయి. మీరు మీ మార్గాన్ని మార్చుకుంటే మేమంతా బ్రతుకుతాము అని చెప్పింది.
అది విన్న ఏనుగుల రాజు కానీ మాకు ఈ మార్గం తప్ప ఇంకా ఏ మార్గం లేదు అని చెప్పింది. కాసేపు అయ్యాక ఎలుకల రాజు ఏనుగుల రాజు తో, ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను అంది. ” మీరు వచ్చేప్పుడు ఒకసారి గట్టిగా ఘీంకరించండి అపుడు మేమంతా మీకు దారి ఇస్తాము అలా చేస్తే మాకు ప్రాణహాని తప్పుతుంది మరియు మీరు సరస్సుకు వెళ్లి దాహం తీర్చుకోవచ్చు అని చెప్పింది.
అందుకు ఏనుగు సంతోషించి ఒప్పుకుంది. ఎలుక సంతోషంతో ఏనుగుతో ” మాకు ఇంత సహాయం చేసినందుకు మీరు ఎప్పుడైన ఆపద సమయంలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలవండి మావల్ల అయితే మేము తప్పకుండా చేస్తాము అని చెప్పింది. ఎలుకల రాజు ఏనుగు రాజుకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడు.
కొంతకాలం తర్వాత, సమీప రాజ్యంలోని రాజు తన సైన్యంలో ఏనుగుల సంఖ్యను పెంచాలని అనుకున్నాడు. ఇందుకోసం ఎక్కువ ఏనుగులను పట్టుకోవాలని ఆయన తన సైనికులను ఆదేశించారు. సైనికులు బలమైన పెద్ద ఏనుగుల మందను చూసి వాటి మీదకి వల విసిరారు. దట్టమైన వల నుండి తప్పించుకోవడం ఏనుగుల వల్ల కాలేదు.
అపుడు ఏనుగుల రాజుకి ఎలుక ఇచ్చిన వాగ్దానం గురించి గుర్తొచ్చి, ఎలుకలకు వినిపించేలా గట్టిగ ఘీంకరించాడు. అది విన్న ఎలుకలు అన్ని కలిసి ఏనుగులకు సహాయం చేయడానికి వచ్చాయి. ఎలుకలన్నీ కలిసి సైనికుల మీదకి దాడి చేసి, కొన్ని ఎలుకలు వలను కొరికేసి ఏనుగులను తప్పించాయి.
ఎలుకలు చేసిన సహాయానికి ఏనుగులు కృతజ్ఞత తెలుపుకున్నాడు , వారిరువురు స్నేహాన్ని బలపరుచుకున్నాయి.
One Comment