ఒకానొక సమయంలో ఒక పాలవ్యాపారి ఉండేది తన పేరు దేవి. దేవికి ఒక స్నేహితురాలు ఉండేది తన పేరు రమ. చూడటానికి ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు కానీ మనస్సులో ఎప్పుడు ఒకరి పైన ఒకరు ఈర్ష్యగ ఫీలయ్యేవారు. దేవి రోజు పాలు అమ్మడానికి నగరానికి వెళ్ళేది.
ఒకరోజు దేవి పాలడబ్బాను తలపైన పెట్టుకుని వెళ్తున్న సమయంలో తనకు తాను కళలు కనడం ప్రారంభించింది. నేను రోజు పాలు అమ్మి డబ్బు సంపాదించి మరికొన్ని ఆవులను కొంటాను అపుడు ఇంకా బాగా పాలు వస్తాయి వాటిని అమ్మడం వాళ్ళ ఇంకా బాగా డబ్బులు సంపాదించొచ్చు.
అలా సంపాదించిన డబ్బుతో మంచి గౌను మరియు ఒక హాట్ కొనుక్కుంటాను ఎలాంటిది అయితే రమ దగ్గర లేదో అలాంటిది .
అది వేస్కొని మార్కెట్కి వెళ్తే కుర్రకారు అందరు నన్ను నా అందాన్ని చూస్తారు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు అది చూస్తున్న రమ అసూయ పడుతది అది నేను పట్టించుకోనట్టుగా నా తలని తిప్పుకుంటాను అని గట్టిగ తలని తిప్పింది అంతటితో తన తలపైన ఉన్న పాల డబ్బా కాస్త కింద పడి పాలన్నీ కిందపడ్డాయి.
అది చూసి దేవి తాను ఇప్పటి వరకు పగటి కల కనడం వళ్ళ తన దగ్గర ఉన్న పాలన్ని నష్టపోయానని బాధపడింది.
నీతి | Moral : పగటి కళలు కనడం మానెయ్యండి , దానితో మనకి నష్టమే కానీ లాభం లేదు. నిజంలో బ్రతకండి.