The Proud Rose
The Proud Rose

ఒకప్పుడు ఒక తోటలో అందమైన గులాబీ మొక్క ఉండేది. దానికి “తన అందాన్ని చూసుకొని చాలా పొగరు ఉండేది”. దాని పక్కనే ఉన్న కాక్టస్ మొక్కని చూసి ఎప్పుడు అసహ్యంగా ఫీలయ్యేది. ఇంత అందంగా  ఉన్న నేను నీ  పక్కన పెరగాల్సి వస్తుంది అని ఎప్పుడు తిడుతూ ఉండేది. కానీ” కాక్టస్ మొక్క ఏమి అనకుండా నిశ్శబ్దంగా ఉండేది”.

ఒకరోజు గులాబీ మొక్క యొక్క వాదన కాక్టస్ పైన మితిమీరింది.  కాక్టస్ ని తన అసహ్యమైన  రూపాన్ని చూస్తూ చాలా తిట్టసాగింది. ఇవన్నీ వింటున్న తోటలోని మిగతా మొక్కలన్నీ గులాబీని అడ్డుకున్నాయి. కానీ, అందంగా ఉన్న గులాబీ మొక్క ఎవరి మాట కూడా వినడానికి సిద్ధంగా లేదు.

వేసవికాలంలో తోటలోని బావి ఎండిపోయింది. తోటలోని మొక్కలకి నీరు పోయడానికి ఎవరు లేరు. ఒక్కొక్కటిగా మొక్కలన్నీ ఎండిపోవడం మొదలయ్యింది.  గులాబీ మొక్క కూడా నీరసించి పోయింది. కాక్టస్ మాత్రం ఎలాంటి నష్టం లేకుండా చాలా  బాగుంది. 

ఒకరోజు ఒక పిచ్చుక కాక్టస్ మొక్కకి తన ముక్కు ద్వారా రంద్రం చేసి నీటిని తాగడం గులాబీ మొక్క చూసింది.” కాక్టస్ మొక్క తనలో ఎప్పుడు నీటిని కలిగి ఉంటదని ” అర్థమైంది. ఎంతో దాహంతో ఉన్న గులాబీ మొక్క నీటి సహాయం కోసం కాక్టస్ ని అడగడానికి చాలా సిగ్గుపడింది.  ఎందుకంటే, ఎప్పుడు కూడా” గులాబీ, కాక్టస్ ని ఒక మొక్కగా చూడలేదు”.

కానీ గులాబీ అవసరాన్ని గ్రహించిన “కాక్టస్ తన నుండి కొంత నీటిని గులాబీకి ఇచ్చింది”. “గులాబీ తన తప్పుని తెలుసుకొని అప్పటి నుండి కాక్టస్ తో స్నేహం చేసింది”. చివరివరకు వారు మంచి స్నేహితులుగా ఉన్నారు.

నీతి | Moral : “ఎప్పుడు ఎవరిని కూడా ద్వేషించకూడదు, ఎవరి గొప్ప వారిదే…. వారికున్న గుణం మనకి ఉండకపోవచ్చు. మనకున్న గుణం వారికి ఉండకపోవచ్చు”.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *