ఒక దట్టమైన అడవిలో ఒక ప్రసిద్ధ ఋషి నివసించేవాడు. ప్రతీరోజు అతని ఆధ్యాత్మిక బోధనలను వినడానికి అడవి జంతువులాన్ని అతని దగ్గరికి వచ్చేవి. జంతువులన్నీ ధ్యానం చేసే ఋషి దగ్గరకు వచ్చి భావధానాలు వినడానికి గుమికూడేవి. ఋషి వాటికి మంచి విషయాలను చెబుతూ ఉండేవాడు.
అదే అడవిలో ఒక చిన్న ఎలుక కూడా జంతువులతో పాటు ఎలుక కూడా ప్రతీ రోజు బోధనల కోసం ఋషి దగ్గరికి వచ్చేది. ఒక రోజు ఎలుక చెర్రీ పండ్ల తోటలోకి వెళ్లి చేరిలని దొంగిలించి అది చూసిన అదే అడవిలో నివసించే పెద్ద పిల్లి ఒకటి ఎలుకని వెంబడించింది.
ఎలుక భయంతో ఋషి దగ్గరికి పరుగు తీసింది. ఎలుక మరియు పిల్లి ఇద్దరు ఋషి ముందు నిలబడ్డారు. ఎలుక భయంతో వణికిపోవడం చుసిన ఋషి ఎలుకపైజాలిపడి తనకున్న తపో బలంతో ఎలుకని పిల్లిలా మార్చాడు. ఎలుక ఎంతో సంతోషంతో అడవిలో ధైర్యంగా తిరగడం ప్రారంభించింది.
ఎలుక అన్ని పిల్లుల తో గొడవపడుతూ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. గట్టి గట్టిగా అరుస్తూ మిగతా పిల్లులన్నింటిని భయపెట్టింది.
కొన్ని రోజుల తర్వాత.., నిర్లక్ష్యంగా ఉన్న ఎలుక పైన ఒక నక్క దాడికి వచ్చింది అది చూసిన ఎలుక ఎలాగోలా తన ప్రాణాలను కాపాడుకొని మళ్లి ఋషి దగ్గరికి వెళ్ళింది ఎలుక. జరిగినదంతా వివరించిన తర్వాత ఋషికి ఎలుక పైన మళ్లి జాలితో ఎలుకను నక్కలాగా మార్చాడు.
ఈ సారి ఎలుక నక్కలాగా మరింత బలంగా మారి అడవిలో విచ్చలవిడిగా ఉంటూ మిగతా చిన్న జంతువులని ఇష్టం వచ్చినట్టు చంపుకుంటూ తిరగసాగింది. తాను ఇక ఎవరికి లేదు అనుకుంటూ చాలా నిర్లక్ష్యంగా ఉంటు నచ్చిన జంతువును చంపుకుంటూ జాలిగా ఉన్న సమయంలో అనుకోకుండా ఒక సింహం ఎలుకపైనా దాడికి వచ్చింది. మళ్లి ఎలుక తన ప్రాణాలని కాపాడుకుంటూ మళ్లి ఋషి దగ్గరికి పరిగెత్తి తన సమస్యను వివరించింది.
మళ్లి జాలిపడిన ఋషి ఎలుకను సింహం లాగా మార్చాడు. ఇలా ఎలుక అడవిలో తిరుగులేని జంతువుల మారింది. అడవికి రాజుగా మారి ప్రతీ ఒక్క జంతువును భయపెడుతూ జీవించసాగింది.
సింహం గ మారిన ఎలుక ఏ జంతువుకు భయపడకుండా తనను చంపే జంతువే లేదని పొగరుతో మరియు ఎక్కువ రోజులు జీవిస్తూ ఈ అడవికి రాజుల ఉండొచ్చని ఎంతో ఆనందంగా రోజులు గడుపుతుంది.
కొన్ని రోజుల తరువాత సింహానికి ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ ఋషికి ఎప్పుడైనా నా మీద కోపం వచ్చి తనను తిరిగి మార్చేస్తే తన పరిస్థితి మళ్లి భయంగా మరియు ఎలుకలా బ్రతకాల్సి వస్తది ఆలా అయితే నా పరిస్థితి ఏంటి.. ఇదంతా జరగక ముందే ఋషిని చంపేస్తే అయిపోతుంది కదా అని ఋషి దగ్గరికి వెళ్ళింది.
సింహం ఋషి తో, మీరు నా మీద ఎంతో జాలితో ఎలుకలా ఉన్న నన్ను సింహంలా మార్చారు. నేను కోరుకొని కోరికలు కూడా తీర్చారు. కానీ మీకు ఎప్పుడైనా న మీద కోపమొచ్చి తిరిగి ఎలుకల మారుస్తారేమో ఆలా జరగకుండా ఉండాలంటే నేను మిమ్మల్ని చంపేస్తా అని ఒక్క సారిగా ఋషి పైకి దూకింది వెంటనే ఋషి కోపంతో ఆ సింహాన్ని తిరిగి ఎలుకగా మార్చాడు.
ఎలుక ఎప్పటిలాగే మిగతా జంతువుల నుండి భయంతో కలుగులో దాక్కుంటూ బ్రతకసాగింది.