ఇద్దరు భార్యలు – ఒక దెయ్యం | The Two Wives and the Witch

ఇద్దరు భార్యలు - ఒక దెయ్యం | The Two Wives and the Witch
ఇద్దరు భార్యలు – ఒక దెయ్యం | The Two Wives and the Witch

చాలా కాలం క్రితం, ఇద్దరు భార్య, భర్తలు ఉండేవారు. భార్య అందంగా లేని కారణంగా భర్త ఆమెని చూడటానికి అసలు ఇష్టపడేవాడు కాదు.. ప్రతీ రోజు ఆమెతో గొడవపడుతూ ఉండేవాడు. నువ్వేమైనా అందంగా ఉన్నావనుకుంటున్నావా…?  అసలు నీకు నా పక్కన ఉండే అర్హత లేదు అనేవాడు.

కొన్ని రోజుల తర్వాత ..  ఆమె భర్త  అందంగా ఉన్న వేరొక  అమ్మాయితో  పరిచయం పెంచుకున్నాడు.. తన భార్య కన్నా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి  ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిన,  తన మొదటి భార్యను విడిచిపెట్టి, బదులుగా ఆమెను వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చింది. అందువల్ల అతను తన మొదటి భార్యను మరియు తన ఇంటిని విడిచిపెట్టి మళ్లి  పెళ్లి చేసుకున్నాడు..

మొదటి భార్య ప్రతీరోజు ఏడుస్తూ ” నేనేం తప్పు చేశాను..?  అందంగా లేకపోవడం ఏమైనా నా పోరుపాట ..? అసలు ఆమె నా  భర్త ని నా నుండి ఎలా వేరుచేస్తుంది…? నేనెలాగైనా నా  భర్తని  తిరిగి కలుసుకోవాలి. కానీ, ఎలా..? నా మొహాన్ని చూడటానికి కూడా  ఇష్టపడటం లేడు అతను. ఇప్పటికిపుడు నేను అందంగా మారలేను.. నేనేం చేయగలను నా  భర్తని తిరిగి ఎలా పొందగలను..?  అంటూ బోరున ఏడవసాగింది.

ఒక రోజు ఆమె నీటి కోసం ఒక  బావి దగ్గరికి వెళ్లి అక్కడే కూర్చొని భర్త గురించి తలచుకుంటూ ఏడుస్తుంది. అంతలోనే ఆ బావి నుండి ఒక స్వరం ఇనబడింది. తలెత్తి చూడగానే ఒక సుందరమైన స్త్రీ తన ముందు నిల్చుంది. 

“ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది ఆ స్త్రీ. .

“నా భర్త నన్ను విడిచిపెట్టి మరొక భార్యతో కలిసి జీవించడానికి వెళ్ళాడు.” అని  బదులిచ్చింది.

“ఎందుకు? మీరిద్దరు ఏమైనా గొడవపడ్డారా ..?” అడిగింది ఆ స్త్రీ.

“లేదు. నేను అందంగా  లేనందున అతను నన్ను విడిచిపెట్టాడు” అని భార్య సమాధానం ఇచ్చింది.

సుందరమైన స్త్రీ తన చేతులతో ఆమె  ముఖాన్ని తాకి, “ఇలా అంది..  నువ్వు ఏడవకూడదు,  ఇక నుండి నీకు అంత మంచే జరుగుతుంది అని చెప్పి మాయమైంది ఆ స్త్రీ.

విచారంగా ఉన్న భార్య ఇంటికి తిరిగి వెళ్ళింది, ఆమెకి బావి దగ్గర  కలుసుకున్న స్త్రీ  దెయ్యం  అని తెలియదు. ఆమె తన రోజువారీ పనులను ముగించి పడుకునే ముందు తను ఒక అందమైన అమ్మాయిని చూసింది. తన గదిలో ఎవరో ఉన్నారంటూ ముందుగా భయపడినా..  తర్వాత,  ఆ అందమైన ముఖాన్ని  చూసి ఆశ్చర్యపోయింది. కాసేపటికి తేరుకున్నాక ఆమెకి అర్థమైంది తన గదిలో ఎవరు లేరని,  తన రూపమే అద్దంలో కనబడుతుందని.  తాను చాలా  ఆశ్చర్యపోయింది.  తనకు అపుడు అర్థమైంది.  ఉదయం బావి దగ్గర కనబడిన స్త్రీ ఒక మంచి దెయ్యం అని తానే ఇలా మార్చిందని.

కొన్ని రోజుల్లోనే ..  ఆ  ఇంటిలో ఉన్న సాదా అమ్మాయి  చాలా అందమైన అమ్మాయిగా మారిందని  వార్త పట్టణం గుండా వ్యాపించాయి. చాలా మంది యువకులు అందమైన అమ్మాయిని చూడటానికి వెళ్లారు  మరియు అందులో చాలామంది తనని పెళ్లి చేసుకోమని అడిగారు.

ఈ విషయం తెలిసిన తన  భర్త ఇంటికి వచ్చాడు. అతను ఆమె అందాన్ని చూసి  చాలా  ఆశ్చర్యపోయాడు.

తన  భార్య ఇప్పుడు ఈ పట్టణంలోనే అందరికంటే అందమైన అమ్మాయి , ఇంత అందంగా మారిన తర్వాత కూడా ఆమె ఇంకొక పెళ్లి చేసుకోలేదని తెలుసుకొని ,  అతడు తన జీవితంలోకి తిరిగి అంగీకరించమని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వినలేదు.. అతను ఇంకోసారి  ఆమెను విడిచిపెట్టనని వాగ్దానం చేసి, రెండో భార్యని వదిలిపెట్టి తిరిగి ఆమె జీవితంలోకి వచ్చాడు.

అందమైన భార్య అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకువెళ్లింది.

అతని రెండో భార్య జరిగిన విషయాన్ని తెలుసుకుని అతనిపై చాలా కోపం పెంచుకుంది. అతని మొదటి భార్య ఎలా అంత అందంగా మారిందో తెలుసుకొని,  ఆమె కూడా అంతకంటే అందంగా మారి మళ్లి అతన్ని తిరిగి కలుసుకోవాలనే  ఉద్దేశ్యంతో ఆ దెయ్యం ఉండే బావి దగ్గరికి వెళ్ళింది.

తనతో తీసుకెళ్లిన కుండను పక్కన పెట్టి గట్టిగా అరుస్తూ ఏడ్వడం ప్రారంభించింది. అది విన్న దెయ్యం మొదట బావి నుండి బయటకి రాలేదు. ఎందుకంటే దెయ్యానికి తెలుసు ఆమె మనసులోని దురుద్దేశ్యం.

ఆమె ఇంకా గట్టిన అరవసాయాగింది. ఈసారి దెయ్యం ఎలాగైనా ఆమెకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో బావి నుండి బయటకి వచ్చింది.

“ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది ఆ స్త్రీ..

అందుకు బదులుగా ఆ మహిళ దెయ్యానితో ” నా భర్త నన్ను వదిలిపెట్టి వేరో అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు.  అతను తిరిగి నా దగ్గరకు రావాలంటే నేను ఆ అమ్మాయికంటే చాలా  అందంగా మారాలి అని బదులిచ్చింది.

ఆమె మాట్లాడుతుండగా, దెయ్యం  ఆమె ముఖాన్ని తాకి, ఇలా చెప్పింది.  ఏడవకండి, ఎందుకంటే మీ భర్త మిమ్మల్ని చూడటానికి వస్తాడు మీకు అంత మంచే జరుగుతుంది అని చెప్పి మాయమైంది ఆ దెయ్యం.

చాలా ఆనందంగా, ఆ మహిళ తనకు వీలైనంత వేగంగా ఇంటికి పరిగెత్తి, తలుపు మూసివేసింది. అప్పుడు ఆమె ఒక లోతైన శ్వాస తీసుకొని ఆమె అద్దం వైపు చూసింది.

కానీ ఇది ఏమిటి? ఆమె అందం అంతా అయిపోయింది. ఇది ఆమె సొంత ముఖమా? లేక  ఏదైనా జంతువా ..?  ఆమె ముక్కు రెండు అడుగుల పొడవు, ఆమె చెవులు పెద్ద రుమాలులాగా ఉన్నాయి, మరియు ఆమె కళ్ళు సాసర్ల వలె పెద్దగా మారాయి..

అంత అసహ్యంగా మారిన ఆమె తనని తాను చూసుకొని చాలా బయపడింది. ఆమె తన  తల్లి వద్దకు పరిగెత్తింది. కానీ, ఆమె సొంత తల్లి కూడా ఆమెను గుర్తించలేకపోయింది.  నిజానికి, ఆమెను చూసిన వారెవరైనా ఖచ్చితంగా భయపడతారు అంత వికారంగా మారింది తన మొహం.

ఆమెకి తాను  ఏం తప్పు చేసిందో అర్థమైంది. తన మనసులో ఉన్న దురుద్దేశ్యం ముందే తెలిసిన దెయ్యం తనని ఇలా అందవికారంగా మార్చిందని అర్ధం చేసుకుంది. ఇలాంటి మొహంతో ఈ భూమిపైనా బ్రతకలేనని అనుకుని అప్పటి నుండి  ఆహరం తీసుకోవడం మానేసింది.  కొద్దిరోజుల్లోనే నీరసించి తనువు చాలించింది.

నీతి | Moral : “దురాశ దుఃఖాన్ని చేటు. మనదైన వాటిని మనం కోరుకోవడంలో తప్పులేదు . మనది కానిది దక్కించుకోవాలని చూస్తే వినాశనం తప్పదు, అది వస్తువైనా మనుషులైనా…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *