ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి, ఇంకా ఏదైన చేయాలని అనుకున్నాడు. ఒక రోజు, అతను సమీపంలోని పట్టణంలో నివసించే ఒక తెలివైన వృద్ధుడి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వృద్ధుడు రాముని కథ విని ఆవును కొనమని సలహా ఇచ్చాడు. ఆవు పాలు ఇస్తుందని, పాలని బజారులో అమ్మి అదనంగా కొంత డబ్బు సంపాదించవచ్చని వృద్ధుడు చెప్పాడు. రాముడికి ఆ ఆలోచన నచ్చి ఆవును కొనాలని నిర్ణయించుకున్నాడు.
మరుసటి రోజు, రాము తానూ దాచిపెట్టిన డబ్బు అంత పోగేసి, మరికొంత డబ్బుని ఒక వ్యాపారి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. బజారుకి వెళ్లి ఒక ఆవును కొన్నాడు. అతను ఆవుని కొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. మరి కొంత డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించవచ్చని ఎదురు చూశాడు.
అయితే, ఇంటికి తిరిగి వస్తుండగా, అతనికి ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆహారం కోసం రాముని అడిగాడు. రాము, దయగల వ్యక్తి కావడంతో, బిచ్చగాడితో తన భోజనం పంచుకున్నాడు.
ఇంటికి చేరుకున్న రాము ఆవును సరిగ్గా కట్టివేయడం మరిచిపోయాడు. తెల్లవారి చూసేసరికి ఆవు పారిపోయింది. ఆవును కొనుక్కోవడానికి అప్పుగా తీసుకున్న డబ్బు ఎలా తీర్చాలో అని చాలా దిగులుగా ఉన్నాడు.
రోజులు గడుస్తున్నా ఆవు జాడ లేదు. ఒకరోజు వృద్ధుడు రాముని వద్దకు వచ్చి ఆవు గురించి అడిగాడు. ఏం జరిగిందో రాము చెప్పగా, ఆ వృద్ధుడు రాముని స్నేహితుల సహాయం తీసుకోమని సలహా ఇచ్చాడు.
రాముకి అప్పటిదాకా స్నేహితుల ప్రాముఖ్యత ఏంటో తెలియదు. తన స్నేహితుల వద్దకు వెళ్లి తన సమస్యను వారితో పంచుకున్నాడు. అందరూ కలిసి అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు ఆవు కోసం వెతికారు. కొద్దిరోజులు వెతికిన తర్వాత చివరకు సమీపంలోని పొలంలో మేస్తున్న ఆవును గుర్తించారు.
రాము చాలా సంతోషించాడు మరియు అతని స్నేహితులు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అవసరమైన సమయాల్లో మన స్నేహితులే మనకు ఆసరా. మన ఒక్కరి వలన కానీ పని, నలుగురితో కలిసి చేస్తే ఫలితం ఉటుందని మనం ఎల్లప్పుడూ మన స్నేహితులను ఆదరించాలని రాము గ్రహించాడు.