ఒకసారి శ్రీ కృష్ణదేవరాయలు తమ రాజ్యంలోని ఒక జైలుని పరిశీలించడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఖైదీలుగా ఉన్నఇద్దరు దొంగలు రాజు గారిని కలవాలని భటులను కోరారు. రాజు గారు అది గమనించి వారిని పిలిచారు.
వారు రాజు గారి శరణు కోరారు,వారు చాల నైపుణ్యత కలిగిన దోపిడీ దొంగలని ఇపుడు వాళ్ళని దయతలచి వదిలేస్తే ఇతర దొంగలను పట్టుకోవడంలో భటులకు సహాయం చేస్తామని మరల దొంగతనం చేయమని చెప్పారు.
అసలే దయగల శ్రీ కృష్ణదేవరాయల వారు వారి మీద దయతలచి భటులకి చెప్పి వారిని వదిలేయమని చెప్పారు కానీ ఒక షరతు తో!
రాజు గారు వారిని “తెనాలి రామకృష్ణుడు ఇంట్లో కి ప్రవేశించి విలువైన వస్తువులని దొంగిలించి తీసుకొస్తేనే” మిమ్మల్ని గూఢచారులుగా నియమిస్తామని చెప్పాడు, ఆ సవాలును దొంగలు స్వీకరించారు.
అదే రోజు రాత్రి ఆ ఇద్దరు దొంగలు తెనాలి రామన్ ఇంటికి వెళ్లి చెట్ల పొదలు దగ్గర దాక్కున్నారు. తెనాలి రామన్ భోజనం ముగించుకుని బయటకి వచ్చాడు. చెట్ల పొదలు నుండి శబ్దం రావడంతో దొంగలు వచ్చారని గ్రహించాడు.
కొంత సమయం తరువాత అతను లోపలికి వెళ్లి తన భార్యకు గట్టిగా చెప్పాడు, ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నందున మనం విలువైన వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండాలి. బంగారు, వెండి నాణేలు, ఆభరణాలన్నీ ఒక ట్రంక్‌లో పెట్టమని అతను ఆమెకు చెప్పాడు. . తెనాలి మరియు అతని భార్య మధ్య జరిగిన సంభాషణను దొంగలు విన్నారు.
అక్కడే ఉన్న దొంగలు అదంతా గమనించి రామన్ నిద్రపోగానే బావిలోని నీటిని తీయడం ప్రారంభించారు.రాత్రంతా వాళ్ళు నీటిని తీస్తూనే ఉన్నారు దాదాపు తెల్లవారు జామున వారు ఆ ట్రంక్ బయటకి తీయగలిగారు. కాని అందులో రాళ్ళు చూసి షాక్ అయ్యారు. తెనాలి రామన్ బయటకు వచ్చి, రోజు మొత్తం పనిలో ఉన్న కారణంగా మొక్కలకి నీళ్లు పోయడం కుదరలేదు అందుకారణంగా సరిగా నిద్ర కూడా పట్టేది కాదు.
తన మొక్కలకు నీళ్ళు పోసినందుకు మరియు రాత్రి బాగా నిద్రపోవడానికి కారణమయినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి రామన్ తమను మించిపోయాడని ఇద్దరు దొంగలకు అర్థమైంది. వారు తెనాలి రామన్ కు క్షమాపణలు చెప్పారు రామం వారిని దేవరాయల వారికి అప్పగించాడు.
నీతి | Moral : “తప్పుడు వాదనలను అంగీకరించకుండా ఉండాలి మరియు తెలివిగా ఉండాలి”.