జడ్జ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించు | Think Before You Judge
జడ్జ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించు | Think Before You Judge

ఒక స్కూల్ బస్సు బోల్తా పడటం వల్ల చాలా  మంది విద్యార్థులు గాయపడ్డారు , కొంత మంది విద్యార్థులు చావు బ్రతుకుల మద్యన కొట్టుకుంటున్నారు. సమాచారం అందిన పిల్లల తల్లితండ్రులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి వారిని దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

అందులో జగన్ అనే పిల్లవాడు క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాల కోసం కొట్టుకుంటున్నాడు. వాళ్ళు చేర్పించిన  హాస్పిటల్ లోని  డాక్టర్, ఇక్కడ వసతులు సరిగా లేవని ఇంకా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్పారు.

వెంటనే ఆ తండ్రి దిక్కుతోచని పరిస్థితిలో తన స్తోమతకు మించిన పని అయినా  ఒక్కగానొక్క కొడుకుని బ్రతికించుకోవడానికి  ఒక పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. హాస్పిటల్ కి తీస్కెళ్ళగానే జగన్ కి అయినా గాయాన్ని చూసిన డాక్టర్ ఇతని తలకి అర్జెంటుగా సర్జరీ చేయాల్సి ఉంది. సర్జరీ చేసే  డాక్టర్ డ్యూటీలో లేడు,  మేము తనకి ఇన్ఫార్మ్  చేస్తాము అని చెప్పారు.

ఆ మాటకి తండ్రి బాధలో… ఆ డాక్టర్ పైన చాలా కోపం వచ్చింది. హాస్పిటల్ లో ఉన్న మిగిలిన డాక్టర్స్ పైన అరిచాడు. అంతలోనే సర్జరీ చేసే  డాక్టర్ వచ్చాడు. డాక్టర్   బట్టలు మార్చుకుని నేరుగా సర్జరీ బ్లాక్‌కు వెళ్లాడు. జగన్   తండ్రి హాలులో డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. 

డాక్టర్ ని చూడగానే తండ్రి, “మీరు రావడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? నా కొడుకు జీవితం ప్రమాదంలో ఉందని మీకు తెలియదా? మీకు ఏదైనా బాధ్యత ఉందా? ”హాస్పిటల్ బయట 24 గంటలు అత్యవసర చికిత్స అందించబడును అని బోర్డు ఎందుకు పెట్టారు. ఇపుడు నా కొడుక్కి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని గట్టిగ డాక్టర్ పైన అరిచాడు.

డాక్టర్ నవ్వి, “నన్ను క్షమించండి, నేను ఆసుపత్రిలో లేను మరియు కాల్ వచ్చిన తర్వాత నేను వీలైనంత వేగంగా వచ్చాను మరియు ఇప్పుడు, మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలని  కోరుకుంటున్నాను, తద్వారా నేను నా పనిని చేయగలను” అని అన్నాడు.

వెంటనే ఆ తండ్రి “కోపాన్ని తగ్గించుకోమని అంటున్నారా..  ?! మీ కొడుకు ప్రస్తుతం ఈ గదిలో ఉంటే, మీరు ప్రశాంతంగా ఉంటారా? డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీ స్వంత కొడుకు చనిపోతే మీరు ఏమి చేస్తారు ?? ” తండ్రి కోపంగా అన్నాడు. డాక్టర్ మళ్లీ  నవ్వి, “మా డాక్టర్స్ ఎప్పుడూ  దేవుని దయతో తమ వంతు కృషి చేస్తారు మరియు మీరు మీ కొడుకు ప్రమాదం నుండి బయట పడాలని  దేవుణ్ణి  ప్రార్థించండి ” అని సమాధానం ఇచ్చారు.

“మీకు ఎలాంటి టెన్షన్ లేదు కదా మీరు ఎన్నైనా సలహాలు ఇవ్వగలరు.  అది చాలా సులభం” అని  తండ్రి గొణుకున్నాడు. .

సర్జరీ కి  కొన్ని గంటలు పట్టింది, ఆ తర్వాత డాక్టర్ సంతోషంగా బయటకు వచ్చాడు. , “ మీ కొడుకు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పాడు.! ” వెంటనే  తండ్రి సమాధానం కోసం ఎదురుచూడకుండా, “మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, నర్సును అడగండి” అని చెప్పి నడుస్తూ వెళ్ళాడు డాక్టర్ .

తండ్రి “అతను ఎందుకు అంత అహంకారి? అతను కొన్ని నిమిషాలు వేచి ఉండలేడా ..?లేట్ గా వచ్చాడు ఇపుడేమో త్వరగా వెళ్తున్నాడు. నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనకు ఉంది కదా .! అందువల్ల నేను నా కొడుకు యొక్క స్థితి గురించి అడుగుతాను ”డాక్టర్ వెళ్ళిన కొద్ది నిమిషాల తర్వాత  తండ్రికి  నర్సు సమాధానం చెప్పింది.  నర్సు ఏడుస్తూ , “డాక్టర్  కొడుకు కూడా మీ కొడుకు ఉన్న బస్సులోనే ఉన్నాడు. మీ కొడుకు ఇంత డేంజర్ పరిస్థితి నుండి చివరికి భయపడ్డాడు కానీ ఆ డాక్టర్ గారి కొడుకు  హాస్పిటల్ కి తీసుకుని వచ్చేలోపే  చనిపోయాడు.

మీ కొడుకు శస్త్రచికిత్స కోసం మేము అతనిని పిలిచినప్పుడు  డాక్టర్ తన కొడుకు శవం  దగ్గరే ఉన్నారు . అసలు సర్జరీ చేయడానికి వస్తారో లేదో అనుకున్నాము కానీ, తన యొక్క పరిస్థితిని పక్కన పెట్టి చావు బ్రతుకుల మధ్యన ఉన్న మీ కొడుకుని కాపాడడానికి వచ్చారు. అని ఏడుస్తూ చెప్పింది.   ఇప్పుడు డాక్టర్  మీ కొడుకు ప్రాణాన్ని కాపాడాడు, అతను తన కొడుకు ఖననం పూర్తి చేయడానికి ఇపుడు మీతో మాట్లాడకుండా వెంటనే వెళ్లిపోయారు.

ఇదంతా విన్న ఆ తండ్రి నోటి నుండి మాట రాలేదు. ఆ డాక్టర్ చేసిన సహాయానికి అతని కాళ్లుపట్టుకున్న తక్కువేం కాదు అని మనసులో అనుకున్నాడు. 

నీతి |Moral : ఎప్పుడు కూడా ఎవరిని జడ్జ్  చేయకూడదు ఎందుకంటె వారి జీవితం ఎలా ఉందొ అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు కదా.

2 Comments

  1. జడ్జ్ చేసే ముందు ఒక్క సారి తప్పకుండ ఆలోచించాల్సిదె.
    డా: గారిది హృదయాంతకమైన పరిస్థితి, అయినా తన కర్తవ్యంలో వెనుకాడక వ్యక్తిగత భారంచూపకుండ సాటి వ్యక్తి బిడ్డకు ప్రాణబిక్ష పెట్టిన, కనిపించే ప్రత్యక్ష దేవుడనడంలో సందేహం ఏం లేదు.
    అవును, కథ పూర్తిగా చదివి నాకు గద్ఘతిత భావన తో మనసు బరువక్కింది.😔

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *